Salute
-
ఏయ్..మా మామ సీఎం..
-
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
-
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్‌ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్‌ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
కన్నతల్లికి ఆ ఆర్మీ అధికారి చివరి సెల్యూట్.. వైరల్
వైరల్: సోషల్ మీడియా అకౌంట్లలో.. అడ్డగోలుగా వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ, వాటిలో ఆలోచింపజేసేవి, మనసును తాకేవి అరుదుగా ఉంటాయి. బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు తల్లిదండ్రులను.. పెద్దాయ్యక పట్టించుకునేవాళ్లు ఈ కాలంలో ఎందరున్నారు?. ఒక స్థాయికి చేరుకున్నాక గర్వంతో పట్టించుకోని వాళ్లే ఎక్కువైపోయారు. అయితే ఆ పెద్దాయన మాత్రం తన గౌరవ స్థానానికి మూలం తనకు జన్మనిచ్చిన తల్లేనని సగ్వరంగా చాటి చెప్పారు. మేజర్ జనరల్ రంజన్ మహాజన్.. ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మధ్యే ఆయన రిటైర్ అయ్యారు. అధికారిక వీడ్కోలు తర్వాత.. ఆయన నేరుగా అంబాలా నుంచి ఢిల్లీలోని తల్లి చెంతకు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న ఆయన.. హుషారుగా తల్లి దగ్గరకు చిందులేసుకుంటూ వెళ్లారు. తన చివరి సెల్యూట్‌ను తల్లికి చేశారు. తన ఒంటిపై యూనిఫామ్‌కు కారణమైన.. తనను ఆ స్థానంలో నిలబెట్టిన మాతృమూర్తికి పూలదండ వేశారు. ప్రేమగా హత్తుకున్నారు. ఆమె కూడా కొడుకును ఆప్యాయంగా హత్తుకుంది. ఆపై కాసేపటికే యూనిఫామ్‌ను తొలగించి.. తన రిటైర్మెంట్ లైఫ్‌ను ప్రారంభించారు. నాకు జన్మనిచ్చిన నా తల్లి.. 35 ఏళ్లపాటు నా మాతృభూమికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించింది. నా జీవితానికి ఓ సార్థకతను అందించింది. మేము అంబాలా నుండి ఢిల్లీకి వెళ్లినప్పుడు పూర్తిగా అవాక్కయ్యారు. అవకాశం గనుక లభిస్తే.. మళ్లీ ఆర్మీ కోసం సేవలందిస్తానని పేర్కొన్నారు. ఆ తల్లీకొడుకుల ప్రేమ.. నెటిజన్స్‌కు ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Smiley (@iranjanmahajan) -
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్‌సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట, వేల్స్‌లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్
ఇటీవలకాలంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్లతో అల్లరి చిల్లరిగా ఉంటున్నారు. అమ్మానాన్నలకు నేటి జనరేషన్‌ని హ్యండిల్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ప్రతి దాన్ని స్పీడ్‌గా క్యాచ్ చేసేస్తారు. ప్రశ్నించేందుకు కూడా ఏ మాత్రం భయపడరు. కానీ నేటి పిల్లలకు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవడం తెలయడం లేదనే చెప్పాలి. పైగా తల్లిదండ్రలు చెప్పినా...పాటించే పిల్లలు కూడా అరుదే. కానీ ఇక్కడోక చిన్నారి చేసిన పని చూసి ఆశ్చర్యపోకుండా ఉండరు. కచ్చితంగా ఆ చిన్నారిని మెచ్చుకోకుండా ఉండలేరు కూడా. వివరాల్లోకెళ్తే...ఇక్కడోక చిన్నారి రైల్వేస్టేషన్లో ఉన్నా ఆర్మీ జవాన్ల వద్దకు నడుచుకుంటూ వెళ్లుతుంది. అక్కడ ఉన్నవాళ్లకు కూడా మొదట అర్థం కాదు. ఆ చిన్నారి ఎందుకు ఇలా తమ వద్దకు వస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికీ ఒక జవాను పలకరిస్తాడు. అయినా ఆ చిన్నారి ఏ చెప్పకుండా హఠాత్తుగా ఆ జవాన్ కాళ్లను తాకి పాదాభివందనం చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమెను దగ్గరకు తీసుకుని మెచ్చుకోలుగా కాసేపు మాట్లాడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా
Dulquer Salmaan Salute Ott Date Fix: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా సెల్యూట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, మనోజ్ కె జయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్నిదుల్కర్ సల్మాన్ తన హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్‌పై నిర్మించారు. -
అనూహ్య సంఘటన.. బీజేపీ నేత పాదాలు మొక్కిన మోదీ.. ఎందుకంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత అవదేశ్ ప్రధాని పాదాలను తాకేందుకు కిందికి వంగారు. మోదీ వెంటనే ఆయనను వారించారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం
లక్నో: పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు. ఇక వారి అభివృద్ధి చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించింది. ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జరిగే పాసింగ్ ఔట్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణం ఆ తండ్రి పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి అపురూప క్షణాలను తీసుకురాలేం. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తండ్రి, కుమార్తెలకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. (చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్ పోలీస్ యూనిఫామ్ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నింబాడియాకి సెల్యూట్ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్ మనిపించారు. (చదవండి: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి.. ) ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్ మీడియా షేర్ చేసింది. దీనికి ‘‘కుమార్తె సెల్యూట్ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు’’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘‘తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆపేక్షా నింబాడియా సివిల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్ విభాగంలో సేవ చేయడం విశేషం. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! View this post on Instagram A post shared by ITBP (@itbp_official) -
ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే
కర్ణాటక: ఉదయం లేచిన దగ్గర నుంచి మన పనులన్నింటిని సవ్యంగా పూర్తి చేసుకుని.. రాత్రి ఇంటికి చేరుకుని.. ఏ భయం లేకుండా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోతున్నామంటే అందుకు ప్రధాన కారణం భద్రతా సిబ్బంది. వారు కుటుంబాలకు దూరంగా, నిద్రాహారాలు మాని.. మన కోసం పని చేస్తున్నారు కాబట్టే.. మనం సురక్షితంగా ఉండగల్గుతున్నాం. అలాంటి వారి పట్ల మనం గౌరవమర్యాదలు కలిగి ఉండటం వారికిచ్చే అసలైన ప్రశంస. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాలుగేళ్ల కుర్రాడు.. రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి.. వారికి సెల్యూట్ చేస్తాడు. ప్రతిగా వారు చిన్నారికి అభివాదం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ) ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనిలో నాలుగెళ్ల చిన్నారి వీర్ అర్జున్ తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ విమానాశ్రయం లోపలకి వెళ్తుంటాడు. ఆ సమయంలో వీర్‌కు ఎదురుగా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు తన విధులకు హాజరయ్యేందుకు వాహనంలో వస్తుంటారు. వారిని గమనించిన వీర్.. తండ్రి చేయి వదిలిపెట్టి.. సీఐఎస్ఎఫ్ వాహనానికి ఎదురుగా నిలబడి.. వారికి సెల్యూట్ చేస్తాడు. వీర్ని గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రతిగా సెల్యూట్ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వీర్ తండ్రి తొలుత ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజనులు వీర్‌పై ప్రశంసలు కురిపించసాగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వీడియోని రీ పోస్ట్ చేస్తూ.. ‘‘గౌరవం, దేశభక్తి వంటి అంశాలను బాల్యంలోనే నేర్పించాలి’’ అంటూ వీర్‌పై ప్రశంసలు కురిపించడంతో ఇది మరోసారి వైరలయ్యింది. ఇప్పటికే ఈ వీడియో ని 4 లక్షల మందికిపైగా లైక్ చేశారు. (చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది) ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘ఈ చిన్నారి దేశభక్తిని చూసి ఫిదా అయ్యాను. చిన్నారిని అతడి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచుతున్నారు.. ఇలాంటి మంచి లక్షణాలను బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. బాలుడికి సెల్యూట్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అభినందనలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ At #Bengaluru airport - a young Indian snaps off a salute to our men in uniform. Respect n Patriotism is learnt young. #Respect #JaHind 🇮🇳🙏🏻👏🏻 Video courtesy @MihirkJha 🙏🏻 pic.twitter.com/IeEkTZCnIH — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 24, 2021 -
ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్
డిఎస్పీగా ఉన్న కూతురికి సిఐగా ఉన్న తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్. ► ఇంట ఆడపిల్లకు గౌరవం పెరుగుతున్నందుకు ►చదువులో అమ్మాయిలు ముందంజ వేస్తున్నందుకు ►ఉద్యోగాల్లో సామర్థ్యాలు చూపుతున్నందుకు ►కుటుంబాల ఆలోచనాధోరణిలో మార్పు తెస్తున్నందుకు ►సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఈ కాలపు కూతురికి ఈ కాలం తల వొంచి చేస్తున్న సెల్యూట్ ఇది.సెల్యూట్ చేసే ఎత్తుకు సమాజం ఎదుగుతోంది.సెల్యూట్ చేయించుకునే ఉన్నతికి కూతురు అడుగులేస్తోంది. నిజంగానే ఇది మనం కూడా నుదుటికి చేయి చేర్చవలసిన సెల్యూట్. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సెల్యూట్ చేస్తున్న తండ్రి సీఐ శ్యామ్‌సుందర్ మూడు రోజుల క్రితం తిరుపతిలో ఒక స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడ జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్‌కు గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీ వై.జెస్సి ప్రశాంతి హాజరయ్యారు. తిరుపతిలో కల్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సి.ఐ వై.శ్యామ్‌సుందర్ కూడా హాజరయ్యారు. పోలీసు విభాగంలో పై అధికారి కనిపిస్తే కింది అధికారి సెల్యూట్ చేయాలి. ఇక్కడ సి.ఐ శ్యామ్ సుందర్ తన పై అధికారి ప్రశాంతికి శాల్యూట్ చేశారు. అయితే ఆ పై అధికారి ఆయన కూతురు. ఈ కింది అధికారి ఆమె నాన్న. నాన్న చేత సెల్యూట్ చేయించుకునేలా ఆ నాన్న ఆ కూతురిని చదువులో ప్రోత్సహించాడు. నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కూతురు ఉన్నతోద్యోగం సాధించింది.ఈ దృశ్యం అందరినీ సంతోషపెట్టింది. కొత్త తరాలు పాత తరాలను మించిన విజయాలు సాధించాలని, ముఖ్యంగా పాతకాలపు అభిప్రాయాలను దాటి అమ్మాయిలను ప్రోత్సహిస్తే వారు విజయాలు అందుకుంటారని సందేశం ఇచ్చింది. న్యూస్‌లో ఉన్న ఈ తండ్రీ కూతుళ్లను ‘సాక్షి’ పలుకరించింది. ప్రశాంతితో చేసిన ఇంటర్వ్యూ విశేషాలివి. అమ్మా, నాన్న, తమ్ముడుతో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నాన్నగారు సెల్యూట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ప్రశాంతి: పోలీస్ విభాగంలో పై అధికారికి సెల్యూట్ చేయడం సర్వసాధారణం. డ్యూటీ మీట్లో నాన్న నాకు ఎదురుపడినప్పుడు మా మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధం కంటే వృత్తిధర్మమే గుర్తుకొచ్చింది. సెల్యూట్ చేస్తానని నాన్న, స్వీకరిస్తానని నేను ఊహించలేదు. నాన్న నాకు సెల్యూట్ చేశాడన్న సంతోషం కన్నా సెల్యూట్ చేసేంతగా ఎదిగేందుకు ప్రోత్సహించాడని గుర్తుకొచ్చి ఆయనపై మరింత గౌరవం పెరిగింది. సెల్యూట్ దృశ్యాలు వైరల్‌తో వస్తున్న అభినందనలు జీవితంలో మరచిపోలేనివని. డిపార్ట్మెంట్లో కూడా చాలా మెచ్చుకుంటున్నారు. మీ కుటుంబ నేపథ్యం? ప్రశాంతి: మాది నెల్లూరు జిల్లా, టీపీ గూడూరు మండలం, పాపిరెడ్డిపాళెం అయినా పుట్టి పెరిగిందంతా తిరుపతిలోనే. వృత్తి రీత్యా నాన్న తిరుపతిలో స్థిరపడ్డారు. అమ్మ వై.సునీత గృహిణి. చెల్లెలు మెర్సీ స్రవంతి కడప డెంటల్ కశాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, తమ్ముడు డానియన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి సివిల్స్ శిక్షణ పొందుతున్నాడు. మా తాత పేరం వెంకయ్య ఐపీఎస్ అధికారిగా పని చేశారు. మీ చదువు? ప్రశాంతి: ఎస్వీయూలో గోల్డ్‌మెడల్‌తో ఎం.బి.ఏ చేశాను. పోలీస్ ఉద్యోగంలోకి రావడానికి మీ మీద ఎవరి ప్రభావం ఉంది? ప్రశాంతి: అమ్మలో క్రమశిక్షణ ఎక్కువ. ఆమెకు తక్కువ మాట్లాడటం అలవాటు. నాన్న డ్యూటీకి వెళితే మేము అల్లరి చేయకుండా ఉండటానికి కోపం చూపేది. అందువల్ల నాన్నతో చనువుగా ఉండేవాళ్లం. అందరు అమ్మా నాన్నల్లాగే మా అమ్మా నాన్నలు కూడా మా మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే తల్లిదండ్రుల గోల్స్ అన్నింటిని పిల్లలు సాధించలేరు. కాని వారి సూచనలను ఆదర్శంగా చేసుకొని మనకంటూ లక్ష్యం పెట్టుకొని ప్రయత్నిస్తే సక్సెస్ అవుతాం. ఐఏఎస్,ఐపీఎస్‌లు ప్రజలకు నేరుగా సేవ చేయగలరు. అందువల్ల ఐఏఎస్ అవుదామనుకున్నాను. కాని ఆ కల తొలి ప్రయత్నంలో చేజారింది. రెండవ ప్రయత్నంలో గ్రూప్స్‌లో అర్హత సాధించాను. వేరే శాఖలకు అవకాశం ఉన్నా పోలీస్ శాఖ తీసుకున్నాను. ఆ శాఖలో పని చేసిన నాన్న, తాతలను ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఈ క్రమంలో ఏదైనా వొత్తిడి ఎదుర్కొన్నారా? ప్రశాంతి: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగానే నా స్నేహితులు చాలామంది స్థిరపడ్డారు. నా మీద బంధువుల నుంచి చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని ఒత్తడి వచ్చేది. అయితే అమ్మా నాన్నలు నా లక్ష్యం వైపు ఎంకరేజ్ చేశారు. పోలీస్ శాఖలో ఇప్పుడు స్త్రీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రశాంతి: గతానికి, ఇప్పటికి పోలీస్‌శాఖలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల మహిళలు ధైర్యంగా పోలీసుశాఖలోకి వస్తున్నారు. సి.ఎం గారు, డీజీపీ గారు పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఫ్రెండ్లీ, స్మైలీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే రోజులు వచ్చాయి. పోలీసుల స్నేహ శైలి బాధితుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకత చూపుతోంది. అందువల్ల అమ్మాయిలకు అవకాశం వస్తే పోలీస్ శాఖనే ఎంపిక చేసుకోవాలని సూచిస్తాను. దిశ చట్టంపై మీ అభిప్రాయం? ప్రశాంతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్ట లక్ష్యంతో తెచ్చిందే దిశాచట్టం. సీఎం, డీజీపీలు ప్రత్యేక శ్రద్ధతో మహిళల రక్షణ కోసం దిశాను రూపొందించారు. ఫిర్యాదు చేసిన 7 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేసి 21 రోజుల్లోనే విచారణ పూర్తి చే సి, బాధితులకు న్యాయం చేకూర్చే వేగవంతమైన చట్టం ఇది. అయితే ఈ చట్టంపై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సైబర్ రిలెటీవ్గా ఈ చట్టానికి అదనపు సెక్షన్లను యాడ్ చేశారు. దిశ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం ఈ చట్టం అమలుకు ప్రయత్నాలు సాగిస్తుండడం చూస్తే దిశ ప్రాధాన్యత అర్థమవుతుంది. యువతరం అమ్మాయిలకు మీరిచ్చే సందేశం? ప్రశాంతి: ప్రతి అమ్మాయి విద్యావంతురాలిగా ఎదగాలి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. – మోపూరి బాలకృష్ణారెడ్డి, చదువులే పిల్లల ఆస్తి పిల్లల చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం అందించాను. మన వద్ద ఆస్తిపాస్తులు లేవు. మన పెద్దలు ఆస్తులు కూడబెట్టింది లేదు. మీ చదువులే నాకు ఆస్తి అని నిత్యం చెప్పేవాడిని. చదువు ప్రాధాన్యతను తెలుసుకున్న పిల్లలు ఉన్నతంగా స్థిరపడుతున్నారు. పిల్లల్ని తమ కంటే ఉన్నత స్థాయిలో చూసినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా చెప్పలేనంత ఆనందంతో గుండె ఉప్పొంగుతుంది. నా కూతురు ప్రశాంతికి సెల్యూట్ చేసే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నా. – వై.శ్యామ్‌సుందర్, సీఐ, తిరుపతి, కల్యాణ్డ్యాం, పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఇంతకు మించిన ఆనందం ఉంటుందా... భర్త, కూతురు ఒకే రంగంలో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికీ ప్రశంసలు రావడం ఇంకా సంతోషంగా ఉంది. మా అమ్మాయి ప్రశాంతిని చూసి గర్వపడుతున్నా. – వై.సునీత, తల్లి. -సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫోటోలు: కేతారి మోహనకృష్ణ -
బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సెల్యూట్ చేసి వార్తల్లో నిలిచిన ఐదేళ్ల నవాంగ్ నంగ్యాల్ మరోసారి హైలైట్ అయ్యాడు. బుడ్డోడి ‘కడక్’ సెల్యూట్‌కు ఫిదా అయిన ఐటీబీపీ సిబ్బంది అతనికి యూనిఫాం అందించి గౌరవించారు. మిలటరీ యూనిఫాం ధరించి సైనిక కవాతు చేస్తున్న నంగ్యాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, లేహ్‌లోని చుశూల్కు చెందిన కిండర్ గార్టెన్ విద్యార్థి నంగ్యాల్ తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందికి గత అక్టోబర్ 11న సెల్యూట్ చేశాడు. అతని దేశభక్తికి ముగ్ధుడైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సైనిక వందనంలో చిన్నారికి కొన్ని సూచనలు చేశారు. దాంతోపాటు ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్ అయింది. క్యూట్ సోల్జర్, భవిష్యత్ సైనికుడు, వీరుడు సిద్ధమవుతున్నాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) -
సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు
లేహ్ : చిన్న పిల్లలు ఏం చేసినా మనకు ముద్దొస్తుంటుంది. వారు చేసే అల్లరితో మనం ఉదయం నుంచి పడిన శ్రమనంతా మరిచిపోతాం. వాళ్లు గలగలా నవ్వితే ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. కొందరు చిన్నారులు తమ చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఒక బుడ్డోడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ఎమోషనల్‌కు గురిచేస్తుంది. ఒక పిల్లాడు తన ముందు నుంచి వెళ్తున్న సైనికులకు సెల్యూట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. సైనికుల పట్ల ఇలా గౌరవం తెలుపాలని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. లేహ్ నుంచి వెళ్తున్న భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఎందరో బుడ్డోడి సెల్యూట్‌కు ముగ్ధులయ్యారు.కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.(చదవండి : వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన) A budding soldier of future India. From a village in Leh, he made my day. Jai Hind pic.twitter.com/4AmO2wWj9q — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) October 11, 2020 -
వాలంటీర్లకు పోలీసు సెల్యూట్.. విచారణకు ఆదేశం
మలప్పురం: కేరళలో ఇటీవల విమానం కూలిన సమయంలో, బాధితులకు సహాయం అందించిన వాలంటీర్లకు ఓ పోలీసు అధికారి సెల్యూట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యపై విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ పోలీస్ ఏ. నిజార్, సాయం చేసిన యువతకు సెల్యూట్ చేశారు. ప్రమాదంలో మరణించిన ఓవ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరందరిని కొండట్టిలో క్వారంటైన్లో ఉంచారు. (కళ్లెదుటే ముక్కలైంది) దీనిపై మలప్పురం పోలీస్ చీఫ్ అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికి సెల్యూట్ చేయాలనే విషయంపై ప్రొటోకాల్ ఏమీ లేదని, అందువల్ల నిజార్ చేసిన చర్య చట్ట వ్యతిరేకమని చెప్పలేమన్నారు. అతనిపై ఏ చర్యలూ ఉండకపోవచ్చని అన్నారు. మలప్పురం జిల్లా కలెక్టర్ సైతం పోలీసు చర్యను క్షమించాలని అన్నారు. ప్రమాదం సమయంలో సాయమందించిన వారికి ఎయిర్ ఇండియా కూడా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: కేరళ ప్రమాద స్థలంలో విదారక దృశ్యం -
యోధులారా.. వందనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వందనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు. ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్ -
కరోనా యోధులకు నౌకాదళం సంఘీభావం..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు భారత నౌకాదళం సంఘీభావం ప్రకటించింది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పోర్టులలో నౌకలకు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. ముంబై, విశాఖ, చెన్నై, కొచ్చిలలో నౌకలకు దీపాలంకరణ చేసి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. కాగా, కరోనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ రోజు ఉదయం వాయుసేన దేశవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా పోరాటానికి రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించింది. చదవండి : కరోనా యోధులకు గౌరవ వందనం -
కరోనా : అమ్మా! మీ సేవకు సలాం
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు వైద్యులు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సోకిన బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అలాంటి డాక్టర్లను మనం ఎంత గౌరవించినా అది సరిపోదనే చెప్పాలి. తాజాగా అమెరికాలోని సౌత్విండ్సార్ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తోన్న డాక్టర్ ఉమా మధుసూదన్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఉమా మధుసూదన్ అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. (వైరల్ : టెన్నిస్‌ను ఇలా కూడా ఆడొచ్చా) కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నందుకు అక్కడి పోలీసులు, అధికారుల నుంచి ఆమె అరుదైన గౌరవం స్వీకరించారు. డాక్టర్ ఉమా ఉంటున్న వీధిలోకి దాదాపు వంద కార్లలో వచ్చిన పోలీసులు, ఇతర పౌరులు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవసూచకంతో సెల్యూట్ చేస్తూ హారన్ కొట్టారు. వీటిలో పోలీసు వాహానాలు, అగ్ని మాపక వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలు చాలానే ఉన్నాయి. అంతేగాక ఆమె ఇంటి ముందు కొన్ని సెకండ్ల పాటు వాహనాలు నిలిపి 'మీ సేవకు సలాం' అని పేపర్‌పై రాసి ఉన్న వాటిని ఆమె ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. ఉమా మధుసూదన్ పోలీసులు చేసిన పనికి సంతోషిస్తూ వారికి మద్దతుగా క్లాప్స్ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. (కరోనాలో పెళ్లి వద్దు.. డ్యూటీయే ముద్దు!) -
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్: చిరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి అమోఘమని కొనియాడిన చిరంజీవి సామాన్య జనం వారికి సహకరించాలని కోరారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చిరు తన అధికారిక ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. ఈ కరోనాను తుదిముట్టించడంలో, ఆంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి సహకరించాలి. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నా.. జైహింద్’అంటూ చిరు ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతు చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. #SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020 చదవండి: చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పేపర్ బాయ్స్‌కి ఆనంద్ మహీంద్రా సెల్యూట్
ముంబై : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డు, రైలు సేవలతో పాటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ముంబైలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్ బాయ్స్ తెరవెనుక నిజమైన హీరోలుగా నిలిచారని ఆయన అన్నారు. వారికి సెల్యూట్ చేస్తూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైలు పట్టాలపైకి పూర్తిగా నీరు చేరింది. కానీ న్యూస్ పేపర్ మాత్రం రోజు వచ్చే సమయానికే మా ఇంటికి వచ్చింది. అది కూడా పొడిగా(ఏ మాత్రం తడవకుండా). ఇందుకు కారణం తెరవెనుక ఉన్న నిజమైన హీరోలు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. మనల్ని సాధారణ రోజులుగా అనుభూతికి గురిచేసిన వారికి సెల్యూట్ చేస్తున్నట్టు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే తన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్‌ను పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. న్యూస్ పేపర్ బాయ్స్, మిల్క్ మ్యాన్, కూరగాయల అమ్మేవారు నిజమైన హీరోలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. Mumbai Airport runway shut, schools closed, train stations flooded, but the newspapers arrived in my house on time & dry! I have to salute those quiet, unsung heroes who brave torrential rain just so we can experience a ‘normal day.’ 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/iUhKMRSRFi — anand mahindra (@anandmahindra) July 2, 2019 -
‘షెల్డన్ సెల్యూట్’పై కోచ్ అసహనం..!
లండన్ : వికెట్ తీసిన వెంటనే ‘సెల్యూట్’ చేసి వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్ షెల్డన్ కాట్రెల్ తాజా వరల్డ్‌కప్‌లో ఓ నయా ట్రెండ్ సృష్టించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌వైపు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వృత్తిరీత్యా సోల్జర్ అయిన కాట్రెల్ జమైకా డిఫెన్స్ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్ తీసిన వెంటనే మార్చ్ఫాస్ట్ చేసి సెల్యూట్ చేస్తానని వెల్లడించాడు. అయితే, షెల్డన్ సెల్యూట్‌పై ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని ఒకేఒకే విషయం షెల్డన్ సెల్యూట్ అంటూ పేర్కొన్నాడు. (వికెట్ పడగానే సెల్యూట్.. కారణం ఇదే) ‘ఆటగాళ్లేం నాలుగు పదుల వయసు వారు కాదు. ఇది కుర్రాళ్ల ఆట. సంబరాలు చేసుకునే విధానం ఒక్కో జట్టుకు ఒక్కోలా ఉంటుంది. ఆటగాళ్ల మధ్య సెలబ్రేషన్స్‌లో తేడాలుంటాయి. గెలుపు సంబరాలు అటు సహచరులకు, ఇటు అభిమానులకు ఉత్తేజాన్నిస్తాయి. అయితే, ఒకరి సెలబ్రేషన్స్.. మరొకరికి నచ్చాలనే నియమమేమీ లేదు. షెల్డన్ సెల్యూట్ విషయంలో నాకూ అలానే అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ శుక్రవారం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగనుంది. (చదవండి : ఈ క్యాచ్ చూస్తే.. ‘సెల్యూట్’ చేయాల్సిందే) -
కాట్రెల్ వికెట్ సెలబ్రేషన్స్
-
వికెట్ పడగానే సెల్యూట్.. కారణం ఇదే
లండన్: క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడగొట్టిన ప్రతి బౌలర్ తనదైన రీతిలో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్లు చేసుకునే ప్రత్యేక సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలో మైదానంలో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మైదానంలో సహచర ఆటగాళ్లకు దొరకుకుండా పరిగెత్తుతూసంబరాలు చేసుకుంటాడు. అయితే కరేబియన్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ సెలబ్రేషన్స్ ప్రపంచకప్‌లోనే హైలెట్‌గా నిలుస్తున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌వైపు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే తను సెల్యూట్ చేయడానికి గల కారణాలను కాట్రెల్ తాజాగా వెల్లడించాడు. ‘ఏదో సరదా కోసం నేను సెల్యూట్ చేయడంలేదు. ఎందుకంటే నేను చేసే సెల్యూట్ ‘మిలటరీ సెల్యూట్’. వృత్తిరీత్యా నేను సోల్జర్ని. జమైకా డిఫెన్స్ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్ తీసిన వెంటనే మార్చ్ఫాస్ట్ చేసి సెల్యూట్ చేస్తాను. వృత్తిలో చేరిన తర్వాత ఆరునెలల పాటు సెల్యూట్ చేయడంపై ప్రాక్టీస్ చేశాను. చిన్నప్పట్నుంచి సైనికుడిని కావాలిని కలలు కనేవాడిని. సైనికుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నేను ఎంతో గర్వంగా ఫీలయ్యాను’అంటూ కాట్రెల్ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఈ ఆటగాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రెండు వికెట్లతో రాణించాడు. -
ఆయనకు ట్రంప్ సెల్యూట్: సమర్ధించిన వైట్‌హౌస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తర కొరియా ప్రతినిధులను ట్రంప్‌కి కిమ్ పరిచయం చేస్తుండగా.. ట్రంప్ అందరికి కరచలనం చేస్తూ వచ్చారు. చివర్లో మిలటరీ త్రీ స్టార్ జనరల్ నో క్వాంగ్ చోల్ వద్దకు రాగానే ట్రంప్ అతనికి కరచలనం చేయబోగా.. చోల్ మాత్రం ట్రంప్‌కు సెల్యూట్ చేశాడు. దీంతో ట్రంప్ అతనికి తిరిగి సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి మరో దేశ మిలటరీ అధికారికి సెల్యూట్ చేయడంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సౌదీ రాజును కలసినప్పుడు తీవ్ర వ్యాఖ్యాలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏం చెబుతారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అమెరికా నేవీ రిటైర్డ్ అధికారి జేమ్స్ స్టావిరిస్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాల మిలటరీకి సెల్యూట్ చేయడం తాను చూడలేదన్నారు. దీనిని పొరపాటు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్ మాత్రం ట్రంప్ చర్యను సమర్ధించింది. ఒక దేశ మిలటరీ అధికారి సెల్యూట్ చేసినప్పుడు తిరిగి సెల్యూట్ చేయడం కనీస మర్యాద అని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ప్రణబ్ కూతురు భయపడ్డట్టే..!
న్యూఢిల్లీ: ‘‘నాన్న(ప్రణబ్) ఏం మాట్లాడుతారనేది ఆర్ఎస్ఎస్ పట్టించుకోదు, ఆయన వచనాలేవీ వాళ్లకు గుర్తుండవు.. కొన్ని విజువల్స్ తప్ప!!’’ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లడానికి కొద్ది గంటల ముందు ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. శుక్రవారం తాజాగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. ‘‘దేనిగురించైతే నేను భయపడ్డానో అదే జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించా. కార్యక్రమం ముగిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నీచమైన చర్యలకు పాల్పడుతున్నాయి..’’ అని షర్మిష్ట పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగింది?: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి ప్రసంగించిన ప్రణబ్.. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ఉద్ఘాటించారు. ప్రసంగానికి ముందు వేదికపైనున్న నేతలంతా నిలబడి ‘ఆర్ఎస్ఎస్ సెల్యూట్’ చేయగా, ప్రణబ్‌దా మాత్రం అటెన్షన్లో ఉన్నారే తప్ప ఆర్ఎస్ఎస్ సెల్యూట్ చేయలేదు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ప్రణబ్ ఫొటో ఒకటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కిళ్ళలో విపరీతంగా షేర్ అయింది. అందులో ప్రణబ్ ఆర్ఎస్ఎస్ తరహాలో నలుపు టోపీ ధరించి, సేవక్ స్టైల్లో సెల్యూట్ చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటో వైరల్ కావడంతో షర్మిష్ట మళ్లీ స్పందించారు. తాను హెచ్చరించినట్లే జరిగిందని వ్యాఖ్యానించారు. బర్నల్ అమ్మకాలు హై జంప్!: కరడుగట్టిన కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లడంపై సొంతపార్టీ నేతలే ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఇక గురు, శుక్రవారాల్లో సోషల్ మీడియా అంతటా ప్రణబ్‌ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్ నేతలు బర్నల్(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని బీజేపీ శిబిరం జోకులు పేల్చింది. దుకాణాల్లో బర్నల్ దొరకట్లేదని, బర్నల్ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్, ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్ రివర్స్ అయింది. ‘‘ఇప్పుడా బర్నల్ కావలసింది మీకే..’’ అంటూ కాంగ్రెస్ శిబిరం కౌంటర్ విసిరింది. (ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ప్రణబ్ ఏం మాట్లాడారు?) -
సరిహద్దుకి ఆవల
సెల్యూట్ చేసిన లాంచ్‌నాయక్ రాంసింగ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆఫీసర్ కమాండింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో నేనూ వెళతాను సార్!’’ వినయంగా అన్నాడు రాంసింగ్.‘‘ఎందుకు?’’ అడిగేడు ఆఫీసర్ కమాండింగ్.‘‘స్వామి నాకు మిత్రుడు సార్!’’ చెప్పాడతను. అప్పటికే ఆఫీసర్ కమాండింగ్ చాలా విసుగ్గా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున పెట్రోలింగ్ పార్టీ ఒకటి మందుపాతరకి బలైంది. అయిదు శవాలు మాత్రం దొరికాయి. ఆయుధాలు, శరీరాల మీదున్న విలువైన వస్తువులు పట్టుకుపోయారు శత్రుసైనికులు. ఇద్దరు భారత సైనికుల శరీరాలు కత్తి పోట్లకు గురయ్యాయి. అంటే మందుపాతర పేలాక ప్రాణాలతో మిగిలిన వారిని అంతమొందించారన్నమాట. పెట్రోలింగ్ పార్టీలోని స్వామి అనే సైనికుని ఆచూకీ లేదు. శత్రుసైనికులు బందీగా పట్టుకుపోవడానికి అవకాశం లేదు. ఏ తుప్పల్లోనో శరీరం పడి ఉంటుందన్న ఆలోచనతో సెర్చింగ్ పార్టీని పంపుతున్నారు. రెండు దేశాల సరిహద్దుకి మధ్య ఎవరికీ చెందని రెండు కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న అడవి ఉంది. చొరబాటుదారులు అడవి ప్రాంతంలో పెట్రోలింగ్ పార్టీ కనుమరుగయిన మరుక్షణం సరిహద్దు దాటుతారు. చొరబాటుదారుల్ని వెంటాడే క్రమంలో పెట్రోలింగ్ పార్టీ మందుపాతర పేలుడులో చిక్కుకుంది. ఇది శత్రువు ఎత్తుగడ కావచ్చు.‘‘సరే వెళ్ళు’’ చెప్పాడు ఆఫీసర్ కమాండింగ్, ఆలోచనల నుండి తేరుకుని. రాంసింగ్ సెల్యూట్చేసి ఆక్కడి నుండి కదిలి సెర్చింగ్ పార్టీ ఇన్చార్జి హవల్దార్‌కి రిపోర్టు చేశాడు. ఆ తరువాత స్టోర్ నుండి ఆయుధాలు తీసుకున్నాడు. సెంట్రీలు చూస్తుండగా సెర్చింగ్ పార్టీ బోర్డరు దాటింది. క్రమంగా సెర్చింగ్ పార్టీలోని నలుగురు సభ్యులు కనుమరుగయ్యారు. అంతా సరళరేఖ మాదిరిగా తమ మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేటట్లు చూసుకుని నడుస్తోంది సెర్చింగ్ పార్టీ. కాళ్ళకి మెత్తని జంగిల్ షూస్ ఉండటంతో అడుగుల శబ్దం రావడం లేదు. అందరికంటే ముందున్న వ్యక్తి పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం పసిగడితే తన టీవ్ుని హెచ్చరిస్తాడతను. శత్రువుకి సమీపంగా వెళుతున్నామనే స్పృహ ఉంది అందరికీ. జాగ్రత్తతోపాటు ఆయుధాన్ని దూరం చేసుకోకూడదు. మృత్యువు చెప్పిరాదు. అడవిని సమీపించాక అంతా నేలమీద పడుకున్నారు. టీవ్ు లీడర్ బైనాక్యులర్స్‌తో అత్యంత జాగ్రత్తగా ముందుకి చూశాడు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు. క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చి నెమ్మదిగా లేచాడు. అందరూ గన్స్లోడ్ చేసి ఎటాకింగ్ పొజీషన్లో ముందుకి కదిలారు. వారి చూపు ముందున్న ప్రదేశం మీద ఉంది. ముందురోజు అక్కడ మందుపాతర పేలింది. అయిదు శవాలను తీసుకొచ్చారు క్యాంపుకి. దొరకని శరీరం కోసం ఇప్పుడొచ్చారు.లీడర్ చెయ్యి ఎత్తాడు. అందరూ టక్కున ఆగిపోయారు. అడవిలో అస్పష్టంగా ఉన్న కాలి బాటకి అడ్డంగా ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి ఉంది. ఆ గొయ్యికి చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాడు లీడర్. కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా అరిచాడు. ‘‘ఇక్కడో ల్యాండ్‌మైన్ ఉంది.’’నేలమీద రెండడగులు లోతు తవ్వి ఆ గోతిలో భూమికి సమాంతరంగా అమరుస్తారు మందుపాతర. ఒక్క సేఫ్టీపిన్ మాత్రమే పైకి కనిపిస్తుంది. దానిమీద కాలు వేసినా లేదా కాలితో తన్నినా సేఫ్టీపిన్ లోపల ఉన్న కేప్‌కి తగిలి పేలుతుంది. చుట్టు పక్కల పదడుగుల దూరం వరకూ దాని ప్రభావం ఉంటుంది. యుద్ధభూమిలో అత్యంత వినాశకారి ఆయుధం ల్యాండ్ మైన్.బాటకి ఇరువైపులా కదిలారు నలుగురు. వాళ్ళంతా నేలని పట్టిపట్టి చూశారు. శత్రువు చాలా ప్రమాదకరమైన వాడనే ఆలోచన వాళ్ళ బుర్రలో కదులుతోంది. ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక వాళ్ళు కాస్త స్వేచ్ఛగా కదలసాగారు. ఒకవైపు గాలిస్తూ వెళ్ళిన రాంసింగ్కి చిన్న లోయ ఒకటి ఎదురైంది. అతను తలెత్తి చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మకి యూనిఫాంలోని పీలిక ఒకటి వేలాడుతూ కనిపించింది. వీపుకి అమర్చుకున్న అవర్షాక్ నుండి రోప్ తీశాడు రాంసింగ్. దానికి చివర రాయికట్టి లోయలోకి వదిలాడు. మూడు వంతులు తాడు లోపలికి వెళ్ళాక నేలకి తగిలింది రాయి. ఇన్చార్జికి చెప్పి రెండోకొన చెట్టుకి కట్టి తాడు పట్టుకుని దిగడం ప్రారంభించాడు. పది నిమిషాలకి తాడు లూజయింది. ఇన్చార్జి లోపలికి తొంగి చూశాడు. వెలుగుతున్న టార్చి చుక్కలా కనపించిందంతే. గంట తరువాత లోపల నుండి రాంసింగ్ గొంతు వినిపించింది. ‘‘బాడీ దొరికింది. స్లీపింగ్ బ్యాగ్ లోపలికి పంపండి...’’స్లీపింగ్ బ్యాగ్ మరో తాడుకి కట్టి లోయలోకి పంపేడు ఇన్చార్జ్. అరగంట తర్వాత శవాన్ని పైకిలాగాక రాంసింగ్ పైకి వచ్చాడు. రాంసింగ్ సూచన ప్రకారంఇద్దరు జవాన్లు బాడీతో అక్కడ నుంచి కదిలారు. రాంసింగ్ తన అవర్షాక్ నుంచి చిన్న గునపం బయటకు తీశాడు.‘‘అదెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగాడు హవల్దార్.‘‘మనవాళ్ళ చావుకి కారణమైన శత్రువుకి బుద్ధి చెప్పాలి. మీరు లైనింగ్ పొజిషన్లో బైనాక్యులర్స్‌తో శత్రు సరిహద్దుని గమనించండి. ఎవరైనా ఇటు వస్తుంటే నన్ను హెచ్చరించండి..’’ చెప్పాడు రాంసింగ్.అతను ఏంచేస్తాడో అర్థంకాక పోయినా, నేలమీద పడుకుని బైనాక్యులర్స్ కళ్ళముందు పెట్టుకుని గమనించసాగేడు హవల్దార్. ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి అవతల మొత్తం నాలుగు మందుపాతరలు ఉన్నాయి. వాటి మధ్య దూరాన్ని కాలి అడుగులతో కొలిచాడు. ఒక్కొక్క దాని మధ్య పదడుగుల దూరం ఉంది. శత్రు సరిహద్దువైపు ఉన్న చివరి ల్యాండ్‌మైన్ నుంచి పదడుగులు వెనక్కి నడిచి అక్కడ చిన్న గునపంతో గుండ్రంగా నేలమీద గుర్తు పెట్టాడు. దాని తరువాత ఒకటి, ఆ తరువాత మరొకటి పెట్టాడు. తను చెయ్యబోతున్న పనిని ఒకసారి సమీక్షించుకున్నట్టు కొన్ని క్షణాలు చూశాడు. తను చేస్తున్నది చాలా ప్రమాదకరమైన పని. ఏ మాత్రం తేడావచ్చినా నామరూపాలు లేకుండా పోతాడు. గుర్తులు పెట్టినచోట గోతులు తవ్వడానికి అరగంట పట్టింది. ఆ తరువాత తనకి దగ్గరలోని ల్యాండ్‌మైన్ దగ్గరకు వెళ్ళాడు. దానికి కాస్త ఎడంగా చుట్టూ అడుగున్నర లోతు తవ్వాడు. ఆపని చేస్తున్నప్పుడు అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చివరగా మట్టిమీద నిలబడిన ల్యాండ్‌మైన్ కిందికి రెండు చేతులు పోనిచ్చి ఊపిరిబిగపట్టి నెమ్మదిగా పైకి లేపాడు. అది కదలకుండా తీసుకెళ్ళి తను తీసిన ఓ గొయ్యిలో ఉంచి చుట్టూ మట్టి కప్పాడు.మిగతా రెండింటిని కూడా అలాగే తీసుకెళ్ళి పాతాడు.మూడు మందుపాతరలూ వెనక్కి జరిపాక మిగిలిన దాని దగ్గరకు వచ్చాడు. బరువైన రాయికి రోప్ కట్టి ఆ మందుపాతర మీద ఉంచాడు. రెండో చివర రోప్ని ఓ చెట్టుకి వదులుగా ముడివేసి చేతులు దులుపుకున్నాడు. అంతవరకూ రాంసింగ్ చర్యల్ని గమనించిన హవల్దార్ అన్నాడు – ‘‘చాలా ప్రమాదకరమైన పని. ఏదో ల్యాండ్‌మైన్ నీ చేతిలో పేలితే?’’.‘‘నిన్న పోయిన ఆరుగురికి మరొకరు జత అయ్యేవాడు... ప్రమాదమని శత్రువుకి బుద్ధి చెప్పకుండా ఊరుకుంటామా...’’ నవ్వేడు రాంసింగ్.డెడ్‌బాడీతో క్యాంపు చేరుకుంది సెర్చింగ్ పార్టీ.మరునాడు తెల్లవారుజామున రాంసింగ్‌ని నిద్రలేపాడు సెంట్రీ. అతను బేరక్ నుంచి బయటకొచ్చి చన్నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. చల్లగా ఉంది వాతావరణం. మరికాసేపట్లో అదృశ్యం కావడానికి సమాయత్తమవుతోంది చీకటి. రాంసింగ్ సరిహద్దు దాటి నిశ్శబ్దంగా అడవివైపు నడిచాడు. అడవిలోని కాలిబాటలోకి ప్రవేశించి చెట్టుకి కట్టిన తాడు అందుకుని చేతికి చుట్టుకుని బలంగా లాగాడు.ల్యాండ్‌మైన్ మీద ఉంచిన రాయి తప్పుకుంది. సేఫ్టీ పిన్ చిన్న చప్పుడుతో పైకి ఎగిరింది. భూమి కంపించేటట్టు పెద్ద చప్పుడు. వెనక్కి తిరిగి క్యాంపు చేరుకుని సెంట్రీపోస్టులో ఇసుక బస్తామీద కూర్చున్నాడు రాంసింగ్. అతని చేతికి పొగలు కక్కుతున్న టీ మగ్ అందించాడు ఒకతను. అది తాగుతూ జరగబోయే పరిణామం కోసం ఎదురుచూడసాగేడు. సరిగ్గా తెలతెలవారుతుండగా అడవి నుంచిరెండు పేలుడులు అక్కడికి వినిపించాయి. పని పూర్తయినట్టు సెంట్రీలవైపు చూసి చిన్నగా నవ్వాడు రాంసింగ్.కుయుక్తితో భారత సైనికుల్ని మట్టుపెట్టి ఆయుధాలు, విలువైన వస్తువులు పట్టుకుపోయిన శత్రువు వలలో చిక్కుకొని అంతమయ్యాడు. ‘‘అటెన్షన్.... మార్చ్.....’’రాంసింగ్ ఎడమకాలు కుడికాలు పక్కకి చేర్చి కదిలాడు. కమాండ్ పాస్ చేసిన హవల్దార్ కూడా అతనితో సమానంగా అడుగులు వెయ్యసాగేడు. అది కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోని మేజర్ క్యాంప్ ఆఫీస్.