
PC: BCCI/IPL.com
RCB vs RR Live Updates:
రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది.
రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.
16 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 160/4
16 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్(11), ధ్రువ్ జురెల్(31) ఉన్నారు.
రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..
దూకుడుగా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన జైశ్వాల్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..
వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సూర్యవంశీ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(35), రాణా(6) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(35),సూర్యవంశీ(10) ఉన్నారు.
చెలరేగిన విరాట్, పడిక్కల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..
17వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. దేవ్‌దత్త్ పడిక్కల్(50), పాటిదార్(1) ఔటయ్యారు. 18 ఓవర్లకు ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(9), టిమ్ డేవిడ్(14) ఉన్నారు.
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన కోహ్లి.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 15.1 ఓవర్లకు ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(50), టిమ్ డేవిడ్(0) ఉన్నారు.
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లి 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(29) ఉన్నాడు.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..
61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(28), పడిక్కల్(1) ఉన్నారు.
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(5), సాల్ట్(6) ఉన్నారు.
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
ఆర్సీబీ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
రాజస్తాన్ యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే