న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో స్థిర నివాసానికి సంబంధించి కొన్ని నిబంధనలు మార్చే ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, భూ యాజమాన్య హక్కులు, వృత్తి విద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి అక్కడ 15 ఏళ్ల స్థిర నివాసం ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత బయటివారు తమ ఉద్యోగాలు, భూములు, విద్యాసంస్థల్లో సీట్లు కొల్లగొడతారని స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment