cute girl
-
Viral Video: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి
-
ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి?
ఐస్ క్రీం అంటే అందరికి ఇష్టమే.. కాలంతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఈమధ్య కాలంలో టర్కిష్ ఐస్ క్రీం పేరు అందరినోట ఎక్కువగా వినిపిస్తుంది. కారణం దాని రుచి కాకపోయిన అక్కడి వ్యాపారస్థులు చేసే జిమ్మిక్కులు. దీని వల్లే ఈ ఐస్‌క్రీం ఎక్కువ పాపులర్ అయ్యింది. ఐస్క్రీంను ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగుకుంటూ కస్టమర్లను సరాదాగా ఆటపట్టిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసే ఉంటాం. తాజాగా టర్కిష్ ఐస్ క్రీం వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో కౌంటర్ ఎదురుగా ఐస్‌క్రీం కోసం నిలబడి ఉన్న చిన్నారితో విక్రేత ఫ్రాంక్ చేస్తుంటారు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలు అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు. ఐస్‌క్రీం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. దీంతో పట్టరాని కోపంతో ఖాళీ కోన్‌ను అతనిపై విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది.ఈ వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. क्यों परेशान कर रहे हो बेचारी को 😂👏😎 pic.twitter.com/V5slqNAqwr — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022 ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వారిని ఏడిపించకండి. పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటి. పిల్లల విషయంలో ఇలాంటి జోక్‌లు చేయవద్దు. ఐస్‌క్రీం అమ్మేవాడిని శిక్షించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్
ఇటీవలకాలంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్లతో అల్లరి చిల్లరిగా ఉంటున్నారు. అమ్మానాన్నలకు నేటి జనరేషన్‌ని హ్యండిల్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ప్రతి దాన్ని స్పీడ్‌గా క్యాచ్ చేసేస్తారు. ప్రశ్నించేందుకు కూడా ఏ మాత్రం భయపడరు. కానీ నేటి పిల్లలకు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవడం తెలయడం లేదనే చెప్పాలి. పైగా తల్లిదండ్రలు చెప్పినా...పాటించే పిల్లలు కూడా అరుదే. కానీ ఇక్కడోక చిన్నారి చేసిన పని చూసి ఆశ్చర్యపోకుండా ఉండరు. కచ్చితంగా ఆ చిన్నారిని మెచ్చుకోకుండా ఉండలేరు కూడా. వివరాల్లోకెళ్తే...ఇక్కడోక చిన్నారి రైల్వేస్టేషన్లో ఉన్నా ఆర్మీ జవాన్ల వద్దకు నడుచుకుంటూ వెళ్లుతుంది. అక్కడ ఉన్నవాళ్లకు కూడా మొదట అర్థం కాదు. ఆ చిన్నారి ఎందుకు ఇలా తమ వద్దకు వస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికీ ఒక జవాను పలకరిస్తాడు. అయినా ఆ చిన్నారి ఏ చెప్పకుండా హఠాత్తుగా ఆ జవాన్ కాళ్లను తాకి పాదాభివందనం చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమెను దగ్గరకు తీసుకుని మెచ్చుకోలుగా కాసేపు మాట్లాడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా
న్యూయార్క్: ప్రస్తుత హైటేక్ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను చదువుల్లో మాత్రమే కాకుండా అదనంగా వేరే రంగంలో రాటు తేలేలా ప్రత్యేకంగా ట్రైన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా డ్యాన్స్ నేర్పిచడం, ఆటలు, సంగీతం, ఇలా వేర్వేరు రంగాలలో తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలాచేస్తే తమ పిల్లలు ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. పబ్‌లో అనే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. తాను స్వతహగా మంచి డ్యాన్సర్. తన కూతురు వెరోనికాకి చిన్నప్పడి నుంచి డ్యాన్స్‌లో శిక్షణనిచ్చాడు. దీంతో వీరిద్దరు కలిసి ఇంగ్లీష్ ఆల్బంలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌లు చేస్తుంటారు. తాజాగా, వీరిద్దరు కలిసి మారూన్-5 ఆల్బం పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటలో వీరిద్దరు.. మ్యూజిక్కు తగ్గట్టుగా స్టన్నింగ్ స్టెప్పులు వేస్తూ.. క్యూట్‌గా నవ్వుతూ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. పబ్‌లో తరచుగా..తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా, వీరి డ్యాన్స్ వీడియోను తండ్రి.. తన ‘పబ్‌లో వెరానికా’ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..’,‘ఎంత బాగా స్టెప్పులు వేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pablo e Verônica (@pabloeveronica01) -
వావ్: ఈ బుజ్జాయి కౌంటింగ్‌ను చూస్తే కితకితలే!
చాలావరకు పిల్లలు ఒకపట్టాన అర్థంకారు. మనం చెప్పింది నేర్చుకున్నట్టే ఉంటారు. కానీ వాళ్లకు తోచింది తప్పంటే మాత్రం అసలు ఒప్పుకోరు. మనం ఎంత వాదించినా.. దిగదుడుపే. వారి ముందు ఓడిపోవాల్సిందే. పిల్లలంటే అంతేమరి. ఉదాహరణకు ఈ చిన్నారిని చూడండి.. అంకెలు లెక్కబెట్టడంలో తల్లిదండ్రులతో ఎంత మొండిగా వాదిస్తున్నదో.. తండ్రి ఎంత ఓపికగా.. 1,2,3,4,5 అని చెప్పినా.. తను మాత్రం 1,2,3,5 అంటూ లెక్కబెడుతున్నది. తాను '4' అంకెను మింగడమే కాదు.. ఎంత చెప్పినా.. ఆ అంకెను తాను ఒప్పుకోవడం లేదు. ముద్దుముద్దుగా కౌంటింగ్ చేస్తూనే తన పట్టు తానంటూ జగమొండిలా.. 1,2,3,5 అంటూ కౌంటింగ్ చేస్తున్న ఈ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచమంతటా కితకితలు పెడుతున్నది. ఈ ముద్దు ముద్దు వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.