విశాఖ చేరుకున్న టీమిండియా- విండీస్‌ జట్లు | Team India, West Indies Cricketers Reached Visakha Airport For The Match | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న టీమిండియా- విండీస్‌ జట్లు

Published Mon, Dec 16 2019 2:46 PM | Last Updated on Mon, Dec 16 2019 3:50 PM

Team India, West Indies Cricketers Reached Visakha Airport For The Match - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చెన్నై నుంచి ఇండిగో విమానం ద్వారా విశాఖ విమానాశ్రయంలో అడగు పెట్టిన టీమిండియా, వెస్టిండీస్ క్రికెటర్లకు ఘనస్వాగతం లభించింది. ఈ నెల 18న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ మైదానంలో జరగనున్న డే అండ్‌ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో తలపడేందుకుగాను ఇరుజట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి. విమాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన నోవాటెల్‌ హోటల్‌కు ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు. దారిపొడవునా అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు చేసి స్వాగతం పలికారు. ఇక టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో.. వెస్టిండీస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో వెస్టిండీస్‌ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మెయిర్‌ను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. అతనొక విధ్వంసకర ఆటగాడని, తనదైన శైలితో బ్యాట్‌తో చెలరేగిపోయి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి అమాంతం లాగేసుకుంటాడని కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ కొనియాడిన సంగతి తెలిసిందే.

చదవండి:(ఆ విషయం మాకు తెలుసు: పొలార్డ్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement