Viral Video: Army officer offers final salute to his mother before retiring - Sakshi
Sakshi News home page

హార్ట్‌ టచింగ్‌ వీడియో: కన్నతల్లికి ఆ ఆర్మీ అధికారి చివరి సెల్యూట్‌.. వైరల్‌

Published Sat, Dec 24 2022 6:04 PM | Last Updated on Sat, Dec 24 2022 6:14 PM

Army Officer Offering Final Salute To His Mother Video Viral - Sakshi

వైరల్‌: సోషల్‌ మీడియా అకౌంట్‌లలో.. అడ్డగోలుగా వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. కానీ, వాటిలో ఆలోచింపజేసేవి, మనసును తాకేవి అరుదుగా ఉంటాయి. బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు తల్లిదండ్రులను.. పెద్దాయ్యక పట్టించుకునేవాళ్లు ఈ కాలంలో ఎందరున్నారు?. ఒక స్థాయికి చేరుకున్నాక గర్వంతో పట్టించుకోని వాళ్లే ఎక్కువైపోయారు.  అయితే ఆ పెద్దాయన మాత్రం తన గౌరవ స్థానానికి మూలం తనకు జన్మనిచ్చిన తల్లేనని సగ్వరంగా చాటి చెప్పారు. 

మేజర్‌ జనరల్‌ రంజన్‌ మహాజన్‌.. ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ మధ్యే ఆయన రిటైర్‌ అయ్యారు. అధికారిక వీడ్కోలు తర్వాత.. ఆయన నేరుగా అంబాలా నుంచి ఢిల్లీలోని తల్లి చెంతకు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న ఆయన.. హుషారుగా తల్లి దగ్గరకు చిందులేసుకుంటూ వెళ్లారు. తన చివరి సెల్యూట్‌ను తల్లికి చేశారు. తన ఒంటిపై యూనిఫామ్‌కు కారణమైన.. తనను ఆ స్థానంలో నిలబెట్టిన మాతృమూర్తికి పూలదండ వేశారు. ప్రేమగా హత్తుకున్నారు. ఆమె కూడా కొడుకును ఆప్యాయంగా హత్తుకుంది. ఆపై కాసేపటికే యూనిఫామ్‌ను తొలగించి.. తన రిటైర్‌మెంట్‌ లైఫ్‌ను ప్రారంభించారు.

నాకు జన్మనిచ్చిన నా తల్లి.. 35 ఏళ్లపాటు నా మాతృభూమికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించింది. నా జీవితానికి ఓ సార్థకతను అందించింది. మేము అంబాలా నుండి ఢిల్లీకి వెళ్లినప్పుడు పూర్తిగా అవాక్కయ్యారు.  అవకాశం గనుక లభిస్తే.. మళ్లీ ఆర్మీ కోసం సేవలందిస్తానని పేర్కొన్నారు.  ఆ తల్లీకొడుకుల ప్రేమ.. నెటిజన్స్‌కు ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement