nagrota attack
-
26/11 దాడి తరహాలో మరో ఉగ్రదాడికి భారీ ప్లాన్!
సాక్షి,ఢిల్లీ: రెండు రోజుల క్రితం జమ్మూలో జరిగిన నగ్రోటా ఎన్‌కౌంటర్‌పై ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సమీక్షలో భారత ఉన్నత నిఘా సంస్థ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా పాల్గొన్నారు. 26/11 ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో భారత్‌లో మరో భారీదాడి చేయాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు మోదీకి అధికారులు వివరించారు.(చదవండి: భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం) ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు అందిస్తున్న సాయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. జాతీయ భద్రతను కాపాడుకోవాడానికి అవసరమైన చర్యలు తీసుకోవాడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మోదీ అభినందన.. "పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో విధ్వంసాలను చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బలగాలు మరోసారి అడ్డుకున్నాయని" ప్రధాని మోదీ తన ట్వీట్లో ప్రశంసించారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా.. జమ్మూలో నగ్రోటా పట్టణానికి సమీపంలో భద్రతా దళాలతో గురువారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 22 వరకు జమ్మూలో జరిగే జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో భాగంగా భారీకుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భద్రతా దళాలకు సమాచారం అందిందని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన మూడు గంటల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజి)కు చెందిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్కును భద్రతా దళాలు అడ్డగించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. 11 ఎకె -47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్, 29 గ్రెనేడ్లు, ఆరు యుబిజిఎల్ గ్రెనేడ్లు, మొబైల్ ఫోన్లు, దిక్సూచి, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ముఖేష్ సింగ్ తెలిపారు. -
వైరలవుతోన్న ట్వీట్.. సంతోషంలో నైనా
న్యూఢిల్లీ : దేశానికి తిండి పెట్టే రైతులు గురించి.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్ల గురించి నాయకులే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. సైనికుల త్యాగాలు.. రైతుల కడగండ్లు మన కళ్లకు కనపడవు. మీడియా కూడా తళుకుబెళుకలకే ప్రాధన్యతిస్తుంది.. కానీ త్యాగాలకు కాదు. కానీ నిజమైన దేశభక్తి కలిగిన కొందరు మాత్రం మనందరికి భిన్నంగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే హుతాన్షు వర్మ. నిన్న (ఆదివారం) హుతాన్షు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవ్వడమే కాకా పలువురు నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. Join me in Wishing Happy Birthday to Little Naina. Naina is the daughter of our hero Major Akshay Girish savior of Nagrota attack, he sacrificed his life for us. Naina is celebrating her 5th birthday today,unfortunately without her father's presence.. RT and wish Happy Birthday pic.twitter.com/JYVUrzId7W — Hutansh Verma (@hutansh) October 28, 2018 ఈ ట్వీట్లో హుతాన్షు ‘చిన్నారి నైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి నాతో కలవండి. నైనా మేజర్ అక్షయ్ గిరిష్ కుమార్తె. రెండేళ్ల క్రితం నగ్రోటాలో జరిగిన దాడుల్లో అక్షయ్ మరణించారు. మనందరి కోసం అక్షయ్ ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు నైనా ఐదో వసంతంలోకి అడుగుపెడుతోంది.. కానీ ఈ సమయంలో తన తండ్రి ఇక్కడ లేకపోవడం విచారకరం. కానీ ఈ చిన్నారికి మనందరం తోడుగా ఉన్నామని హామీ ఇద్దాం రండి’అంటూ ట్వీట్ చేశారు. హుతాన్షు చేసిన ఈ ట్వీట్‌ని కొన్ని గంటల్లోనే దాదాపు 10 వేల మందికి పైగా లైక్ చేయగా.. 4 వేల మంది రిట్వీట్ చేశారు. -
అఫ్జల్ గురు ఉరిశిక్షకు ప్రతీకారంగానే..?
శ్రీనగర్: అఫ్జల్ గురు మరణదండనకు ప్రతీకారంగా తీవ్రవాదులు నగ్రోటా సైనిక ఆయుధాగారంపై దాడి చేసినట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్ లోని నగ్రోటాలో మంగళవారం తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు మరణించారు. దాడికి పాల్పడిన ముగ్గురు తీవ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన అనంతరం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఉర్దూలో రాసిన పత్రాలు దొరికాయి. పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలు చేసినందుకు ప్రతీకారంగా దాడి దిగినట్టు ఈ పత్రాల్లో రాసివుంది. ‘అఫ్జల్ గురుకు మరణదండన విధించినందుకు మొదటి విడతగా ఈ దాడి చేశామ’ని ఉర్దూలో రాసివున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 2011 పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును 2013లో ఉరి తీశారు. కాగా, నగ్రోటాలో ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో ఏకే-47 తుపాకులు, భారీ సంఖ్యలో తూటాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నగ్రోటాలో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో ఆర్మీచీఫ్ దల్బీర్ సింగ్ పర్యటించారు. -
ఆ దాడులకు బాధ్యులెవరు: ఒవైసీ
న్యూఢిల్లీ: భారత సైనికులే లక్ష్యంగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మొన్నటికి మొన్న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఉడీ ఉగ్రవాద దాడుల్లో పెద్ద ఎత్తున జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ఉగ్రవాద దాడిలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. దేశ రక్షణలో భాగంగా వరుస దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు బుధవారం పార్లమెంటులో లేవనెత్తారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ నగ్రోటా ఉగ్రవాద దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా వినిపించుకోలేదని, దీనిపై రక్షణమంత్రి సభలో ప్రకటన చేయలేదని విమర్శించారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నిఘా వైఫల్యం కారణంగా పఠాన్ కోట్, ఉడీ ఉగ్రవాద దాడులు జరిగాయని, తాజాగా నగ్రోటా దాడి జరిగిందని, ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.