Father and Her Daughter Dancing to Maroon 5’s Moves Like Jagger - Sakshi
Sakshi News home page

కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా

Published Wed, Dec 29 2021 7:05 PM | Last Updated on Wed, Dec 29 2021 7:35 PM

Little Girl Dances To Moves Like Jagger With Her Dad: Viral Video - Sakshi

న్యూయార్క్: ప్రస్తుత హైటేక్‌ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.  చిన్నప్పటి  నుంచి తమ పిల్లలను చదువుల్లో మాత్రమే కాకుండా అదనంగా వేరే రంగంలో రాటు తేలేలా ప్రత్యేకంగా ట్రైన్‌ చేస్తున్నారు.  దీనిలో భాగంగా డ్యాన్స్‌ నేర్పిచడం, ఆటలు, సంగీతం, ఇలా వేర్వేరు రంగాలలో తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలాచేస్తే తమ పిల్లలు ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. 

పబ్లో అనే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. తాను స్వతహగా మంచి డ్యాన్సర్‌.  తన కూతురు వెరోనికాకి చిన్నప్పడి నుంచి డ్యాన్స్‌లో శిక్షణనిచ్చాడు. దీంతో వీరిద్దరు కలిసి ఇంగ్లీష్‌ ఆల్బంలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్‌లు చేస్తుంటారు. తాజాగా, వీరిద్దరు కలిసి మారూన్‌-5 ఆల్బం పాటకు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. 

ఈ పాటలో  వీరిద్దరు..  మ్యూజిక్‌కు తగ్గట్టుగా స్టన్నింగ్‌ స్టెప్పులు వేస్తూ.. క్యూట్‌గా నవ్వుతూ పోటాపోటీగా డ్యాన్స్‌ చేశారు. పబ్లో తరచుగా..తన కూతురుతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటారు.  తాజాగా, వీరి డ్యాన్స్‌ వీడియోను తండ్రి.. తన ‘పబ్లో వెరానికా’ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్‌.. ఎంత క్యూట్‌గా ఉందో..’,‘ఎంత బాగా స్టెప్పులు వేస్తున్నారంటూ కామెంట్‌లు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement