న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు వైద్యులు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సోకిన బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అలాంటి డాక్టర్లను మనం ఎంత గౌరవించినా అది సరిపోదనే చెప్పాలి. తాజాగా అమెరికాలోని సౌత్‌విండ్సార్ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తోన్న డాక్టర్ ఉమా మధుసూదన్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఉమా మధుసూదన్ అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. (వైరల్ : టెన్నిస్‌ను ఇలా కూడా ఆడొచ్చా)
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నందుకు అక్కడి పోలీసులు, అధికారుల నుంచి ఆమె అరుదైన గౌరవం స్వీకరించారు. డాక్టర్ ఉమా ఉంటున్న వీధిలోకి దాదాపు వంద కార్లలో వచ్చిన పోలీసులు, ఇతర పౌరులు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవసూచకంతో సెల్యూట్ చేస్తూ హారన్ కొట్టారు. వీటిలో పోలీసు వాహానాలు, అగ్ని మాపక వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలు చాలానే ఉన్నాయి. అంతేగాక ఆమె ఇంటి ముందు కొన్ని సెకండ్ల పాటు వాహనాలు నిలిపి 'మీ సేవకు సలాం' అని పేపర్‌పై రాసి ఉన్న వాటిని ఆమె ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. ఉమా మధుసూదన్ పోలీసులు చేసిన పనికి సంతోషిస్తూ వారికి మద్దతుగా క్లాప్స్ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
(కరోనాలో పెళ్లి వద్దు.. డ్యూటీయే ముద్దు!)
Comments
Please login to add a commentAdd a comment