ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ కంపెనీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కొవిడ్ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్‌గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM
— Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023
Comments
Please login to add a commentAdd a comment