తమ అలవాట్లు, సంప్రదాయ విరుద్ధ ధోరణులతో కార్పొరేట్ ప్రపంచంలో జెన్ జెడ్ వార్తల్లో నిలుస్తోంది. ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అనే కొత్త ట్రెండ్‌తో హల్‌చల్ చేస్తోంది. యువత ఉద్యోగ ఆఫర్‌లను అంగీకరిస్తారు.. కానీ వారి యజమానులకు తెలియజేయకుండా వారి మొదటి రోజున ఆఫీసులో కనిపించకుండా పోతారు. సదరు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో యజమానికి తెలియకోవడాన్ని ‘కెరీర్ క్యాట్‌ఫిషింగ్’ అంటారు.
ఆన్‌లైన్ రెజ్యూమ్ ప్లాట్‌ఫామ్ ‘సివిజెనియస్’ నివేదిక ప్రకారం జెన్ జెడ్ ఉద్యోగులు జాబ్ ఆఫర్‌లను స్వీకరిస్తున్నప్పటికీ యజమానులకు తెలియజేయకుండా మొదటి రోజు హాజరు కావడంలో విఫలమవుతున్నారు. 27 ఏళ్లలోపు ఉద్యోగుల్లో ధిక్కారణ ధోరణి పెరుగుతుందని నివేదిక తెలియజేసింది.
నెలల తరబడి ఉద్యోగాల వేట, సుదీర్ఘమైన అప్లికేషన్‌లు, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావడం.. దీనికి సంబంధించి ఫ్రస్టేషన్స్ జెన్ జెడ్‌లో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై సంవత్సరాల రాస్పిన్‌కు 32 లక్షల(సంవత్సరానికి) జాబ్ ఆఫర్ వచ్చినా ఆఫర్‌ను తిరస్కరించడం సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘ఈ జీతంతో నేను ఎలా బతకగలను? ఈ జీతంతో ఫుల్‌టైమ్ ఉద్యోగమా!’ అని ఆశ్చర్యపోతుంది ఆమె.
ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
ఈ ధిక్కారం ఒక తరం మార్పును నొక్కి చెబుతుంది. ఉద్యోగం లేదా జీవితం వారి అంచనాలకు అందని పరిస్థితి ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించే ధోరణి పెరగుతుంది. నచ్చని, అంచనాలకు తగని విధంగా ఉద్యోగం ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండడానికే యువతలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment