సందిగ్ధంలో భారత్-వెస్టిండీస్ సిరీస్ | west Indies may boycott Kochi ODI over pay dispute | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో భారత్-వెస్టిండీస్ సిరీస్

Published Wed, Oct 8 2014 11:10 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

west Indies may boycott Kochi ODI over pay dispute

కొచ్చి : భారత్-వెస్టిండీస్ సిరీస్ సందిగ్ధంలో పడింది. పారితోషికం పెంచాలని వెస్టిండీస్ క్రికెటర్లు డిమాండ్ నేపథ్యంలో తొలి వన్డేపై అనుమానాలు నెలకొన్నాయి. వెస్టిండీస్ బోర్డ్ ఇటీవల ఆటగాళ్ల పారితోషికంలో 75 శాతం కోత విధించిన విషయం తెలిసిందే.దాంతో నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్తో పాటు విలేకర్ల సమావేశానికి ఆటగాళ్లు గైర్హాజరు అయ్యారు. కాగా  నేటి నుంచి (బుధవారం) వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 

కొచ్చిలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక భారత క్రికెటర్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో నిమగ్నమైతే మరోవైపు వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతోపాటు మ్యాచ్ ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కూడా విండీస్ తరుపున ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరీస్పై సందిగ్ధం కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement