ఐఫోన్‌ కోసం బ్లాక్‌మెయిల్‌.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి! | Son Blackmails Mother For iPhone: Video Viral | Sakshi

ఐఫోన్‌ కోసం బ్లాక్‌మెయిల్‌.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!

Aug 19 2024 10:23 AM | Updated on Aug 19 2024 10:53 AM

Son Blackmails Mother For iPhone: Video Viral

పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్‌ కోసం బ్లాక్‌మెయిల్‌ చేశాడా ఘనుడు.

ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్‌మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్‌ షోరూంలో  ఐఫోన్ కొనిచ్చింది. 

ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్‌ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్‌ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్‌ సెక్షన్‌లో మీ అభిప్రాయం చెప్పేయండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement