Russia Ukraine War: Indian Student Died In Russia Missile Attack At Kharkiv - Sakshi
Sakshi News home page

Indian Student Killed In Ukraine: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి

Mar 1 2022 3:26 PM | Updated on Mar 1 2022 6:24 PM

Russia Ukraine War: Indian Student Killed In Shelling In Kharkiv - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఆరో రోజు కూడా భీకరంగానే కొనసాగుతోంది. ఇప్పటికే కీవ్‌ ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సరిహద్దు దేశాలకు వెళ్లిపోయారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో కేంద్రం నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అక్కడే ఉన్న భారత విద్యార్థులు బంకర్‌లో తలదాచుకుంటు బిక్కు బిక్కుమంటు కాలం గడుపుతున్నారు.

మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి మృతి గురించి కేంద్ర విదేశాంగ శాఖ తెలియజేశామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఖార్కివ్‌ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందిన వార్త తెలియగానే నవీన్‌ కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement