India Construction Sector Set To Generate Over 10 Crore Jobs By 2030, Says Report - Sakshi
Sakshi News home page

Construction Sector Jobs: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్!

Published Fri, Aug 4 2023 6:40 PM | Last Updated on Fri, Aug 4 2023 7:49 PM

India construction sector set to over 10 crore jobs by 2030 - Sakshi

భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ రంగాలలో ఒకటి 'రియల్ ఎస్టేట్' అని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 7.1 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా, రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఛార్టెడ్‌ సర్వేయర్స్‌ ప్రకారం.. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ రంగంలో ఉద్యోగులకు డిమాండ్..
ఇప్పటి వరకు నిర్మాణ రంగంలో ఉన్న చాలా మంది ప్రజలకు సరైన నైపుణ్యాలు లేవని.. అలాంటి నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి డిమాండ్ భారీగా ఉండనుంది. అంతే కాకుండా ఈ రంగానికి తగిన విధంగా మార్చుకోవడానికి కంపెనీలు కూడా తమ వంతు పాటుపడాలని కొంత మంది సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షలు ఇంజినీర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు. మిగిలిన వారికి ఈ రంగంలో ఎక్కువ నైపుణ్యాలు లేకపోవడం గమనార్హం. కావున రానున్న రోజుల్లో సరైన మెళుకువలున్నవారు ఈ రంగంలో అడుగుపెడితే తప్పకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement