
లండన్: క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడగొట్టిన ప్రతి బౌలర్ తనదైన రీతిలో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్లు చేసుకునే ప్రత్యేక సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలో మైదానంలో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మైదానంలో సహచర ఆటగాళ్లకు దొరకుకుండా పరిగెత్తుతూసంబరాలు చేసుకుంటాడు. అయితే కరేబియన్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ సెలబ్రేషన్స్ ప్రపంచకప్‌లోనే హైలెట్‌గా నిలుస్తున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌వైపు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే తను సెల్యూట్ చేయడానికి గల కారణాలను కాట్రెల్ తాజాగా వెల్లడించాడు.
‘ఏదో సరదా కోసం నేను సెల్యూట్ చేయడంలేదు. ఎందుకంటే నేను చేసే సెల్యూట్ ‘మిలటరీ సెల్యూట్’. వృత్తిరీత్యా నేను సోల్జర్‌ని. జమైకా డిఫెన్స్ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్ తీసిన వెంటనే మార్చ్‌ఫాస్ట్ చేసి సెల్యూట్ చేస్తాను. వృత్తిలో చేరిన తర్వాత ఆరునెలల పాటు సెల్యూట్ చేయడంపై ప్రాక్టీస్ చేశాను. చిన్నప్పట్నుంచి సైనికుడిని కావాలిని కలలు కనేవాడిని. సైనికుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నేను ఎంతో గర్వంగా ఫీలయ్యాను’అంటూ కాట్రెల్ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఈ ఆటగాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రెండు వికెట్లతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment