కాళేశ్వరం బ్యారేజీలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాకే విచారణ
అవసరమైతే ప్రజా ప్రతినిధులను పిలిపించి వారి పాత్రపై ఆరా తీస్తాం
జస్టిస్ పినాకి చంద్రఘోష్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నిర్మాణ సంస్థ లు, అధికారులకు అవసరమైతే త్వరలోనే నోటీసు లు జారీ చేస్తామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. అవసరమైతే ప్రజాప్రతినిధులను పిలి పించి బ్యారేజీల నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాల్లో వారి పాత్రను తెలుసుకుంటామన్నారు. కాళేశ్వరం బ్యారే జీల నిర్మాణంపై న్యాయ విచారణను ప్రారంభించిన సందర్భంగా గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు.
కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును విచారిస్తారా? అని ప్రశ్నించగా.. కేసీఆర్ పేరును ప్ర స్తావించకుండా జస్టిస్ ఘోష్ పైవిధంగా బదులిచ్చా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే పత్రిక ల్లో బహిరంగ ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నాకే విచారణ ప్రారంభిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ నివేదికలు, విజిలెన్స్ దర్యాప్తు నివే దికలు, కాగ్ ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లతో పాటు ఎన్డీఎస్‌ఏ నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
న్యాయపరమైన అంశాలకు లోబడే..
వ్యక్తుల ముఖాలు చూసి కా కుండా న్యాయపరమైన అంశాలకు లోబడే విచారణ ఉంటుందని జíస్టిస్ ఘోష్ పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విచారణ కొనసాగుతుందని, ఏవైనా పొరపాట్లు జరిగితే కోర్టులు స్టే విధించే అవకాశం ఉంటుందని తెలిపా రు. బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని చెప్పారు. రెండో పర్యాయం రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు బ్యారేజీలను సందర్శిస్తానని వివరించారు.
ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన జారీ
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో లోపాల పై న్యాయ విచారణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం గురువారం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేసింది. బ్యారేజీల నిర్మాణంలో చో టుచేసుకున్న లోపాలు, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసి బాధ్యులను గుర్తించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసినట్టు తెలిపింది.
సాక్ష్యాధారాలు తప్పనిసరి: ప్రజలు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో పాటు నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సీల్డ్ కవర్‌లో మే 31లోగా బీఆర్‌కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెల్లో వేయాలని ప్రకటన సూచించింది. పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులను పంపవచ్చని తెలిపింది. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా అఫిడవిట్ పొందుపర్చని ఫిర్యాదులను తిరస్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేరుతో ఈ ప్రకటన విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment