వన్డేప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. వరల్డ్‌కప్ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(134) విరోచిత శతకంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్(69) పర్వాలేదన్పించాడు.
7 వికెట్లతో చెలరేగిన షమీ..
భారత బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
మొదటిలో ఓపెనర్లను ఔట్ చేసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టిన షమీ.. అనంతరం సెకెండ్ స్పెల్‌లో విలియమ్సన్‌ను ఔట్ చేసి మలుపు తిప్పాడు. ఇక షమీతో పాటు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు.
కాగా అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ(47) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం(80-నాటౌట్)తో రాణించాడు.
ఇక విరాట్ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. శ్రేయస్ అయ్యర్(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి మూడు, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో తొలిసారి న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. 2019 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌లో ఓటమికి భారత్ బదులు తీర్చుకోంది.
చదవండి: పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment