ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్‌లో అతను 6 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 250 పరుగులు చేసి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నిన్న (ఏప్రిల్ 16) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిన బట్లర్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ వీర ఉతుకుడు ఉతికి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ శతకంతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న బట్లర్.. ఎవరూ గమనించని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బట్లర్ సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి జట్టులోని బ్యాటర్లు కూడా శతకాలు చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో (113) చెలరేగగా.. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ (109) సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లో బట్లర్ మెరుపు శతకాలతో సునామీలా విరుచుకుపడి ప్రత్యర్ధి ఆటగాళ్లు చేసిన సెంచరీలకు విలువ లేకుండా చేశాడు.
పోతే.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన బట్లర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడు సార్లు ఛేజింగ్‌లో సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో (7) బట్లర్ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ (8) టాప్‌లో ఉన్నాడు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో బట్లర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం సాధించింది. బట్లర్ సెంచరీతో కేకేఆర్ ఆటగాడు నరైన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment