వావ్‌: ఈ బుజ్జాయి కౌంటింగ్‌ను చూస్తే కితకితలే! | cute girl counting argument is winning Internet | Sakshi
Sakshi News home page

వావ్‌: ఈ బుజ్జాయి కౌంటింగ్‌ను చూస్తే కితకితలే!

Published Mon, Apr 3 2017 7:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

వావ్‌: ఈ బుజ్జాయి కౌంటింగ్‌ను చూస్తే కితకితలే!

వావ్‌: ఈ బుజ్జాయి కౌంటింగ్‌ను చూస్తే కితకితలే!

చాలావరకు పిల్లలు ఒకపట్టాన అర్థంకారు. మనం చెప్పింది నేర్చుకున్నట్టే ఉంటారు. కానీ వాళ్లకు తోచింది తప్పంటే మాత్రం అసలు ఒప్పుకోరు. మనం ఎంత వాదించినా.. దిగదుడుపే. వారి ముందు ఓడిపోవాల్సిందే. పిల్లలంటే అంతేమరి. ఉదాహరణకు ఈ చిన్నారిని చూడండి.. అంకెలు లెక్కబెట్టడంలో తల్లిదండ్రులతో ఎంత మొండిగా వాదిస్తున్నదో.. తండ్రి ఎంత ఓపికగా.. 1,2,3,4,5 అని చెప్పినా.. తను మాత్రం 1,2,3,5 అంటూ లెక్కబెడుతున్నది.

తాను '4' అంకెను మింగడమే కాదు.. ఎంత చెప్పినా.. ఆ అంకెను తాను ఒప్పుకోవడం లేదు. ముద్దుముద్దుగా కౌంటింగ్‌ చేస్తూనే తన పట్టు తానంటూ జగమొండిలా.. 1,2,3,5 అంటూ కౌంటింగ్‌ చేస్తున్న ఈ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రపంచమంతటా కితకితలు పెడుతున్నది. ఈ ముద్దు ముద్దు వీడియోపై మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement