'నా భార్యను కల్నల్ ఎత్తుకుపోయారు' | Major files police complaint against colonel for adultery | Sakshi
Sakshi News home page

'నా భార్యను కల్నల్ ఎత్తుకుపోయారు'

Published Fri, Dec 12 2014 5:22 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

'నా భార్యను కల్నల్ ఎత్తుకుపోయారు' - Sakshi

'నా భార్యను కల్నల్ ఎత్తుకుపోయారు'

సైన్యంలో పనిచేస్తున్న కల్నల్ ర్యాంకు అధికారి ఒకరు తన భార్యను ఎత్తుకెళ్లిపోయారంటూ సైన్యంలోనే వైద్యుడిగా మేజర్ ర్యాంకులో పనిచేస్తున్న ఓ అధికారి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన బీహార్లోని దానాపూర్ మిలటరీ క్యాంపులో చోటుచేసుకుంది. మేజర్ బినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు కల్నల్ రవిచందర్ మీద కేసు నమోదుచేసినట్లు పాట్నా ఎస్పీ ఎస్.డబ్ల్యు. లాండే తెలిపారు. తన భార్యతో కల్నల్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని బినోద్ ఆరోపించారు.

ఆమె ఆర్మీకి చెందిన ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. కాగా ఆరోపణలు వచ్చిన కల్నల్ రవిచందర్.. మావోయిస్టు నిరోధ దళమైన కోబ్రా ఫోర్స్కు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనను ప్రస్తుతం జార్ఖండ్ బీహార్ సబ్ ఏరియా స్టేషన్ హెడ్క్వార్టర్స్కు ఎటాచ్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 497, 506, 379, 34, 504ల కింద ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement