తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్‌క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.
ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్‌క్రీమ్‌ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్‌క్రీమ్‌లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.
నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్‌ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ విలువ రూ. 1200.
Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .
— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.
నెటిజన్ల స్పందన
కొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్‌క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment