Dale Steyn And Manjrekar Sensational Comments On Suresh Raina - Sakshi
Sakshi News home page

IPL 2021: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్‌కే ఆటగాడికి కూడా పడుతుంది..!

Published Sat, Oct 2 2021 4:36 PM | Last Updated on Sun, Oct 3 2021 10:51 AM

Dale Steyn And Manjrekar Fears It Could Be End Of Suresh Raina In IPL - Sakshi

Photo Courtesy: IPL.COM

Dale Steyn And Manjrekar Comments On Suresh Raina: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫామ్‌ లేమితో సతమతమవుతున్న స్టార్‌ ఆటగాళ్లను ఉద్దేశించి దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌, సఫారీ మాజీ ఆటగాడు డేల్‌ స్టెయిన్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌ కోల్పోతే ఎంతటి స్టార్‌ ఆటగాళ్లపై అయినా సరే వేటు తప్పదని.. ఇది డేవిడ్‌ వార్నర్‌ విషయంలో నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మాజీలు ముఖ్యంగా సీఎస్‌కే మిడిలార్డర్‌ బ్యాటర్‌ సురేశ్‌ రైనాను కార్నర్‌ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని అండ చూసుకుని రైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాడని, అతన్ని జట్టులో నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో రైనా స్కూల్‌ పిల్లాడిలా ఆడుతున్నాడని, అతని ఫామ్‌ ఇలాగే కొనసాగితే బహుశా ఇదే ఆఖరి ఐపీఎల్‌ కావచ్చని అన్నారు. సన్‌రైజర్స్‌కు అపురూప విజయాలు అందించిన వార్నర్‌ను ఆ  ఫ్రాంచైజీ ఎలా అమర్యాదగా పక్కకు పెట్టిందో.. రైనాకు కూడా అదే గతి పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ధోనిని సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగించాలని ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా.. ఈ సీజనే రైనాకు ఆఖరిది అవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రైనా 11 మ్యాచ్‌ల్లో కేవలం 157 పరుగులు మాత్రమే చేసి సీఎస్‌కే అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. అయితే ధోని నేతృత్వంలో సీఎస్‌కే జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ తొలి ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకుంది.  
చదవండి: ఆ మ్యాచ్‌లు ఫిక్స్‌ అయ్యాయట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement