కొచ్చీ: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎన్నుకుంది. కొచ్చిలో బుధవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగుతోంది. మరోవైపు పారితోషికం పెంచాలన్న ఆటగాళ్ల డిమాండ్కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. దాంతో విండీస్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యారు.
పారితోషికం పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రాక్టీస్ సెషన్కు వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతోపాటు మ్యాచ్ ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కూడా విండీస్ తరుపున ఎవరూ హాజరు కాని విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే విండీస్ ఆటగాళ్లతో బోర్డు జరిపిన చర్చల ఫలవంతం కావటంతో మ్యాచ్పై సందిగ్ధత వీడింది.