కోహ్లి, బుమ్రా, రోహిత్‌ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్‌ | Jos Buttler Wants Rashid Khan To Play For Rajasthan Royals | Sakshi
Sakshi News home page

కోహ్లి, బుమ్రా, రోహిత్‌ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్‌

Apr 13 2024 5:26 PM | Updated on Apr 13 2024 7:08 PM

Jos Buttler Wants Rashid Khan To Play For Rajasthan Royals - Sakshi

PC: IPL.com

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఇంగ్లండ్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2018 సీజన్‌ నుంచి బట్లర్‌ రాజస్తాన్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో 863 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ కూడా నిలిచాడు.

అయితే ప్రస్తుత సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడిన బట్లర్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌లో సెంచరీ చేసి తన ఫామ్‌ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కూడా సత్తాచాటాలని బట్లర్‌ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే

ఈ మ్యాచ్‌కు ముందు బట్లర్‌ తన సహచర ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్‌త్‌ కలిసి "రాయల్స్‌ ర్యాపిడ్‌ ఫైర్‌" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్‌కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్‌ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్‌ ప్రశ్నించాడు.

అందుకు బట్లర్‌ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా బట్లర్‌ టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement