కీవ్: ఉక్రెయిన్‌లో 21 రోజులుగా జరుగుతున్న యుద్దంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాంబు దాడుల కారణంగా కొన్ని చోట్ల పెను విధ్వంసం చోటుచేసుకుంది. వైమానిక దాడుల ధాటికి ఎందరో సైనికులు, సాధారణ పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా దాడులకు దిగిన రష్యాకు కోలుకులేని విధంగా కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. యుద్దం నేపథ్యంలో రష్యా, పుతిన్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తుండగా.. యుద్దభూమిలో ఆ దేశానికి చెందిన సైనికాధికారులు మృత్యువాతపడుతున్నారు.
తాజాగా రష్యాన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్.. ఉక్రెయిన్ సైనికుల దాడుల్లో మరణించినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ ఖార్కివ్‌లో చోటుచేసుకున్న హోరాహోరీ దాడులు ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కాగా, రష్యన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్‌లో సేవలందిస్తూ.. యుద్దంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా రైఫిల్స్ యూనిట్‌లో సైనికులను పరీక్షించడంలో అతని అనుభవం ఉంది.
ఇదిలా ఉండగా.. 21 రోజుల యుద్దంలో రష్యాకు చెందిన నలుగురు మేజర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ మీడియో పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు రష్యా సైన్యానికి చెందిన మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్, మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ, రష్యా దళాల ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ మేజర్ ఆండ్రీ బుర్లకోవ్ ఖేర్సన్‌లో యుద్దంలో మరణించారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యన్ దళాలలో సుమారు 20 మంది జనరల్స్ ఉన్నారని అధికారిక ఉక్రేనియన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13,500 మంది రష్యా సైనికులను హతమర్చామని, 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది.
A #Russian major general was slain. The General, Oleg Mityaev, was the Commander of the 150th motorized rifle division, #Ukrainian media reports. pic.twitter.com/XKwpfxo41I
— NEXTA (@nexta_tv) March 15, 2022
Comments
Please login to add a commentAdd a comment