Army Major
-
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Major Sita Ashok Shelke: వయనాడ్ వారియర్
వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయవిధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄ాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు...వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్‌పై సగర్వంగా నిలుచున్న మేజర్ సీతా షెల్కే ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.లింగ వివక్షతను సవాలు చేసి సగర్వంగా వెలుగుతున్న ఫొటో అది.‘ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లతో కలిసి మేజర్ సీత షెల్కే పదహారు గంటలోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెనను నిర్మించారు’ అని అభినందిస్తూ ‘ఎక్స్’లో ΄ోస్ట్ పెట్టారు లెప్టినెంట్ కల్నల్ జేఎస్ సోది(రిటైర్డ్). తన కామెంట్‌తో ΄ాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.‘ఒక్క చిత్రం చాలు వంద మాటలు ఎందుకు!’ అన్నట్లు ఈ ఫొటోలలో ఒక్కటి చూసినా చాలు సీత బృందం కష్టం, శక్తిసామర్థ్యాలు తెలుసుకోవడానికి.ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శి«థిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత.సహాయచర్యలు చేపట్టడంలో ఈ బ్రిడ్జి కీలకం కానుంది.‘ఇది సైన్యం విజయం మాత్రమే కాదు. సహాయకార్యక్రమాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, స్థానిక అధికారులు... ఎంతోమంది విజయం’ వినమ్రంగా అంటుంది సీత.కొండచరియలు విరిగిపడిన చోట పనిచేయడం పెద్ద సవాలు. అక్కడ పురుషులతో సమానంగా పనిచేసింది సీత.మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన సీతకు ‘సాహసం’ చిన్నప్పటి నుంచి సన్నిహిత మిత్రురాలు. ఆ ధైర్యమే ఆమెను సైన్యంలోకి తీసుకువచ్చింది.మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు΄ాతరలను నిర్వీర్యం చేయడం...ఇలాంటి పనులెన్నో చేస్తుంటుంది. ఈ ఇంజినీరింగ్ యూనిట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే ప్రమాదాల అంచున పనిచేయడం. ఏమాత్రం అప్రమత్తంగా లేక΄ోయినా ్ర΄ాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’లోని డెబ్బై మంది సభ్యులలో ఏకైక మహిళ సీత. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అసౌకర్యం అనుకోలేదు. అధైర్య పడి΄ోలేదు.‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు.‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట.‘రిస్క్ తీసుకోక ΄ోవడం కూడా పెద్ద రిస్కే’ అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా ΄ాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు.వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్–స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు....రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది. -
గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి
పరకాల: పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వారం క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ మేజర్ దూడపాక సాయికిరణ్ (31)గుండెపోటుతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి దూడపాక పోశయ్య, సుశీల దంపతులకు సాయికృష్ణ, సాయికిరణ్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ చిన్నప్పుడే తండ్రి గోల్కొండ సైనిక్ స్కూల్లో చేర్చారు. ప్రస్తుతం సాయికిరణ్ అమృత్సర్ లో మేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు సాయికృష్ణ జోధ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌కు 5 ఏళ్ల క్రితం అపూ ర్వతో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాలు కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 7న సాయికిరణ్ పరకాలకు చేరుకున్నాడు. అంతకన్నా ముందే సోదరు సాయికృష్ణ కూడా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. కాగా, సాయికిరణ్ శనివారం బూత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఆదివారం సాయికిరణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పరకాల సీఐ పుల్యాల కిషన్ తెలిపారు. -
కన్నతల్లికి ఆ ఆర్మీ అధికారి చివరి సెల్యూట్.. వైరల్
వైరల్: సోషల్ మీడియా అకౌంట్లలో.. అడ్డగోలుగా వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ, వాటిలో ఆలోచింపజేసేవి, మనసును తాకేవి అరుదుగా ఉంటాయి. బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు తల్లిదండ్రులను.. పెద్దాయ్యక పట్టించుకునేవాళ్లు ఈ కాలంలో ఎందరున్నారు?. ఒక స్థాయికి చేరుకున్నాక గర్వంతో పట్టించుకోని వాళ్లే ఎక్కువైపోయారు. అయితే ఆ పెద్దాయన మాత్రం తన గౌరవ స్థానానికి మూలం తనకు జన్మనిచ్చిన తల్లేనని సగ్వరంగా చాటి చెప్పారు. మేజర్ జనరల్ రంజన్ మహాజన్.. ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మధ్యే ఆయన రిటైర్ అయ్యారు. అధికారిక వీడ్కోలు తర్వాత.. ఆయన నేరుగా అంబాలా నుంచి ఢిల్లీలోని తల్లి చెంతకు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న ఆయన.. హుషారుగా తల్లి దగ్గరకు చిందులేసుకుంటూ వెళ్లారు. తన చివరి సెల్యూట్‌ను తల్లికి చేశారు. తన ఒంటిపై యూనిఫామ్‌కు కారణమైన.. తనను ఆ స్థానంలో నిలబెట్టిన మాతృమూర్తికి పూలదండ వేశారు. ప్రేమగా హత్తుకున్నారు. ఆమె కూడా కొడుకును ఆప్యాయంగా హత్తుకుంది. ఆపై కాసేపటికే యూనిఫామ్‌ను తొలగించి.. తన రిటైర్మెంట్ లైఫ్‌ను ప్రారంభించారు. నాకు జన్మనిచ్చిన నా తల్లి.. 35 ఏళ్లపాటు నా మాతృభూమికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించింది. నా జీవితానికి ఓ సార్థకతను అందించింది. మేము అంబాలా నుండి ఢిల్లీకి వెళ్లినప్పుడు పూర్తిగా అవాక్కయ్యారు. అవకాశం గనుక లభిస్తే.. మళ్లీ ఆర్మీ కోసం సేవలందిస్తానని పేర్కొన్నారు. ఆ తల్లీకొడుకుల ప్రేమ.. నెటిజన్స్‌కు ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Smiley (@iranjanmahajan) -
రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..!
కీవ్: ఉక్రెయిన్‌లో 21 రోజులుగా జరుగుతున్న యుద్దంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాంబు దాడుల కారణంగా కొన్ని చోట్ల పెను విధ్వంసం చోటుచేసుకుంది. వైమానిక దాడుల ధాటికి ఎందరో సైనికులు, సాధారణ పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా దాడులకు దిగిన రష్యాకు కోలుకులేని విధంగా కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. యుద్దం నేపథ్యంలో రష్యా, పుతిన్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తుండగా.. యుద్దభూమిలో ఆ దేశానికి చెందిన సైనికాధికారులు మృత్యువాతపడుతున్నారు. తాజాగా రష్యాన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్.. ఉక్రెయిన్ సైనికుల దాడుల్లో మరణించినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ ఖార్కివ్‌లో చోటుచేసుకున్న హోరాహోరీ దాడులు ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కాగా, రష్యన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్లో సేవలందిస్తూ.. యుద్దంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా రైఫిల్స్ యూనిట్లో సైనికులను పరీక్షించడంలో అతని అనుభవం ఉంది. ఇదిలా ఉండగా.. 21 రోజుల యుద్దంలో రష్యాకు చెందిన నలుగురు మేజర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ మీడియో పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు రష్యా సైన్యానికి చెందిన మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్, మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ, రష్యా దళాల ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ మేజర్ ఆండ్రీ బుర్లకోవ్ ఖేర్సన్లో యుద్దంలో మరణించారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యన్ దళాలలో సుమారు 20 మంది జనరల్స్ ఉన్నారని అధికారిక ఉక్రేనియన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13,500 మంది రష్యా సైనికులను హతమర్చామని, 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. A #Russian major general was slain. The General, Oleg Mityaev, was the Commander of the 150th motorized rifle division, #Ukrainian media reports. pic.twitter.com/XKwpfxo41I — NEXTA (@nexta_tv) March 15, 2022 -
శాంతి సిపాయి
రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ‘బ్రో.. బ్రో..’ ఆగండి అంటుంది యు.ఎన్. వచ్చి. ‘ఓకే.. బ్రో’ అని ఒక దేశం గన్ దించేస్తుంది. రెండో దేశం ‘ఓకే’ అనదు. ‘బ్రో’ అనదు. యు.ఎన్. మళ్లొకసారి ‘ఓ.. శాంతి’ అంటుంది. వినలేదా.. ‘పీస్ కీపర్స్’ దిగుతారు. పీస్ కీపర్స్.. యు.ఎన్. శాంతి సాయుధ దళాలు. మరి.. పీస్ కీపర్స్ మధ్యే డిసిప్లీన్ మిస్ అయితే? గవానీ లాంటిæమహిళలు వారిని నడిపిస్తారు. సుమన్ గవానీకి ఐక్యరాజ్యసమితి రేపు ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డును ఇవ్వబోతోంది. రేపటికి, రేపు ఇచ్చే ఆ అవార్డుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. యు.ఎన్. పీస్ కీపర్స్ (శాంతి పరిరక్షకులు) అంతర్జాతీయ దినోత్సవం రేపు. ఇక ఆ అవార్డు.. తొలిసారిగా ఒక భారతీయ సోల్జర్‌కు లభించిన గౌరవ పురస్కారం. ‘యు.ఎన్. మిలిటరీ జెండర్ అడ్వొకేట్ అవార్డు’ అది. యు.ఎన్. శాంతి పరిరక్షక దళంలో అన్ని దేశాల సైనికులు పనిచేస్తుంటారు. అలాగే గవానీ కూడా చేస్తున్నారు. 2018లో ఐక్యరాజ్య సమితి ఆమెను ప్రత్యేకమైన పనిమీద దక్షిణ సూడాన్‌కు పంపించింది. అక్కడ 230 మంది సమితి సైనిక పరిశీలకులను ఆమె పర్యవేక్షిస్తుండాలి. ప్రతి టీమ్‌లోనూ మహిళా సైనిక పరిశీలకులు ఉండేలా చూసుకోవాలి. ఘర్షణ జరుగుతున్న ప్రాంతాలలో లైంగిక హింసను చెలరేగనివ్వకుండా చూడటం ఆ పరిశీలకుల పని. తన పర్యవేక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు, సైనిక పరిశీలకులను క్రమశిక్షణతో నడిపించి ౖలñ ంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు 2019 సంవత్సరానికి గాను సుమన్ గవానీకి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును గవానీ తన పీస్ కీపింగ్ సహచరురాలు. ్ర»ñ జిల్ మిలటరీ మహిళా కమాండర్ కార్లా అరౌజోతో పంచుకోబోతున్నారు. వీళ్లిద్దరినీ శక్తిమంతులైన ఆదర్శప్రాయులుగా గుర్తిస్తూ సమితి ప్రధాన కార్యదర్శి ఏంటానియో గుటెరస్‌లో ఆన్లైన్లో అవార్డును ఇవ్వబోతున్నారు. నాలుగేళ్లుగా ఏటా ఈ అవార్డును ఇస్తూ వస్తోంది సమితి. ఆర్మీ మేజర్‌గా యు.ఎన్. పీస్ కీపింగ్‌లోకి వెళ్లిన సుమన్ గవానీ కెరియర్ భారత సైనికురాలిగా 2011లో మొదలైంది. ఇండోర్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్‌లో టెలీ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిగ్రీ, డెహ్రాడూన్ గవర్నమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్‌లో ‘డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్’ చేశారు గవానీ. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొంది, ఆర్మీ సిగ్నల్ కోర్స్‌లో చేరారు. సైనిక సమాచార వ్యవస్థ విభాగం అది. అందులో కీలకమైన విధులు నిర్వహించారు. అట్నుంచి యు.ఎన్. పీస్ కీపింగ్‌కి వెళ్లిపోయారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో పొఖర్ గ్రామం నుంచి వచ్చిన గవాని నేడు అంతర్జాతీయంగా సమున్నత శాంతిపరిరక్షణ స్థానానికి చేరుకున్నారు. ‘‘మా పని ఏదైనా, పొజిషన్, ర్యాంకు ఎంతటిదైనా మా రోజువారీ విధి నిర్వహణల్లో స్త్రీ, పురుషులను, మిగతా జెండర్లను కలుపుకునిపోతూ స్త్రీలకు, శాంతికి, భద్రతకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడటం అన్నది కూడా పీస్‌కీపర్స్‌గా మా బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించినందుకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషకరమైన సంగతే కదా’’ అని మేజర్ సుమన్ గవానీ అంటున్నారు. యు.ఎన్. (ఐక్యరాజ్య సమితి) అవార్డును అందుకోనున్న భారత ఆర్మీ మేజర్ సుమన్ గవానీ -
అతడి తర్వాత...
పట్టుదల, కృషి ఉంటే తాము ఏదైనా సాధించవచ్చనే సామెతని అక్షరాల నిజం చేసి చూపించారు గౌరి ప్రసాద్ మహాడిక్. భర్త మేజర్ ప్రసాద్ వీరమరణం పొందిన అనంతరం తన భర్తపై, దేశంపై ప్రేమతో దేశరక్షణ కోసం సైన్యంలో చేరుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఎంపికైన ఆమె 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చెన్నైలోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందనుంది. 49 వారాల శిక్షణ అనంతర లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా మారనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పొరుగున ఉండే థాణే జిల్లాలోని విరార్‌లో నివసించే ప్రసాద్ మహాడిక్తో గౌరి వివాహం 2015 ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది. ఇండో–చైనా సరిహుద్దు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2017 డిసెంబరులో ప్రసాద్ వీరమరణం పొందారు. ఈ వార్త విని గౌరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సర్వం కోల్పోయినట్లయిందామెకు. భర్తకు నివాళిగా.. భర్త అంత్యక్రియల సమయంలో గుండె నిబ్బరం చేసుకుని ఆయనకు నివాళిగా తాను కూడా ఆర్మీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె ముంబైలోనే ఉద్యోగం చేసేది. అయితే అంత్యక్రియల అనంతరం పది రోజులు తిరగకుండానే భర్త అంత్యక్రియల సమయంలో ఆర్మీలో చేరి నివాళులు అర్పిస్తూ చేసిన ప్రతిజ్ఞ మేరకు తన ఉద్యోగానికి ముందుగా రాజీనామా చేసింది. అనంతరం ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై కొందరు దుఃఖంలో ఏదో అన్నంత మాత్రాన ఆర్మీలో చేరాలా..? ఇది మూర్ఖత్వం అన్నారు. అయితే అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. 2020లో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా...? ఆర్మీలో చేరి భర్త వేసుకున్నటువంటిæ యూనిఫామ్ వేసుకోవాలన్న గౌరి కల 2020లో నెరవేర నుంది. ఇందుకోసం కావల్సిన పరీక్షలలో ఇప్పటి వరకు ఉత్తీర్ణత సాధించి, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైంది. ముందుగా సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బి) నిర్వహించిన పరీక్షలలో గౌరి టాపర్‌గా నిలిచింది. ఇక చెన్నైలోని ‘ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీ’ (ఓటిఎ)లో శిక్షణ పొందేందుకు అర్హత సంపాదించింది. దీంతో 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆమె ఓటిఎలో 49 వారాలపాటు శిక్షణలో ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత 2020 మార్చిలో ఆమె లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. ఆమె కర్తవ్యదీక్షకు సాక్షి సలామ్. – గుండారపు శ్రీనివాస్ సాక్షి, ముంబాయి అలాగే యూనిఫామ్ వేసుకోవాలి నా నిర్ణయాన్ని మూర్ఖత్వమన్నవారే ఇప్పుడు నేను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఎంపికయ్యానని తెలిసి అభినందనలు చెబుతున్నారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్మీలో చేరాలనే కల నెరవేరుతుండంతో ఆయన నాతో ఉన్నారనే అనుభూతిని పొందుతున్నాను. తొందర్లోనే నన్ను ‘లెఫ్టినెంట్ కమాండర్ గౌరి ప్రసాద్ మహాడిక్’ అని పిలుస్తారు. ఇది వినేందుకు చాల ఎకైసైట్మెంట్గా ఉంది. దేశానికి సేవ చేయాలనే ప్రసాద్ అర్థంతరంగా పోయారు. నేను దేశానికి సేవ చేసి ఆయన కోరికను తీరుస్తాను. – గౌరి ప్రసాద్ మహాడిక్ -
ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి..
ముంబై : సైనికులను చంపి.. మనల్ని బెదిరించాలని చూశారు ఉగ్రవాదులు. కానీ ఆ బెదిరింపులకు భయపడమని.. 40మందిని చంపితే మరో 4 వేల మంది భరతమాత కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉంటారని ఆ ముష్కరులకు తెలియదు. తండ్రి మరణిస్తే కొడుకు, భర్త మరణిస్తే భార్య సరిహద్దులో ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉంటారని నిరూపించారు గౌరీ ప్రసాద్. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన గౌరీ(31) భర్త.. ప్రసాద్ గణేష్ ఆర్మీ మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత్ - చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రసాద్ మరణించారు. భర్త మరణించాడని తెలిసి ఏడుస్తూ కూర్చోలేదు గౌరీ. భర్త సేవలను కొనసాగించడం కోసం తాను కూడా సైన్యంలో చేరాలని భావించింది. అందుకోసం అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. అయితే తొలి ప్రయత్నంలో ఆమె ఓడిపోయింది. కానీ పట్టువిడవకుండా ప్రయత్నించి రెండో ప్రయత్నంలో విజయం సాధించడం మాత్రమే కాదు టాపర్‌గా నిలిచారు. త్వరలోనే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ పొంది, అనంతరం లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో చేరి విధులు నిర్వహించనున్నారు. ఈ విషయం గురించి గౌరీ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఉండాలని నా భర్త ప్రసాద్ కోరిక. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఏడుస్తూ కూర్చుని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనిపించింది. నా భర్త దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించాను. అందుకే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట ఆయన యూనిఫామ్‌ను, స్టార్స్‌ను నేను ధరిస్తాను.. ఆయన విధులు నేను నిర్వహిస్తాను. ఇక ఇది మా ఇద్దరి యూనిఫామ్ అవుతుంది. ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ ప్రసాద్. -
అమర వీరుడికి భార్య అరుదైన నివాళి
-
భర్తకు ముద్దిచ్చి.. ఐ లవ్ యూ చెప్పి...
‘నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మేమంతా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ప్రతిఒక్కరినీ నువ్వు ప్రేమించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కనీసం ఎప్పుడూ నిన్ను కలవని వారి కోసం ప్రాణత్యాగం చేశావంటే నువ్వు ఎంత గొప్ప ధైర్యశాలివి? నిన్ను భర్తగా పొందడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీకే అంకితం. నిజమే.. నువ్వు మాకు దూరం కావడం బాధగానే ఉంది. కానీ నువ్వెప్పుడూ మా చుట్టూనే ఉంటావు. ఆయన మరణంపై సానుభూతి చూపించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనమంతా ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. మనల్ని మరింత దృఢంగా ఉంచేందుకే ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టారు. ఆయనకు సెల్యూట్ చేయండి. జైహింద్’... ఆర్మీ మేజర్ విబూది శంకర్ ధొండ్యాల్ భార్య నితిక కౌల్ ఉద్వేగంగా అన్న మాటలివి. దేశం కోసం అమరుడైన భర్తకు ఆమె అరుదైన నివాళి అర్పించారు. తన భర్త నిజమైన హీరో అంటూ కొనియాడారు. కొండంత బాధను గుండెల్లో దాచుకుని భర్తకు చివరిసారిగా ముద్దిచ్చి ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు జాతియావత్తును కదిలించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా తిరుగుతోంది. సోమవారం కశ్మీర్‌లోని పింగ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో విబూది ధొండ్యాల్ వీర మరణం చెందారు. ఆయన భౌతిక కాయానికి హరిద్వార్‌లోని గంగా నది తీరంలో మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. (ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం) డెహ్రడూన్‌కు చెందిన విబూది ధొండ్యాల్తో నితికకు 10 నెలల క్రితమే పెళ్లైంది. మొదటి పెళ్లిరోజును భర్తతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్న నితికకు పుల్వామా ఉగ్రదాడి రూపంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులైన ముష్కరులకు మట్టుబెట్టే క్రమంలో నికిత భర్త నేలకొరిగారు. తీవ్రవాదం పెచ్చరిల్లడంతో 90వ దశకంలో నితిక తల్లిదండ్రులు కశ్మీర్‌ను వదిలి వచ్చేశారు. ఏదైతే జరగకూడదని భావించారో చివరకు అదే జరిగింది. ముష్కర మూకలు నితిక భర్త ప్రాణాలను బలితీసుకున్నాయి. అయితే క్లిష్టసమయంలో ఆమె చూపిన గుండెనిబ్బరం, పోరాట స్ఫూర్తికి ప్రజలు సలాం చేస్తున్నారు. -
పుల్వామా జిల్లా పింగాన్లో భారీ ఎన్కౌంటర్
-
వైరలవుతోన్న ట్వీట్.. సంతోషంలో నైనా
న్యూఢిల్లీ : దేశానికి తిండి పెట్టే రైతులు గురించి.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్ల గురించి నాయకులే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. సైనికుల త్యాగాలు.. రైతుల కడగండ్లు మన కళ్లకు కనపడవు. మీడియా కూడా తళుకుబెళుకలకే ప్రాధన్యతిస్తుంది.. కానీ త్యాగాలకు కాదు. కానీ నిజమైన దేశభక్తి కలిగిన కొందరు మాత్రం మనందరికి భిన్నంగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే హుతాన్షు వర్మ. నిన్న (ఆదివారం) హుతాన్షు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవ్వడమే కాకా పలువురు నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. Join me in Wishing Happy Birthday to Little Naina. Naina is the daughter of our hero Major Akshay Girish savior of Nagrota attack, he sacrificed his life for us. Naina is celebrating her 5th birthday today,unfortunately without her father's presence.. RT and wish Happy Birthday pic.twitter.com/JYVUrzId7W — Hutansh Verma (@hutansh) October 28, 2018 ఈ ట్వీట్లో హుతాన్షు ‘చిన్నారి నైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి నాతో కలవండి. నైనా మేజర్ అక్షయ్ గిరిష్ కుమార్తె. రెండేళ్ల క్రితం నగ్రోటాలో జరిగిన దాడుల్లో అక్షయ్ మరణించారు. మనందరి కోసం అక్షయ్ ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు నైనా ఐదో వసంతంలోకి అడుగుపెడుతోంది.. కానీ ఈ సమయంలో తన తండ్రి ఇక్కడ లేకపోవడం విచారకరం. కానీ ఈ చిన్నారికి మనందరం తోడుగా ఉన్నామని హామీ ఇద్దాం రండి’అంటూ ట్వీట్ చేశారు. హుతాన్షు చేసిన ఈ ట్వీట్‌ని కొన్ని గంటల్లోనే దాదాపు 10 వేల మందికి పైగా లైక్ చేయగా.. 4 వేల మంది రిట్వీట్ చేశారు. -
ఆర్మీ మేజర్ జనరల్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్ జిల్లాలోని దిన్జన్‌లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్లు థామస్ మాథ్యూ, ఆర్ఎస్ సిబిరెన్‌లతోపాటు జూనియర్ కమిషన్డ్, నాన్ కమిషన్డ్ అధికారులుగా ఉన్న దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బీందర్ సింగ్, శివేందర్‌సింగ్‌లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. 1994 ఫిబ్రవరి 23న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యు) కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, భాబెన్ మోరన్‌లను దోషులు అపహరించి, నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపారు. డంగారి ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్ భుయాన్ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది. ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్‌కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. -
పనిమనిషిపై ఆర్మీ మేజర్ లైంగిక దాడి
సాక్షి,న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్మీ మేజర్ తన ఇంట్లో పనిచేసే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ మేజర్ నివాసంలోని సర్వెంట్ క్వార్టర్లో బాధిత మహిళ దంపతులు పనిచేస్తుంటారు. పనిమనిషిపై కన్నేసిన ఆర్మీ మేజర్ జూన్ 12న బాధితురాలి భర్తను బయటకు పంపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని గ్రామానికి పంపి ఆమె భర్త ఒక్కరే మేజర్ ఇంట్లో పనిచేస్తుండగా అనూహ్యంగా అతను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. అయితే తన భర్తది ఆత్మహత్య కాదని బాధితురాలు ఆరోపించారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఆర్మీ మేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్మీ మేజర్ గొగోయ్ దోషే
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిలో హోటల్లో పట్టుబడ్డ ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్‌ను ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా నిర్ధారించింది. స్థానిక యువతితో సన్నిహితంగా ఉండటం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధి నిర్వహణ ప్రాంతానికి దూరంగా వెళ్లి మేజర్ ఆర్మీ నిబంధనలను ఉల్లంఘిం చారంది. ఈ ఏడాది మే 23న శ్రీనగర్‌లోని ఓ హోటల్లో గొగోయ్ ఓ యువతి(18)తో కలసి గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయన్ను అడ్డుకుంది. ఈ సందర్భంగా వాగ్వాదం తలెత్తడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సైన్యం ఆదేశించింది. అయితే తాను రహస్య సమాచార సేకరణ కోసమే యువతితో హోటల్‌కు వెళ్లానని గొగోయ్ చెప్పారు. గొగోయ్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన కోర్టు మార్షల్ (మిలటరీ చట్టాల ప్రకారం ఆర్మీ కోర్టు విచారణ)ను ఎదుర్కొనే అవకాశముంది. 2017, ఏప్రిల్ 9న శ్రీనగర్ ఉప ఎన్నికల్లో రాళ్లదాడిని తప్పించుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే స్థానిక యువకుడిని జీప్‌కు కట్టేసి మానవకవచంగా గొగోయ్ వాడుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గొగోయ్‌ను కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా తేల్చడంపై మానవకవచం బాధితుడు ఫరూఖ్ అహ్మద్ దార్ స్పందిస్తూ.. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడన్నారు. -
గూగుల్‌లో వెతికి మరి చంపాడు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో పోలిసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శైలజ ద్వివేదిని హత్య చేసని నిఖిల్ హండా ప్రస్తుతం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే నేపంతో నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ముందు ఈ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్ హండా గూగుల్ సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి’ వంటి పలు అంశాల గురించి నిఖిల్ గూగుల్‌లో సర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిఖిల్ ఫోన్ కాల్ డేటాను, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ విషయం గురించి పోలీసులు ‘శైలజ, నిఖిల్ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేశి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పొనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హరిద్వార్ నుంచి మీరత్ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు. కానీ నిఖిల్ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్ ఆధారంగానే నిఖిల్‌ను అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ఫోరెన్సిక్ లాబ్‌కి పంపించారు. నివేదికల కోసం ఎదురు చూస్తున్నామ’ని తెలిపారు. -
‘నేను అందమైన అదృష్టవంతురాలిని’
సాక్షి, న్యూఢిల్లీ : భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేతిలో దారుణ హత్యకు గురైన శైలజ ద్వివేది 2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటిల్లో అమృత్సర్ తరుపున పాల్గొంది. పోటిల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తన మనసుకు నచ్చినట్లే తన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేంత తెగువ గల మహిళ శైలజ ద్వివేది. గత సంవత్సరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత ఎలా ఉంది వంటి పలు అంశాల గురించి తన అభిప్రాయలను తెలియజేశారు. శైలజ ద్వివేది అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ‘‘చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక నాలో చాలా బలంగా ఉండేది. రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించటం లేదు. ఇక్కడ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కుటుంబంతో పాటు వాటిని కూడా నెరవేర్చుకోవాలి. నా మనసుకు నచ్చి నేను ఈ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నాను తప్ప నేనేంటో తెలియజేయాలనో, ఇంకేదో సాధించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు’ కుటుంబం అంటే ఇలా ఉండాలి... ప్రేమించే భర్త, అల్లరి చేసే పిల్లలు వారి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవాలతో కూడిన ఒక అనుబంధం ఉంటే అదే అసలు సిసలు కుటుంబం. అటువంటి కుటుంబంలోని వారంతా కలిసి పనిచేసుకుంటూ, తమ అభిప్రాయలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. అటువంటి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే నేను వివాహం చేసుకున్నాను మహిళల భద్రత... మహిళల భద్రత పట్ల మన దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో హిందీ సినిమాలు చూడ్డటం, పాటలు వినటం తనకు ఇష్టం. బాగా కబుర్లు చెప్పెవారంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందం, అదృష్టం కలిసిన అమ్మాయిని నేను’’. చదువులోనూ చురుకే... అందం మాత్రమే కాక చదువులోనూ ముందే ఉండేవారు శైలజ. ఒక్కసారి ఆమె విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే ట్రావేల్ అండ్ టూరిజమ్‌లో డిగ్రీ, ఆర్బన్ ప్లానింగ్‌లో ఎంటెక్, జియోగ్రఫీలో మాస్టర్స్ చేశారు. అంటే సాంప్రదాయ బద్దంగా డిగ్రీలో తీసుకున్న సబెక్ట్నే పీజీలో చదవకుండా నూతన అంశాలను ఎంచుకుంటూ కొత్తదనం అంటే ఎంత ఇష్టమే చెప్పకనే చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారన్న అక్కసుతో ఆమెను నిఖిల్ హండా అతి దారుణంగా గొంతు కోసి మరి చంపాడు. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్‌నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు. -
పోలీసు కస్టడీకి ఆర్మీ మేజర్ నిఖిల్
న్యూఢిల్లీ: సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాకు ఢిల్లీలోని ఓ కోర్టు 4 రోజుల పోలీసు కస్టడీ విధించింది. మేజర్‌ను పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. హత్య చేయడానికి అతను వాడిన కత్తి, హత్యసమయంలో అతను ధరించిన డ్రెస్, ఇతర కీలక సాక్ష్యాధారాల వివరాలు రాబట్టేందుకు నిఖిల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జడ్జిని కోరారు. దీంతో నిందితుణ్ని కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ (35)ను ప్రేమించిన నిఖిల్, ఆమె పెళ్లికి నిరాకరించడంతో శనివారం హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం నిఖిల్‌ను మీరట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శైలజ గతేడాది మిస్ ఇండియా ఎర్త్ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ‘మిస్ ఎర్త్ క్రియేటివ్’ పోటీలోనూ గెలుపొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. 2008లో మేజర్ అమిత్‌తో పరిచయం ఏర్పడగా, 2009లో వారి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. 1959లో నానావటి కేసు నుంచి 2008 నీరజ్ కేసుదాకా.. అత్యంత క్రమశిక్షణ గల వారిగా భావించే త్రివిధ దళాల ఉద్యోగులు నేరాలకు పాల్పడిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 1959– నానావటి కేసుఈ కేసు ఆధారంగా అనేక సినిమాలు, పుస్తకాలొచ్చాయి. కేఎం నానావటి అనే నౌకాదళ కమాండర్ 1959 ఏప్రిల్ 27న తన భార్య సిల్వియా ప్రేమికుడు ప్రేమ్ ఆహుజాను హత్య చేశాడు. స్థానిక కోర్టు నానావటిని నిర్దోషిగా విడుదల చేసినా, బాంబే హైకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. చివరకు బాంబే గవర్నర్, తొలి ప్రధానిæ నెహ్రూ సోదరి విజయలక్ష్మి ప్రజాభిప్రాయం ఆధారంగా నానావటికి క్షమాభిక్ష పెట్టారు. 1982– సికంద్ హత్య కేసు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన ఎస్జే చౌదరి ఢిల్లీ వ్యాపారి కిషన్ సికంద్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక కోర్టు 26 ఏళ్లు విచారణ జరిపి ఆర్మీ అధికారికి జైలు శిక్షవేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు ఆ అధికారిని నిర్దోషిగా ప్రకటించి కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. తర్వాత సుప్రీంకోర్టూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చౌదరి తన భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటుండటంతో కిషన్ ఆమెకు దగ్గరయ్యాడని, దీనిని భరించలేక చౌదరి సికంద్‌ను హత్యచేశాడని ఆరోపణ. 2007– మేఘా రాజ్దాన్ కేసు కెప్టెన్ మేఘా రాజ్దాన్ భారత ఆర్మీలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ రెజిమెంట్‌లో అధికారిణి. ఆర్మీ అధికారి కెప్టెన్ చైతన్య భత్వాడేకర్ను 2006లో పెళ్లాడారు. తర్వాత చైతన్య పుణెకు చెందిన ఓ అమ్మాయితో సంబంధంపెట్టుకున్న విషయం మేఘాకు తెల్సింది. తర్వాత చైతన్య వేధింపులు భరించలేక మేఘా 2007లోఆత్మహత్య చేసుకున్నారు. 2008–నీరజ్ గ్రోవర్ కేసు నటి మరియా సుసైరాజ్‌కు, నౌకాదళ అధికారి ఎమిలీ జెరోమ్‌కు 2008లో పెళ్లి సంబంధం కుదిరింది. నీరజ్ గ్రోవర్ అనే వ్యక్తితో మరియాకు సంబంధం ఉందన్న అనుమానంతో జెరోమ్ అతణ్ని హత్య చేశాడు. తర్వాత మరియా, జెరోమ్లు కలిసి నీరజ్ శరీరాన్ని ముక్కలుగా చేసి పడేశారు. త కేసులో జెరోమ్‌ను కోర్టు శిక్షించింది. సుసైరాజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. -
హత్య కేసులో ఆర్మీ మేజర్ అరెస్ట్
న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలో జరిగిన ఆర్మీ మేజర్ భార్య హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆదివారం మరో మేజర్‌ను మీరట్‌లో అరెస్ట్ చేశారు. నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో పనిచేస్తున్న మేజర్ నిఖిల్ హందాకు అక్కడే పనిచేస్తున్న మరో మేజర్ అమిత్ ద్వివేదీ భార్య శైలజాతో పరిచయం ఏర్పడింది. ఇటీవల అమిత్‌కు బదిలీ కావటంతో భర్తతో పాటే శైలజా ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన నిఖిల్.. ఆస్పత్రికి వెళ్లిన శైలజాను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అరగంట తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం కంటోన్మెంట్ ప్రాంతంలో ఉందని పోలీసులకు సమాచారమందింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం మీరట్‌లో ఉన్న మేజర్ నిఖిల్ హందాను అరెస్ట్ చేశారు. ఆమెను గొంతుకోసి చంపిన అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించటానికి నిఖిల్ కారుతో తొక్కించాడని పోలీసులు తెలిపారు. -
ఆర్మీ అధికారి భార్య హత్య కలకలం
-
ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్, జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ఓ జవాను మృతి చెందారు. దక్షిణ కశ్మీర్... షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని జైపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న బలగాలపైకి తీవ్ర వాదులు తెగబడ్డారని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గోపాల్‌పురలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదులు గతంలో జరిగిన ఓ బ్యాంకు దోపిడీ ఘటనలో ప్రధాన నిందితులు. ఘటనాస్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాను!
శ్రీనగర్: భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని జవాను కాల్చిచంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించగా.. కోపోద్రేకుడైన జవాను మేజర్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. దాదాపు ఐదు బుల్లెట్లు మేజర్ శిఖర్ థాప శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇరువురిని ఆర్మీ ఉడి ప్రాంతంలోని నియంత్రణ రేఖకు చేరువలో పికెటింగ్‌కు పంపినట్లు తెలిసింది. -
'నా భార్యను కల్నల్ ఎత్తుకుపోయారు'
సైన్యంలో పనిచేస్తున్న కల్నల్ ర్యాంకు అధికారి ఒకరు తన భార్యను ఎత్తుకెళ్లిపోయారంటూ సైన్యంలోనే వైద్యుడిగా మేజర్ ర్యాంకులో పనిచేస్తున్న ఓ అధికారి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన బీహార్‌లోని దానాపూర్ మిలటరీ క్యాంపులో చోటుచేసుకుంది. మేజర్ బినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు కల్నల్ రవిచందర్ మీద కేసు నమోదుచేసినట్లు పాట్నా ఎస్పీ ఎస్.డబ్ల్యు. లాండే తెలిపారు. తన భార్యతో కల్నల్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని బినోద్ ఆరోపించారు. ఆమె ఆర్మీకి చెందిన ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కాగా ఆరోపణలు వచ్చిన కల్నల్ రవిచందర్.. మావోయిస్టు నిరోధ దళమైన కోబ్రా ఫోర్స్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనను ప్రస్తుతం జార్ఖండ్ బీహార్ సబ్ ఏరియా స్టేషన్ హెడ్‌క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 497, 506, 379, 34, 504ల కింద ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు.