Courtesy: CSK Twitter
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌ను సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని డకౌట్‌తో ఆరంభించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా ధోని మ్యాచ్ ఫీజులో కోత విధించడం మైనస్‌గా మారింది. కాగా ధోనిని మోటివేట్ చేసేందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక పాటను అతనికి అంకితం చేశాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో సీఎస్‌కే తలపడనున్న నేపథ్యంలో రెహమాన్ స్టార్‌స్పోర్ట్స్ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా లగాన్ చిత్రంలోని చలే చలో సాంగ్‌ను ధోనికి.. రంగీలా చిత్రంలోని మంగ్తా హై క్యా పాటను రైనాకు అంకితమిచ్చినట్లు తెలిపాడు.
''నెగెటివ్ మూడ్‌లో ఉన్న ధోనిని పాజిటివ్ మూడ్‌లోకి తెచ్చేందుకు లగాన్ సినిమాలోని చలే చలో పాటను ధోని భాయ్‌కి అంకితమిస్తున్నా.. క్రికెట్‌ను కలిసికట్టుగా ఆడేలా ప్లేయర్స్‌ను చలే చలో సాంగ్ ప్రేరేపిస్తుందని, అందుకే ఆ సాంగ్‌ను ధోనికోసం అంకితమిస్తున్నా.. అలాగే రైనా కోసం మంగ్తా హై క్యా సాంగ్‌ను డెడికేట్ చేస్తానని, తాను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా వాళ్లు రంగీలా పాటలే ఎక్కువగా వింటుండేవాడిని'' అని చెప్పుకొచ్చాడు. కాగా తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడబోతోంది. తొలి మ్యాచ్ చివరి బంతికి గెలిచిన పంజాబ్ వరుసగా రెండో విజయంపై కన్నేయగా.. చెన్నై బోణీ కోసం ఆరాటపడుతోంది.
చదవండి: 'అప్పటి ధోనివి కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకో'
ధోని మెడపై వేలాడుతున్న నిషేధపు కత్తి
Comments
Please login to add a commentAdd a comment