
Gold Rate today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. శుభ ముహుర్తాల వేళ బంగారం ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం.
హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 12) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది.
ఇతర నగరాల్లో ఇలా..
- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,300లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.63,600 ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.63,100 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద స్థిరంగా ఉంది.