కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. రష్యన్ బలగాలు బాంబులు, మిస్సైల్ అటాక్స్ చేస్తూ ఉక్రెయిన్ పౌరులను బలి తీసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాతపడ్డారు.
తాజాగా.. రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన జర్నలిస్టు బ్రెంట్ రెనౌడ్ మృతి చెందాడు. రష్యా దాడులపై ఉక్రెయిన్‌లో గ్రౌండ్ లెవల్‌లో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో అతడు మరణించినట్టు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. కాగా, బ్రెంట్.. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన జర‍్నలిస్టుగా అధికారులు గుర్తించారు. వారి కాల్పుల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రిని తరలించినట్టు సమాచారం. జర్నలిస్ట్ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యన్ బలగాల దాడులు కొనసాగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
#russians killed a documentarist Brent Renaud, working for @nytimes in #Ukraine.
— Inna Sovsun (@InnaSovsun) March 13, 2022
Those bastards open fire on journalists, doctors, pregnant women, children, civilians. This is the war against the whole civilized world. #StopPutin #NoFlyZoneOverUkraine pic.twitter.com/ECagNoH9dj
Comments
Please login to add a commentAdd a comment