విజయం దిశగా భారత్ | India close to win in dharamshala ODI | Sakshi
Sakshi News home page

విజయం దిశగా భారత్

Published Fri, Oct 17 2014 9:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

విజయం దిశగా భారత్

విజయం దిశగా భారత్

ధర్మశాల: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ గెలుపుబాటలో పయనిస్తోంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా బౌలింగ్ లోనూ రాణించి విజయం దిశగా దూసుకెళుతోంది. 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 44.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.

శామ్యూల్స్(94) పోరాడుతున్నాడు. హోల్డర్ 11, రసెల్స్ 46, స్యామీ 15, బ్రేవో 40, పొలార్డ్ 6, రామ్ దిన్ 9, పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127) సెంచరీ సాధించాడు.

ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ విజయాన్ని విండీస్ అడ్డుకోలేదు. తొలి వన్డేలో శామ్యూల్స్ 126 పరుగులతో తో విండీస్ కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement