ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే.. | Sakshi
Sakshi News home page

ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!

Published Sun, Mar 10 2024 12:35 PM

The Worlds Richest Dog Has a Net Worth of 400 Million Dollars - Sakshi

చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్‌ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్‌లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్‌ వింటే వామ్మో అంటారు.

ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు  గున్థర్  VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్‌ షిప్‌ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు.

జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్‌స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు  కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్‌స్టెయిన్‌ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్‌ మౌరిజియో మియాన్‌కి బాధ్యతలు కూడా  అప్పగించాడు.

అలా గుంథర్‌ ట్రస్ట్‌ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్‌ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్‌స్టెయిన్‌ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్‌ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్‌చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్‌ క్లాస్‌లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్  కుక్క వంశానికే చెందుతుందన్నమాట​. ఈ గున్థర్  కుక్కలు గోల్డెన్‌ స్పూన్‌ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్‌ మ్యాగ్జైన్‌లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం.

(చదవండి: షాపు షట్టర్‌లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!)

Advertisement
 
Advertisement
 
Advertisement