లోపల ముగ్గురు కూర్చుని ఉన్నారు. మధ్యలో రివాల్వింగ్ చైర్లో ఉన్నాడు మేజర్. సిబ్బందిలో ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే శిక్ష విధించే కోర్ట్ ఆఫ్ మార్షల్ అది. ముందురోజు బోర్డర్ దగ్గర ఉన్న ప్లటూన్ ఆఫీసర్ కమాండింగ్కి రాంసింగ్‌ని, హవల్దార్‌ని హెడ్ క్వార్టర్‌కి పంపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇద్దరూ పది కిలోమీటర్లు నడచి హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. ముందు హవల్దార్‌ని విచారించాక రాంసింగ్‌ని పిలిచారు.‘‘హాల్ట్...’’ చెప్పాడు హవల్దార్. ఇద్దరూ ఆగాక అన్నాడు – ‘‘సెల్యూట్..’’. ఎదురుగా ఉన్న మేజర్‌కి సెల్యూట్ చేశాక ‘‘డౌన్’’ అన్నాడు. మేజర్ హవల్దార్ వైపు చూసి తలూపాడు. అతను సెల్యూట్ చేసి ఎబౌట్ టర్న్ తీసుకుని మార్చింగ్‌లో అక్కడ నుండి బయటకి నడిచాడు.రెండు నిమిషాలు తన ముందున్న పేపర్లు పరిశీలించి ఆ తర్వాత తలెత్తి రాంసింగ్ మీదకి చూపు సారించాడు మేజర్. ఇరవై రెండు సంవత్సరాలు దాటిన యువకుడతను. మీసాలు పూర్తిగా రాలేదు. మూడు సంవత్సరాల ఆరు నెలలు అతని సర్వీస్. మేజర్ కళ్ళలో చిన్నపాటి ఆశ్చర్యం కదలాడింది. ‘‘శత్రువు అమర్చిన ల్యాండ్ మైన్స్ ప్లేస్ మార్చి పదిమంది మరణానికి కారకుడవయ్యావు. ఏ ధైర్యంతో ఆ పని చేశావ్?’’ కంగుమనే గొంతుతో అడిగాడు మేజర్.‘‘ఇది ధైర్యానికి సంబంధించినది కాదు సార్. నాతో పనిచేస్తున్న ఆరుగురిని శత్రువు పొట్టన పెట్టుకున్నాడు. వారి ఆయుధాలను వారిమీదే ప్రయోగించి బదులు తీర్చాను’’ వినయంగా చెప్పాడు రాంసింగ్.‘‘అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం..’’ కఠినంగా అన్నాడు మేజర్.‘‘మీ పర్మిషన్ తీసుకునే సమయం లేదు సార్! యుద్ధభూమిలో దొరికిన శత్రువుని దొరికినట్లే హతమార్చడం భారత సైనికునిగా నా బాధ్యత’’మేజర్ తలపరికించాడు. ‘‘నీకు స్వామితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయా?’’ అడిగేడు మేజర్.‘‘లేవు సార్! అతను నా ప్రాణ స్నేహితుడు.’’ చెప్పాడు రాంసింగ్.‘‘అయితే ఎందుకు చంపావ్ అతన్ని?’’ఊహించని ప్రశ్న కావడంతో నోరు మెదపలేదు రాంసింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో వెళతానని ఈనెల తొమ్మిదిన ఆఫీర్ కమాండింగ్ని అడిగావు. అందరితోపాటు స్టోర్స్ నుంచి వెపన్స్ డ్రా చేశావు. తిరిగొచ్చాక వెపన్స్ హేండోవర్ చేసినప్పుడు స్టెన్గన్తూటాల్లో ఒకటి తక్కువైంది.’’మౌనంగా చూస్తూ ఉండిపోయాడతను.‘‘ఆ తూటా ఇదే..’’ పాలిథిన్ కవరులోని తూటా చూపించాడు మేజర్.‘‘పోస్టుమార్టవ్ులో స్వామి ఛాతీకి స్టెన్‌గన్ బేరల్ ఆనించి కాల్చినట్టు తేలింది. తూటా చేసిన గాయం నుండి కారిన రక్తం షర్టుకి అంటుకుని ఉంది. నిజానికి నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్ళావు. కాని కాల్చి చంపావ్. ఇది బాధ్యతతో కూడిన డిసిప్లిన్ ఫోర్సు. ఇక్కడఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం కుదరదు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి, అరెస్ట్ చెయ్యవచ్చు’’ గంభీరంగా అన్నాడు మేజర్.గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు రాంసింగ్. లోయలో నేల కాలికి తగిలాక తాడు వదిలిపెట్టాడు రాంసింగ్. టార్చి వెలిగించి చుట్టూ చూశాడు. కొమ్మలు, తీగలు దట్టంగా అల్లుకుని నేల చిత్తడిగా ఉంది. అదోరకమైన వాసన ముక్కుపుటాలను తాకుతోంది. చెట్లు అడ్డదిడ్డంగా పెరిగాయి. కొండరాళ్ళు నాచు రంగులో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ముందుకి కదిలాడు. ఏవో పురుగులు శరీరంమీద పాకసాగాయి. ఒకసారి వాటిని దులుపుకుని అవంత తేలిగ్గా వదలవని గుర్తించాడు. ఆచితూచి అడుగులు వేస్తూ కదలసాగేడు. మందుపాతర పేలుడులో గాయపడిన వ్యక్తి ఆ లోయలో పడితే నామరూపాలు ఉండవని గుర్తించాడు. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఓ రాయి పక్కన కనిపించింది స్వామి శరీరం.దగ్గరకు వెళ్ళి వెలుగులో చూసి చప్పున తలతిప్పుకుని రాబోయే వాంతిని ఆపుకున్నాడు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది శరీరం. ఒక కాలు తొడ వరకు లేదు. ఓ చెయ్యికి మణికట్టు లేదు. ముఖంలో కుడి భాగం లోతైన గాయంతో దెబ్బతింది. శరీరాన్ని రకరకాల కీటకాలు కమ్మేశాయి. మరింత దగ్గరకు వెళ్ళి ఛాతీమీద చెయ్యేశాడు. గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి రెండో చెయ్యివేశాడు. ప్రాణం ఉంది.‘‘స్వామీ..’’ పిలిచాడు గద్గదంగా.‘‘స్వామీ...’’ అంటూ భుజం పట్టుకుని కదిపాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేదుకాని ఎడమకన్ను సగం తెరుచుంది.‘‘నేనురా... రాంసింగ్‌ని.’’ చెప్పాడు దుఃఖాన్ని ఆపుకుంటూ.‘‘రాంసింగ్...’’ అస్పష్టంగా ఉచ్చరించాయి స్వామి పెదవులు.‘‘అవును నేనే... నిన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళతాను’’ చెప్పాడు వణుకుతున్న స్వరంతో.‘‘వద్దురా...’’‘‘పైన మన పార్టీ ఉంది. మరేం భయంలేదు.’’ చెప్పాడు.‘‘నేను బతికే స్థితిలో ఉన్నానా?’’ అడిగాడు స్వామి.‘‘అవేం మాటలురా..’’ రాంసింగ్ గొంతు పూడుకుపోయింది.‘‘ఎక్కువసేపు బతకను... అది నిజం... నా ప్రాణం పోయాక ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. లేదంటే నాకు విముక్తి ప్రసాదించు. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఇక్కడ పడిన దగ్గరనుంచి చావు కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’రాంసింగ్ మాట్లాడలేదు. ఆ స్థితిలో స్వామిని చూసేసరికి మతిపోయిందతనికి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. అతను బతకడని, ఒకవేళ బతికినాజీవచ్ఛవమని తెలుస్తూనే ఉంది.‘‘నాకు చెల్లెలు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు...’’రాంసింగ్ కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది.వణుకుతున్న చేత్తో స్టెన్‌గన్ బయటకు తీశాడు. ‘‘సో ... నేరం చేశావ్?’’ మేజర్ అన్నాడు.తల అడ్డంగా ఊపాడు రాంసింగ్. ‘‘అది నేరమని, నా భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచించలేదు సార్! నా ప్రాణ స్నేహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఏ దైవమూ వాడి చావుని ఆపలేదు. చావు ఆలస్యం కావడం వల్ల వాడు మరికాసేపు నరకయాతన అనుభవించడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వాడి కోరిక తీర్చాను సార్..’’కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.‘‘బయట వెయిట్ చెయ్యి, మళ్ళీ పిలుస్తాను..’’ చెప్పాడు మేజర్.రాంసింగ్ సెల్యూట్ చేసి బయటకొచ్చాడు.‘‘ఏమైంది బేటా?’’ బయట ఉన్న హవల్దార్ అడిగేడు.‘‘ఏం కాలేదు’’ రాంసింగ్ జవాబిచ్చాడు.‘‘ఏం కాదు’’ చెప్పాడతను. రాంసింగ్, స్వామి అతని స్క్వాడ్‌లోనే పనిచేస్తున్నారు. తనకంటే ముందు హవల్దార్‌ని పిలిచి మేజర్ విచారించాడని తెలుసు రాంసింగ్కి. అయితేలోపల ఏం జరిగిందో మాత్రం తెలియదు.అరగంట తర్వాత తన ముందు నిలబడిన రాంసింగ్‌ని అడిగేడు మేజర్.‘‘స్వామి చెల్లెలు పరిస్థితి ఏమిటి?’’‘‘ఆమెని మా గ్రామం తీసుకుపోతాను సార్. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఈమెతో నలుగురు అవుతారు. నాకు పెళ్ళిచేసుకునే వయసు రావడానికి ఇంకా రెండున్నర ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఆమె ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటాను. లేదంటేఆమెకి నచ్చినవాడికిచ్చి పెళ్ళిచేస్తాను సార్!’’మేజర్ కొన్ని క్షణాలు తన ముందున్న కాగితాలు చూసి ఆ తర్వాత తలెత్తాడు. అతని ముఖం భావరహితంగా ఉంది. ‘‘నీకిది మొదటి వార్నింగ్. తక్కువ సర్వీసులో లాంచనాయక్గా ప్రమోషన్ పొందావు. మంచి భవిష్యత్ ఉంది నీకు. ఇక నుంచి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉద్యోగం చెయ్యి. అనవసరమైన విషయాల జోలికి పోకు... వెళ్ళు.’’ చెప్పాడు గంభీరంగా.స్మార్ట్‌గా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగాడు రాంసింగ్. -
వైరల్ అవుతున్న పోలీసు కమీషనర్ వీడియో
-
వైరల్ అవుతున్న ఆ పోలీస్ సెల్యూట్..!
సాక్షి, బెంగుళూరు : కనిపించని నాలుగో సింహం పోలీస్ అంటే మనలో చాలా మందికి భయం. ఇంక వారితో మాట్లాడాలంటే కొంతమంది బెంబేలెత్తిపోతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం పోలీసు అధికారిని చూడగానే గౌరవంతో సెల్యూట్ చేశాడు. సిబ్బందితో కలిసి వెళ్తూ.. హడావిడిలో ఉన్న ఆ అధికారి కూడా హుందాగా స్పందించాడు. ఆ విద్యార్థి సెల్యూట్‌ను గమనించి.. వెంటనే ప్రతి సెల్యూట్ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. నగరంలోని మాల్య ఆస్పత్రి వద్ద ఈ అరుదైన ఘటన జరిగింది. బెంగుళూరు పోలీసు కమిషనరు టీ. సునీల్ కుమార్ మాల్య ఆస్పత్రి ముందు నుంచి వెళ్తున్నారు. కమిషనర్‌ను గమనించిన ఓ పాఠశాల విద్యార్థి గౌరవ సూచకంగా ఆయనకు సెల్యూట్ చేశాడు. తన సిబ్బందితో కలసి వెళ్తున్న కమిషనర్ ఇది గమనించి.. వెంటనే ఆ బాలునికి ప్రతి సెల్యూట్ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. ‘ఒక యూనీఫామ్ మరో యూనీఫామ్కి ఇచ్చిన గౌరవం క్రమశిక్షణను సూచిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 1500 మంది షేర్ చేశారు. 80,000 వ్యూస్ వచ్చాయి. -
పంద్రాగస్టు.. అదిరేట్టు
- వేడుకలకు భారీ ఏర్పాట్లు - ముస్తాబైన పరేడ్ గ్రౌండ్ - ముఖ్యఅతిథిగా రానున్న మంత్రి హరీశ్‌రావు - పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సంగారెడ్డి టౌన్: 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. జెండా గద్దెను ముస్తాబు చేశారు. మైదానంలో ప్రభుత్వ శాఖల తరఫున ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, శకటాలను సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, అతిథులు, ప్రజలు వీక్షించేందుకు వీలుగా షామియానాలు వేశారు. సోమవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. పోలీసు కవాతు ద్వారా గౌరవ వందనం స్వీకరిస్తారు. ఏడాది కాలంలో జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులను జిల్లా ప్రజలకు వివరిస్తారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక, కళారూప ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శిస్తారు. వివిధ శాఖల్లో పని చేస్తోన్న ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేస్తారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, అనధికారులు, ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. -
'వాట్ ఏ ఇన్నింగ్స్.. విరాట్ నీకు నా సెల్యూట్'
ముంబయి: తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పొట్టి ప్రపంచ కప్‌లో భారత్‌ను ఒంటి చేత్తో సెమీస్‌కు తీసుకెళ్లిన స్టార్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. కోహ్లీ ఆట తీరుపట్ల బాలీవుడ్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్ ముగ్దులైపోయారు. కోహ్లీ నిజంగా ఓ జీనియస్ అని అమితాబ్ తమకు ఇలాంటి ఆనందకరమైన రాత్రులను మరిన్ని ఇవ్వాలని కోరారు. ఇక అమిర్ ఖాన్ అయితే.. ఒకేసారి తనకు మారథాన్, చెస్, ఆర్చరీ చూసినట్లనిపించిందని, కోహ్లీకి నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఆరు వికెట్లతో ఆస్ట్రేలియాను భారత్ మట్టి కరిపించి సెమీస్ కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత కీలక పాత్రను కోహ్లీ పోషించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ స్థాయి ప్రశంసలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బాలీవుడ్ సూపర్ హీరోలు స్పందించారు. 'వాట్ ఏ ఇన్నింగ్స్.. విరాట్ నీకు నా వందనం. మారథాన్, చదరంగం, ఆర్చరీల కలయికను ఒకేసారి చూసినట్లుంది' అంటూ ట్వీట్ చేశారు. విరాట్ నీవు చాలా జీనియస్.. సమయానికి తగినట్లు వ్యవహరించడంలో నిజంగా నీవి అద్భుతమైన తెలివితేటలు. ఈ రాత్రిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి రాత్రులు మనకు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను' అని అమితాబ్ ట్వీట్ చేశారు. -
'అంబేద్కర్‌కు నా సెల్యూట్'
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 67వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ మహనీయులకు ఆయన ట్విట్టర్లో నివాళి అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారందరికీ జాతి తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటూ భారత రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కృషి మరువలేనిదని ఆయనకు తాను వందనం చేస్తున్నానని చెప్పారు. -
హక్కుల పతాకానికి సలాం
కొత్త కోణం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన జాతివ్యతిరేక ప్రపంచ సదస్సులో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో దళిత ప్రతినిధులు హాజరై, వివక్షకు వ్యతిరేకంగా గొంతు వినిపించారు. అయినా ఇంకా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. థర్డ్ జెండర్ హక్కులను మానవహక్కులుగా గుర్తించాలని అనేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దేశాలు వారి హక్కులను గుర్తించ డమూ అభినందించాల్సిన విషయం. అలాగే వలస కార్మికుల సమస్య కూడా ఇటీవల చాలా తీవ్రమైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు సరైన హక్కులు, సౌకర్యాలు లేవు. దక్షిణాఫ్రికాలో కదిలే రైలు నుంచి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని గెంటి వేసిన సంగతి మనం చదివాం. న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్‌ని రిజ ర్వేషన్ బోగీ నుంచి గెంటివేసిన తెల్ల జాత్యహంకారం నేటికీ కొనసాగుతూనే ఉంది. బ్రిటిష్ వాళ్లు బసచేసే హోటళ్లలో కూడా వసతి ఇవ్వలేదు. రెస్టారెంట్లో తమతో కలసి భోంచేసేందుకు సైతం అనుమతించని తెల్లజాతి వర్ణవివక్ష గాంధీని నిలువెల్లా దహించివేసింది. ఇటువంటి వెలివేతలు గాంధీలో స్వేచ్ఛా సమానత్వ కాంక్షను ప్రేరేపించాయి. తాను పుట్టిన గడ్డమీదనే వెలివేతల వెతలు అనుభవించిన వ్యక్తి డాక్టర్ భీంరావు అంబేడ్కర్. పాఠశాలలో ఒక మూలన కూర్చొని సామాజిక వెలివేతను చవిచూసిన పసిహృదయంలో రగి లిన జ్వాల ఆ తరువాత దావానలంలా మారింది. దాహం వేసి మంచినీళ్లు అడిగితే అంటరాని కులం వాడని భీంరావుని బురదగుంటలో నీళ్లు తాగమన్న ప్పుడు గాయపడ్డ ఆ హృదయం విలవిల్లాడింది. తండ్రిని చూసేందుకు ఎడ్ల బండిలో వెళుతున్న భీంరావు అంటరానివాడని తెలిసి, బండిని ముందుకు పోనిచ్చేందుకు కూడా నిరాకరించినప్పుడు ఆయనలో పరాభవం ఆగ్రహజ్వా లగా మారింది. ఈ మూడు ఘటనలు డాక్టర్ అంబేడ్కర్ అంటరానితనం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేయడానికి పునాదిగా నిలిచాయి. గాంధీ బ్రిటిష్ జాత్యహంకారంపైన, అంబేడ్కర్ అస్పృశ్యతపైన పోరాటం చేసినా ఈ రెండింటి తాత్విక పునాది సమానత్వమే. వివక్షా రహిత మానవ సమాజ నిర్మాణమే. చరిత్రలో అటువంటి ఆలోచనలు, ఆచరణలే మానవ హక్కులకు, పౌర హక్కులకు పునాదిరాళ్లుగా నిలిచాయి. పరిస్థితులు కల్పించిన అనుభవం, దానితో పాటు అందివచ్చిన చైత న్యం తమ ఉనికి కోసం పోరాటానికి సంసిద్ధులను చేస్తాయి. ఆ పోరాటం ద్వారానే హక్కులు అందివస్తాయి. సరిగ్గా 67 సంవత్సరాల క్రితం ఇదే రోజున (1948, డిసెంబర్,10) ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవహక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. అయితే హక్కుల సాధనకు గానీ, పోరాటానికి గానీ ఇది ఆదీ కాదు, అంతమూ కాదు. భారతదేశంలో మానవహక్కుల ఉద్యమానికి బుద్ధుడి తాత్వికత పునాది కాగా, సమ్రాట్ అశోకుడు సాగించిన పాలన దానికి ఆచరణ రూపమిచ్చింది. ఆయన ప్రతిష్టించిన శిలాశాసనాలలో అది సాక్షాత్కరిస్తున్నది. పిల్లర్ రాక్ ఎడిక్ట్లలో 6వ శాసనం ఈ విషయాన్ని రూఢి చేస్తున్నది. ‘‘నేను పట్టాభిషిక్తుడి నైన పన్నెండేళ్ల తర్వాత ధమ్మం ప్రబోధించే శాసనాలను రూపొందించాను. ప్రజలందరి సంక్షేమం, సంతోషం కోసం నేను చేస్తున్న విషయాలను వెల్లడిం చాను. ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి? నేను బంధుమిత్రులందరికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇస్తాను. అయితే ఇదే విధమైన ఆదరణను ప్రజలందరికీ అందిస్తున్నాను. వివిధ సంప్రదా యాలు కలిగిన అన్ని మతాలను నేను గౌరవించాను. అయితే ప్రజలందరికీ చేరువగా వెళ్లడం అన్నింటికంటే ఉత్తమమని భావిస్తాను’’. ఈ శాసనం భారతదేశంలో బౌద్ధ ధమ్మం ప్రారంభించిన ఒక మహత్తరమైన ఉద్యమం. అయితే అది ఉద్యమ రూపంలోనే కాకుండా, శాసనం ద్వారా చట్టరూపం కూడా దాల్చింది. ఒకరకంగా ఈనాటి మానవ హక్కుల ఆలోచనకు అక్కడే పునాదులు పడ్డాయంటే అసత్యమేమీకాదు. మిగతా దేశాల్లో హక్కులు, మానవహక్కుల పరిణామక్రమం ఎలాంటిదో పరిశీలిద్దాం. మనుషులందరూ ఒకే రకమైన గౌరవంతో, సమాన హక్కులతో జన్మిస్తారనేది మానవహక్కుల నిర్వచనంగా చెప్పుకోవచ్చు. మానవహక్కులు లిఖిత పూర్వక చట్టాలలో, రాజ్యాంగంలో చేరితే అవే ప్రాథమిక హక్కులవు తాయని న్యాయకోవిదుల అభిప్రాయం. మానవ హక్కులు వ్యక్తుల స్వేచ్ఛకూ, సమానత్వానికీ, విముక్తికీ మార్గనిర్దేశనం చేస్తాయి. ప్రపంచ హక్కుల చరిత్రలో బ్రిటిష్‌రాజు లిఖిత పూర్వకంగా ఆమోదించిన మొట్ట మొదటి చట్టం ‘ది మాగ్నా కార్టా’ (1215). 63 క్లాజులతో ఉన్న ఈ చట్టం ప్రజలకు పౌరహక్కులను, న్యాయపరమైన రక్షణలను అందించడం మాత్రమే కాక, అక్రమ పన్నుల విధానానికి స్వస్తి పలికింది. మళ్లీ ‘ది ఇంగ్లిష్ బిల్ ఆఫ్ రైట్స్ 1689’ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించి, అప్పటికే సంప్రదాయకంగా ఉన్న సూత్రాలను క్రోడీకరించి పౌరుల స్వేచ్ఛ, హక్కులకు ఒక రూపం ఇచ్చింది. ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1776 జూలై,4న అమెరికా స్వాతంత్య్రం ప్రకటించుకున్నది. దేశ ప్రజలు పరాయి దేశం చేతిలో బందీలుగా ఉండకూడదనే సార్వభౌమాధికార హక్కుకు అమె రికా ప్రజల ఆ తిరుగుబాటు ఒక ఉత్తేజం. ఆ తర్వాత ‘ది యు.ఎస్. బిల్ ఆఫ్ రైట్స్, 1791’ మరొక ముఖ్య ఘట్టం. ఫ్రెంచి విప్లవం మరొక రాజకీయ తాత్వి కతకు తెరతీసింది. అక్కడి రాచరిక వ్యవస్థను కూలదోసి చరిత్ర సృష్టించింది. 1789 ఆగస్టు 4న జాతీయ అసెంబ్లీ ‘ది ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ఆఫ్ ది సిటిజన్ 1789’ను ఆమోదించింది. ఇది ఫ్రాన్స్ చరిత్రను మార్చి, చాలా దేశాల హక్కుల ప్రస్థానానికి దిక్సూచిగా నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం మానవ హక్కులపైన చర్చ విస్తృత మైంది. 1929లో అంతర్జాతీయ న్యాయసంస్థ ‘మనిషి అంతర్జాతీయ హక్కు లు’ పేరుతో ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత 1945లో ‘యునెటైడ్ నేషన్స్ చార్టర్’ను 51 దేశాల ప్రతినిధులతో శాన్ఫ్రాన్సిస్కోలో ఆమోదించారు. మానవహక్కుల పరిరక్షణ, విస్తరణ మీద ఆ చార్టర్ దృష్టిని కేంద్రీకరించింది. మానవ హక్కుల పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన చార్టర్ ఇదే. ఆ తర్వాత 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ ప్రపంచ మానవహక్కుల ప్రకటనను ఆమోదించింది. ఇందులో పురుషులు, మహి ళలు, పిల్లలతో సహా మానవులందరికీ పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను కల్పిస్తూ 30 ఆర్టికల్స్‌ను రూపొందించారు. గౌరవ ప్రదమైన సమాన హక్కులను కల్పిస్తూ, స్వేచ్ఛ, న్యాయం, శాంతులతో కూడిన మానవ సమాజాన్ని నిర్మించడం ఈ ప్రకటన లక్ష్యంగా పీఠికలో పేర్కొన్నారు. ఈ ప్రకటనలోని మొదటి ఆర్టికల్‌లో పేర్కొన్నట్టుగా మనుషు లుగా జన్మించిన అందరూ సమానమైన గౌరవం, హక్కులను కలిగి ఉం టారు. ఒకరికొకరు సహకరించుకుంటూ సోదర భావాన్ని పెంపొందించే వైపు పయనించాలని కూడా తెలిపారు. రెండవ ఆర్టికల్‌లో జాతి, రంగు, లింగ, భాష, మతం, రాజకీయ, జాతీయ, వర్గ, పుట్టుక, హోదాల పరంగా వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు. ప్రతి మనిషికి జీవించే హక్కుతోపాటు స్వేచ్ఛ, భద్రత ఉండాలని మూడవ ఆర్టికల్ చెప్పింది. బానిస వ్యాపారాలు ఏ రూపంలో ఉన్నా రద్దు చేయాలనీ, ఏ వ్యక్తినీ కూడా సరైన కారణం లేకుండా నిర్బంధించడం, దేశం నుంచి బహిష్కరించడం వంటివి తగవనీ కూడా ఈ ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసముండే హక్కు ను, ఒకవేళ ఎవరైనా దేశం వదిలిపెట్టి పోదలచుకుంటే అటువంటి అవకా శాన్ని కూడా ఇవ్వడం, ఏ దేశంలోనైనా ఆశ్రయం కోరడం, ఏ దేశ పౌరసత్వా న్నైనా అభ్యర్థించడం, వ్యక్తులుగానీ, సంస్థలుగానీ, సొంత ఆస్తిని కలిగి ఉం డవచ్చుననీ, సరైన కారణం లేకుండా ఆస్తికి దూరం చేయడం సరికాదని ప్రకటనలో తెలిపారు. అందరికీ ప్రామాణికమైన వైద్యం, విద్య, గృహం, ఆహారం, దుస్తులు పొందే హక్కులు కలిగించాలి. అంతిమంగా, ఏ దేశం కూడా ఈ ప్రకటనలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పడం కానీ, సరైన ఆచ రణాత్మక కార్యక్రమాలు రూపొందించకపోవడం సరికాదని స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన వివిధ దేశాల్లో జరుగుతున్న ఎన్నో హక్కుల ఉద్యమాలకు నైతిక శక్తినిచ్చింది. ఇటీవల నియంతృత్వ దేశా ల్లో సాగిన, సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలకు కొండంత ధైర్యాన్ని చ్చింది. దీని ఆధారంగానే ఐక్యరాజ్యసమితి కొన్నిసార్లు సహేతుకమైన జోక్యాన్ని కలుగజేసుకొని ప్రజాస్వామ్య శక్తులకు బలాన్ని అందించింది. ఈ ప్రకటనలో పేర్కొన్న అంశాలు మాత్రమే కాకుండా, ఎన్నో నూతన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మానవ హక్కులను విస్తృతార్థంలో చూడటం మొదలైంది. మనిషి స్వేచ్ఛకూ, సమానత్వానికీ ఉద్దేశించిన అనేక కోణాలు ఇప్పుడు హక్కుల ప్రాధాన్యతను మరింత పెంచాయి. ముఖ్యంగా దక్షిణా సియా దేశాల్లో కొనసాగుతున్న కుల వివక్ష కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఎజెండాలో భాగం కావాలనే డిమాండ్ పెరిగింది. 2001 సంవత్స రం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన జాతి వ్యతిరేక ప్రపంచ సదస్సులో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో దళిత ప్రతినిధులు హాజరై, వివక్షకు వ్యతి రేకంగా గొంతు వినిపించారు. అయినా ఇంకా అది పూర్తి స్థాయిలో ఫలించ లేదు. థర్డ్ జెండర్ హక్కులను మానవహక్కులుగా గుర్తించాలని అనేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దేశాలు వారి హక్కులను గుర్తించ డమూ అభినందించాల్సిన విషయం. అలాగే వలస కార్మికుల సమస్య కూడా ఇటీవల చాలా తీవ్రమైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు సరైన హక్కులు, సౌకర్యాలు లేవు. యుద్ధాలు, ఘర్షణల వల్ల నిరాశ్రయులై ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సమస్యలు కూడా ఎక్కువగా తెర మీదకు వస్తున్నాయి. వస్తూనే ఉంటాయి. మానవహక్కుల ప్రస్థానం, ఉద్య మం స్తంభించిపోదు. పోకూడదు. మానవ జాతి మనుగడ సాగించినంత కాలం హక్కుల ఉద్యమం సజీవంగా ఉంటుంది. ఆధిపత్య అగ్ర రాజ్యాలు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మానవ హక్కులను హరించడం పట్ల ఐక్యరాజ్యసమితి కఠిన వైఖరి అవలంబించాలి. దాదాపు అన్ని దేశా ల్లోనూ అణచివేతకు గురవుతున్న మహిళల, మైనారిటీల, దళితుల, ఆది వాసీల, థర్డ్ జెండర్స్ హక్కులకు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తగు ప్రాధాన్యమిచ్చి, ఆ వర్గాల ఆత్మగౌరవాన్నీ, హక్కులనూ పరిరక్షించడానికి ఐక్యరాజ్య సమితి మరింత నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తే తప్ప మానవ హక్కుల ప్రకటనకు సార్థకత ఉండదు. - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
ప్రేమకు వందనం
ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమల్ల చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమించుకుని పెళ్లి చేసుకునేది ఒక కోణమైతే, ప్రేమించుకుని విడిపోయి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం రెండో కోణం. మరి మూడో కోణం ఏంటనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’’ అని చెప్పారు. ‘‘అక్టోబరు 10న పాటలను, నవంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.పి, కెమెరా: సూర్య, సమర్పణ: కందిమల్ల పద్మావతి. -
చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!
లండన్: చక్కగా ఎర్రటి గౌను వేసుకొని, తలపై నల్లటోపి పెట్టుకొని చేతిలో పూల బొకేతో చిరునవ్వులు చిందిస్తున్న కనిపిస్తున్న ఆ పాప పేరు మైసీ గ్రాగరీ. ఆరేళ్ల ఈ పాప పూల బొకే ఇస్తుంది ఎవరికనుకుంటున్నారు? బ్రిటన్ మహారాణికి. చక్కగా వందనం చేస్తూ తనకు పూల బొకే అందించిన మైసీని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 అభినందించి అలా ముందుకు వెళ్లిందో లేదో ఆ పాప ఆనందం ఇట్టే మాయమైంది. కెవ్వున ఏడుపు కేక పెట్టింది. ఎందుకంటారా.. మరేం లేదు.. బ్రిటన్ రాణి వస్తుండగా ఆమెకు స్వాగతం పలికే సోల్జర్స్లో ఒకతను ఆ పాప మైసీ పక్కనే ఉన్నాడు. పూల బొకే అందుకుని బ్రిటన్ రాణి సరిగ్గా తనను దాటి వెళుతుండగా అతడు వేగంగా తన చేయితో సెల్యూట్ చేశాడు. ఈ క్రమంలో అతడి చేయి మైసీకి బలంగా తగలడంతోపాటు టోపీ కూడా ఊడిపోయింది. దీంతో అప్పటి వరకు నవ్వులు చిందించిన ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో భిక్కమొఖం పెట్టి తన తల్లి చాటుకు వెళ్లి నిల్చుని బుంగమూతితో కాస్త కోపంగా ఆ సైనికుడి వైపు చూసింది. ఆ వెంటనే సైనికుడు దగ్గరికొచ్చి మైసీకి, ఆమె తల్లికి క్షమాపణలు చెప్పాడు. -
వాళ్లకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది!
‘‘అంత ఎత్తు నుంచి పడితే ఇంకేమన్నా ఉందా? కిందపడేలోపే ఆ టెన్షన్‌కు గుండె ఆగిపోతుంది. అంతెందుకు... మరీ సున్నిత మనస్కులైతే ఆ విన్యాసాలు చూస్తున్నప్పుడే కళ్లు తిరిగి పడిపోతారు. నేను మాట్లాడుతున్నది దేని గురించో తెలుసా? ‘సర్కస్’ గురించి. ప్రాణాలకు తెగించి మరీ సర్కస్ కళాకారులు మనకు వినోదం అందిస్తారు. వాళ్ల ధైర్య సాహసాలకు ‘సెల్యూట్’ చేయాలనిపిస్తుంటుంది. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి మాత్రమే సర్కస్ చూసే తీరిక చిక్కుతోంది. చిన్నప్పుడు మాత్రం తెగ చూసేదాన్ని. నిప్పుల్లోంచి దూకడం, చిన్న పెట్టెలో దేహాన్ని ఇమిడ్చేయడం... ఇలా సర్కస్ కళాకారులు చేసే విన్యాసాలు చూసి, ఎప్పటికైనా మనమూ నేర్చుకోవాలనుకునేదాన్ని. ఆ కోరిక తీరనే లేదు. భవిష్యత్తులో తీరుతుందో లేదో తెలియదు’’ - కత్రినా కైఫ్ -
వారి సేవలకు సెల్యూట్
ఇరువురికి ఇండియన్ పోలీస్ మెడల్స్ క్రైం (కడప అర్బన్ ) / ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పని చేస్తూ తమ విధి నిర్వహణలో విశిష్ట సేవలందిస్తున్న ఇరువురిని ఇండియన్ పోలీస్ మెడల్స్‌కు ఎంపిక చేస్తూ భారత ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జిల్లా కేంద్రంలో ఆర్మ్డ్ రిజర్వుడు ఎస్ఐగా పనిచేస్తున్న వీసీ కుళ్లాయప్ప, ప్రొద్దుటూరు ట్రాఫిక్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.నరసయ్య (పీసీ నెంబరు 720) ఉన్నారు. తాను చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించిన ందుకు కుళ్లాయప్ప హర్షం వ్యక్తం చేశారు. జమ్మలమడుగుకు చెందిన వీసీ కుళ్లాయప్ప 1982లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. 1994లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. 2012లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. బాంబు స్క్వాడ్‌లో పనిచేస్తూ అనేక సందర్భాలలో బాంబులను నిర్వీర్యం చేసిన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న బాలశెట్టి నరసయ్య (పీసీ 720)ను ఇండియన్ పోలీస్ పతకం వరించింది. రాజంపేటకు చెందిన నరసయ్యకు భార్య వెంకటసుబ్బమ్మ, కుమార్తెలు బీఆర్ వరకుమారి, బీఆర్ మానస, కుమారుడు సాయినాథ్ ఉన్నారు. ఆయన 1979లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. జిల్లాలోని వీఎన్‌పల్లి,మైలవరం. రాజుపాళెం తదితర స్టేషన్లలో పని చేశారు. 2008లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2013లో ఏఎస్ఐగా ప్రమోషన్ పొందారు. వీఎన్‌పల్లిలో పని చేస్తూ ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు ఏడాదిన్నర క్రితం వచ్చారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు మెడల్ అందుకుంటారని అధికారులు తెలిపారు. -
జాతి పతాకకు సెల్యూట్ చేయను..
సుర్ధేపల్లి (నేలకొండపల్లి): జాతి పతాకకు సెల్యూట్ చేయడానికి, జాతి పిత మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టడానికి ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరాకరించాడు. దీనిని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో... ‘‘అది నా వ్యక్తిగతం’’ అంటూ వాదనకు దిగారు. అందరూ కలిసి గట్టిగా మందలించడంతో.. ‘‘నూను బడికే రాను పోండి’’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుర్ధేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... నేలకొండపల్లి మండలంలోని సుర్ధేపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలకు విద్యార్థులతోపాటు గ్రామస్తులు, సర్పంచ్, స్కూల్ మేనేజ్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చారు. సమయం గడుస్తున్నా జెండా ఎగురవేసేందుకు ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ ముందుకు రాలేదు. ‘‘ఆలస్యమవుతోంది. (గాంధీ చిత్రపటం వద్ద) కొబ్బరికాయ కొట్టి, జెండా ఎగరేయండి’’ అని సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్ కోరారు. ‘‘కొబ్బరికాయ కొట్టడం నాకిష్టం లేదు. కొట్టను. జాతీయ జెండాకు కూడా సెల్యూట్ చేయను’’ అని ఆయన తెగేసి చెప్పాడు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘‘అది నా వ్యక్తిగతం. దానిని మార్చుకోను. అవసరమైతే ఉద్యోగానికే రాజీనామా చేస్తాను కానీ.. జెండాకు మాత్రం సెల్యూట్ చేయను’’ అంటూ మొండికేశాడు. అంతేకాదు.. తెలంగాణ గీతాన్ని ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడాడు. అతని తీరుతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు గట్టిగా మందలించడంతో.. ‘‘అసలు నేను బడికే రాను పోండి’’ అంటూ, మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం, అక్కడే గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సమాచారమందుకున్న వెంటనే తహశీల్దార్ జి.సుదర్శన్‌రావు, ఎంఈఓ యాలమూడి రవీందర్, ఆర్ఐలు వసంత, వెంకటేశ్వర్లు వచ్చి గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ జెండాను అవమానించిన సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పి, అదే పాఠశాలలోని ఉపాధ్యాయురాలు ప్రమీలతో 10.20 గంటలకు పతాకావిష్కరణ చేయించారు. అనంతరం, పాఠశాలలో గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ గతంలో కూడా ఇదే మాదిరిగా వ్యహరించారని గ్రామస్తులు, సర్పంచ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రధానోపాధ్యాయుడు గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా తప్పించుకునేందుకుగాను గతంలోలోనూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెలవు పెట్టినట్టు చెప్పారు. హెచ్ఎం తీరుపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని తహశీల్దార్ చెప్పటంతో గ్రామస్తులు శాంతించారు. -
ఇదేంది బాస్
జూనియర్ల వద్ద సీనియర్ల కొలువు {పొబేషనరీ ఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు సీనియర్లకు సెకండ్ ఎస్సైగా డిమోషన్ పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్‌గా పీఎస్సై పోస్టింగ్‌లు అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత సబ్ ఇన్స్పెక్టర్లు నిన్నటి వరకు వారందరూ సీనియర్ ఎస్సైల వద్ద వృత్తిలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుంచి కేసు దర్యాప్తు వరకు అనేక విషయూలను సీనియర్ల వద్ద ఉండి నేర్చుకున్నారు. సీనియర్లు ఆదేశించగానే ‘ఎస్ సర్’ అని సెల్యూట్ చేస్తూ గౌరవించారు. పోలీస్ బాస్‌ల నిర్ణయం పుణ్యమా.. అని తాజా పరిస్థితి తారుమారైంది. ప్రొబేషనరీ ఎస్సైలకు సీనియర్లే సెల్యూట్ చేయూల్సిన వింత పరిస్థితి ఏర్పడింది. ఇది తమను అవమానించడమేనని, ఆత్మగౌరవాన్ని గాయపరచడమేనని సీనియర్లు వాపోతున్నారు. వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల(పీఎస్సై)ల పోస్టింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. సీనియారిటీని విస్మరించి కొత్తగా శిక్షణ తీసుకున్న పీఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న సీనియర్లను అదేస్థానంలో ఉంచి.. కొత్తగా శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన వారికి ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. 2013 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి తాజాగా రూరల్‌లో 27 మందికి, అర్బన్ పరిధిలో ఆరుగురికి శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఇచ్చిన పోస్టింగ్ ప్రాధాన్యతే ఇక్కడ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆయూ స్థానాల్లో ఎస్సై లుగా కొనసాగుతున్న వారిని డిమోట్ చేసి వారి స్థానంలో ప్రొబేషనరీ ఎస్సైలను నియమించారు. 2002, 2007, 2009 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు పనిచేస్తున్న స్థానాలకు 2013 బ్యాచ్ ఎస్సైలను పంపించారు. వారి వద్ద సీనియర్లు సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ అందుకున్న కొందరు ఎస్సైలను ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడంతోపాటు వారి కిందే అక్కడే పని చేయాలని సీనియర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. నిన్నగాక మొన్న శిక్షణ పూర్తిచేసుకున్న వారు చెప్పినట్లు ఇకపై సీనియర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి న్యాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తికాకుండానే... ప్రస్తుతం పోస్టింగ్‌లు పొందిన ఎస్సైలకు ప్రొబేషనరీ డిక్లేర్ కావడానికి ఇంకా 18 నెలల సమయం ఉంది. వీరంతా 13 నెలలు హైదరాబాద్ అప్పాలో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ కాలం ప్రొబేషనరీ పిరియడ్‌లోకి రాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 6 నెలలపాటు ఇక్కడ శిక్షణ ఉంటుది. ఈ సమయంలో వారు కానిస్టేబుల్‌గా, హెడ్‌కానిస్టేబుల్‌గా, ఏఎస్సైగా పలు విభాగాల్లో పనిచే యాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల కాలం కలిపితే మరో 18 నెలలు ఇంకా ప్రొబేషనరీ కాలం ఉంటుంది. ఈ కాలం పూర్తయితే సర్వీసు పరంగా వీరికి అన్ని కౌంటింగ్‌లోకి వస్తాయి. ఈ ప్రొబేషనరీ సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఏమైనా తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం నుంచే డిస్మిస్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదెక్కడి న్యాయం.. అర్బన్ పరిధిలో ఆరుగురు పీఎస్సైలను మామునూరు, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, జఫర్‌గఢ్ పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అయా స్థానాల్లో పనిచేస్తున్న వారంతా సెకండ్ ఎస్సైలుగా కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రూరల్ పరిధిలో మరిపెడ పీఎస్ ఎస్సై జె.వెంకటరత్నం, చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, చేర్యాల ఎస్సై సూర్యప్రసాద్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్సైలకు బాధ్యతలు అప్పగించి అక్కడే సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలి. నర్సింహులపేట ఎస్సై వై. వెంకటప్రసాద్ ఏటూరునాగారం బదిలీ అయ్యూరు. ఆయన కూడా తన వద్ద శిక్షణ పొంది ఏటూరునాగారం పీఎస్ ఎస్సైగా పోస్టింగ్ పొందిన రవీందర్ వద్ద సెకండ్ ఎస్సైగా పనిచేయూల్సి ఉంది. పదేళ్ల సీనియూరిటీ కలిగిన చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, మామూనూరు ఎస్సై సత్యనారాయణ సైతం తాము పనిచేసే స్టేషన్లలోనే సెకండ్ ఎస్సైలుగా డిమోట్ అయ్యూరు. ఆవేదన చెందుతున్న సీనియర్లు జూనియర్లు వస్తే సీనియర్లకు పదోన్నతి ఉండాలిగానీ అందుకు విరుద్ధంగా డిమోట్ చేయడం చర్చనీయూంశంగా మారింది. అనుకోని విధంగా ఉత్తర్వులు రావడంతో బాధిత ఎస్సైలు కలత చెందుతున్నారు. జూనియర్ల వద్ద తమను సెకండ్ ఎస్సైలుగా పనిచేయించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన చెందుతున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి తమను బలిచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే తమను వీఆర్లోనో, ఉన్నతాధికారులకు అటాచ్డ్గానో నియమించినా బాగుండేదని వాపోతున్నారు. శాఖాపరంగా తప్పులు చేసిన వారికి మాత్రమే.. ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తారని కాని తాము ఎలాంటి తప్పుడు విధానాలు అవలంభించకున్నా తమకు ఈ శిక్ష ఎందుకు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. -
ఖాదీప్యమానం!
అర్ధరాత్రి ఒక్కసారిగా దీపాలన్నీ వెలిగినట్లు... పెద్ద కాంతితో వచ్చేసింది స్వాతంత్య్రం! ఆ వేళ ఇద్దరే ఇద్దరు విశ్వరూపమైపజ్వరిల్లారు. ఒకరు గాంధీ, ఇంకొకరు... గాంధీ తర్వాత గాంధీ అంతటి... ‘ఖాదీ’! ‘క్విట్ ఇండియా’ అని సమర వీరులు కళ్లురిమితే... ‘వియ్ డోన్ట్ వాంట్’ అని... విదేశీ వస్త్రాలను విసిరికొట్టారు ఖాదీ యోధులు. జాతీయ ఉద్యమంలో ఒక ఆయుధం... ఖాదీ. జాతీయ పతాకపు వర్ణాలకు ప్రాణాధారం... ఖాదీ. భరతజాతికి ఆత్మగౌరవం... ఖాదీ. ఆగస్ట్ 15 వచ్చేస్తోంది. ‘బ్రాండెడ్’లను కొక్కేనికి తగిలించి, మన సొంత బ్రాండ్‌తో సెల్యూట్ కొట్టేందుకు ‘ముస్తాబు’ అవండి. ఖాదీని కట్టినంత కాలం... భారత్ దేదీప్యమానం! కర్షకుడి కృషితో పండిన పత్తిని చేనేత కార్మికుడు చరఖాపై వడికి, దారం తీసి, మగ్గం మీద నేయగా వచ్చిన వస్త్రం.. ఖాదీ! భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ దేశభక్తిని పెంపొందింపజేసే లక్షణాలను పుష్కలంగా మూటగట్టుకొని నేటి యువత కోసం ఎదురుచూస్తున్నది ఖాదీ!! మన ఆత్మగౌరవ పతాక! ‘ఏ దేశంలోనైనా హస్తకళలు, కుటీర పరిశ్రమల అభివృద్ధి తగినంతగా లేదంటే ఆ దేశ పౌరుల్లో తెలివి, ఆ దేశంలో సంపద లేనట్టే! దిగుమతి అయ్యే వస్తువులను బట్టి చూస్తే ఆ దేశపౌరుల సోమరితనం, పరాన్నజీవితాన్ని గడుపుతుండటం సులువుగా గ్రహించవచ్చు’ అనేది గాంధీజీ అభిప్రాయం. అందుకే స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహించారు. ఇందులో భాగంగా తానే స్వయంగా నూలు వడికి, ఖాదీ వస్త్రాన్ని తయారుచేసేవారు. ఖాదీ ఎందుకు ధరించాలంటే! ఖాదీ దుస్తులు ఇచ్చే హుందాతనాన్ని ఇతర వస్త్రాలు ఇవ్వలేవు ఖాదీ వస్త్రాన్ని తయారుచేసే చేనేతకార్మికుడికి సహాయపడటం సామాజిక బాధ్యత చర్మానికి రక్షణగా, ఆరోగ్యదాయకంగా ఉండే ఖాదీ, సింథటిక్ మెటీరియల్ వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది పర్యావరణ సమతుల్యతను కాపాడే సుగుణాల గని ఖాదీ! మన దేశ ఆత్మగౌరవ పతాకను ఎగురవేసే బాధ్యత మనలో ప్రతి ఒక్కరి భుజాల మీద ఉన్నదన్న విషయం మరవద్దు. ప్రతిరోజూ ఖాదీని ధరిద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ వేళ మన ఘనతను మరింతగా నలుదిశలా చాటుదాం. జైహింద్! జై ఖాదీ! - నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి