విరాట్ కోహ్లి
మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(44) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం.. ‘మిగిలిన వాళ్లకు ఆడే అవకాశం రాకపోవడం’తో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది ఆర్సీబీ.
అయితే, సొంతమైదానంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగినా రాజస్తాన్ తిరిగి పుంజుకుంది. మరో ఓపెనర్ జోస్ బట్లర్(100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు.
వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన రాజస్తాన్ జయభేరి మోగించి వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక ఆర్సీబీ ఖాతాలో మాత్రం నాలుగో ఓటమి చేరింది.
4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷
— IndianPremierLeague (@IPL) April 6, 2024
And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪
Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN
అయితే, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసినా విరాట్ కోహ్లిపై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కోహ్లి స్వార్థపూరిత ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ 183 పరుగులకు పరిమితమైందని.. ఒకరకంగా జట్టు ఓటమికి అతడు కూడా కారణమే అని నెటిజన్లు మండిపడుతున్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు(స్లోయెస్ట్ సెంచరీ) తీసుకున్న తొలి క్రికెటర్‌గా చెత్త రికార్డు సృష్టించాడు.
Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE
— JioCinema (@JioCinema) April 6, 2024
ఓవరాల్‌గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. టీ20 క్రికెట్‌లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో అతడి జట్టు 96 శాతం మ్యాచ్‌లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు.
"I've still got it, I guess." ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l
— JioCinema (@JioCinema) April 6, 2024
అంతేకాదు.. సెల్ఫిష్ అంటూ కోహ్లిని ట్రెండ్ చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ సైతం.. ‘‘200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి!’’ అంటూ కోహ్లి ఇన్నింగ్స్‌పై సెటైర్లు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment