వీరోచిత శతకంతో గెలిపించిన ఓపెనర్
2 వికెట్ల తేడాతో కోల్‌కతాపై రాజస్తాన్ విజయం
నరైన్ మెరుపు సెంచరీ వృథా
కోల్‌కతా: కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్‌తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది.
ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదగా...పావెల్ 1 ఫోర్, 3 సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్‌గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్... సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు.
15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే వందకు చేరుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అనూహ్య విజయం సాధించింది. తొలుత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.
సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) తొలి సెంచరీ సాధించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి గెలిచింది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు.
నరైన్ ధనాధన్
ఫిల్ సాల్ట్ (10) లైఫ్‌ను సద్వినియోగం చేసుకోకపోగా, రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్ నరైన్ 4, 6తో జట్టు పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి నైట్‌రైడర్స్ సరిగ్గా 100/1 స్కోరు చేసింది. నరైన్ సిక్సర్‌తో 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.
ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ సేన్... రఘువంశీ ఆట ముగించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (7), రసెల్ (13) జతయినా... పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయారు. కానీ నరైన్ ఫోర్లు, సిక్స్‌లతో తన ఆటతీరును కొనసాగించాడు.
చహల్ 16వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదేయడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతోనే అతని సెంచరీ 49 బంతుల్లో పూర్తయ్యింది. 18వ ఓవర్లో బౌల్ట్ యార్కర్‌తో నరైన్ పోరాటానికి ముగింపు పలికాడు. రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులతో నైట్‌రైడర్స్ 200 పైచిలుకు స్కోరు చేసేసింది.
బట్లర్ మెరుపులతో...
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడిన అది కాసేపే కావడం, టాపార్డర్‌లో కెప్టెన్ సంజూ సామ్సన్ (12) చెప్పుకోదగ్గ స్కోరే చేయలేకపోవడం రాజస్థాన్ లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓపెనింగ్ చేసిన బట్లర్ క్రీజును అట్టిపెట్టుకున్నాడు.
కానీ ధాటిగా ఆడలేకపోయాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా... ధ్రువ్ జురెల్ (2), అశ్విన్ (8), హెట్‌మైర్ (0) చేతులెత్తేయడంతో 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అండ్ (బి) అవేశ్ 10; నరైన్ (బి) బౌల్ట్; రఘువంశీ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ సేన్ 30; శ్రేయస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 11; రసెల్ (సి) జురెల్ (బి) అవేశ్ 13; రింకూసింగ్ నాటౌట్ 20; వెంకటేశ్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 8; రమణ్‌దీప్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–21, 2–106, 3–133, 4–184, 5–195, 6–215.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0–35–2, కుల్దీప్ సేన్ 4–0–46–2, చహల్ 4–0–54–1, అశ్విన్ 4–0–49–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 19; బట్లర్ నాటౌట్ 107; సామ్సన్ (సి) నరైన్ (బి) హర్షిత్ 12; పరాగ్ (సి) రసెల్ (బి) హర్షిత్ 34; జురెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 2; అశ్విన్ (సి) రఘువంశీ (బి) వరున్ 8; హెట్‌మైర్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 0; పావెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 26; బౌల్ట్ రనౌట్ 0; అవేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–97, 4–100, 5–121, 6–121, 7–178, 8–186. బౌలింగ్: స్టార్క్ 4–0–50–0, వైభవ్ 3–0–45–1, హర్షిత్ రాణా 4–0–45–2, నరైన్ 4–0–30–2, వరుణ్ 3–0–36–2, రసెల్ 1–0–17–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X ఢిల్లీ
వేదిక: అహ్మదాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment