ఇటీవలకాలంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్‌లతో అల్లరి చిల్లరిగా ఉంటున్నారు. అమ్మానాన్నలకు నేటి జనరేషన్‌ని హ్యండిల్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ప్రతి దాన్ని స్పీడ్‌గా క్యాచ్ చేసేస్తారు. ప్రశ్నించేందుకు కూడా ఏ మాత్రం భయపడరు. కానీ నేటి పిల్లలకు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవడం తెలయడం లేదనే చెప్పాలి. పైగా తల్లిదండ్రలు చెప్పినా...పాటించే పిల్లలు కూడా అరుదే. కానీ ఇక్కడోక చిన్నారి చేసిన పని చూసి ఆశ్చర్యపోకుండా ఉండరు. కచ్చితంగా ఆ చిన్నారిని మెచ్చుకోకుండా ఉండలేరు కూడా.
వివరాల్లోకెళ్తే...ఇక్కడోక చిన్నారి రైల్వేస్టేషన్‌లో ఉన్నా ఆర్మీ జవాన్ల వద్దకు నడుచుకుంటూ వెళ్లుతుంది. అక్కడ ఉన్నవాళ్లకు కూడా మొదట అర్థం కాదు. ఆ చిన్నారి ఎందుకు ఇలా తమ వద్దకు వస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికీ ఒక జవాను పలకరిస్తాడు. అయినా ఆ చిన్నారి ఏ చెప్పకుండా హఠాత్తుగా ఆ జవాన్ కాళ్లను తాకి పాదాభివందనం చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమెను దగ్గరకు తీసుకుని మెచ్చుకోలుగా కాసేపు మాట్లాడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,)
Comments
Please login to add a commentAdd a comment