మరణించిన మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్తె చిన్నారి నైనా
న్యూఢిల్లీ : దేశానికి తిండి పెట్టే రైతులు గురించి.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్‌ల గురించి నాయకులే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. సైనికుల త్యాగాలు.. రైతుల కడగండ్లు మన కళ్లకు కనపడవు. మీడియా కూడా తళుకుబెళుకలకే ప్రాధన్యతిస్తుంది.. కానీ త్యాగాలకు కాదు. కానీ నిజమైన దేశభక్తి కలిగిన కొందరు మాత్రం మనందరికి భిన్నంగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే హుతాన్షు వర్మ. నిన్న (ఆదివారం) హుతాన్షు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవ్వడమే కాకా పలువురు నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది.
Join me in Wishing Happy Birthday to Little Naina.
— Hutansh Verma (@hutansh) October 28, 2018
Naina is the daughter of our hero Major Akshay Girish savior of Nagrota attack, he sacrificed his life for us.
Naina is celebrating her 5th birthday today,unfortunately without her father's presence..
RT and wish Happy Birthday pic.twitter.com/JYVUrzId7W
ఈ ట్వీట్‌లో హుతాన్షు ‘చిన్నారి నైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి నాతో కలవండి. నైనా మేజర్ అక్షయ్ గిరిష్ కుమార్తె. రెండేళ్ల క్రితం నగ్రోటాలో జరిగిన దాడుల్లో అక్షయ్ మరణించారు. మనందరి కోసం అక్షయ్ ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు నైనా ఐదో వసంతంలోకి అడుగుపెడుతోంది.. కానీ ఈ సమయంలో తన తండ్రి ఇక్కడ లేకపోవడం విచారకరం. కానీ ఈ చిన్నారికి మనందరం తోడుగా ఉన్నామని హామీ ఇద్దాం రండి’అంటూ ట్వీట్ చేశారు. హుతాన్షు చేసిన ఈ ట్వీట్‌ని కొన్ని గంటల్లోనే దాదాపు 10 వేల మందికి పైగా లైక్ చేయగా.. 4 వేల మంది రిట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment