honour ceremony
-
అమ్మా! మీ సేవకు సలాం
-
కరోనా : అమ్మా! మీ సేవకు సలాం
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు వైద్యులు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సోకిన బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. అలాంటి డాక్టర్లను మనం ఎంత గౌరవించినా అది సరిపోదనే చెప్పాలి. తాజాగా అమెరికాలోని సౌత్విండ్సార్ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తోన్న డాక్టర్ ఉమా మధుసూదన్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఉమా మధుసూదన్ అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. (వైరల్ : టెన్నిస్‌ను ఇలా కూడా ఆడొచ్చా) కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నందుకు అక్కడి పోలీసులు, అధికారుల నుంచి ఆమె అరుదైన గౌరవం స్వీకరించారు. డాక్టర్ ఉమా ఉంటున్న వీధిలోకి దాదాపు వంద కార్లలో వచ్చిన పోలీసులు, ఇతర పౌరులు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవసూచకంతో సెల్యూట్ చేస్తూ హారన్ కొట్టారు. వీటిలో పోలీసు వాహానాలు, అగ్ని మాపక వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలు చాలానే ఉన్నాయి. అంతేగాక ఆమె ఇంటి ముందు కొన్ని సెకండ్ల పాటు వాహనాలు నిలిపి 'మీ సేవకు సలాం' అని పేపర్‌పై రాసి ఉన్న వాటిని ఆమె ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. ఉమా మధుసూదన్ పోలీసులు చేసిన పనికి సంతోషిస్తూ వారికి మద్దతుగా క్లాప్స్ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. (కరోనాలో పెళ్లి వద్దు.. డ్యూటీయే ముద్దు!) -
బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, గుంటూరు: అధికారం కోల్పోయి పదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు అధికారం చేజిక్కడంతో హడావుడి చేస్తున్నారు. కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయకముందే జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారుల బదిలీలపై దృష్టి పెట్టారు. ఈ నెల 8న పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేయాలి.. వారి స్థానాల్లో అనుకూలంగా ఉండే వారిని ఎలా నియమించుకోవాలి అనే అంశాలపై ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆలస్యమైతే ఏ నేత ఏ అధికారికి మాటిస్తారోననే భయంతో కొందరు ఇప్పటికే అధినేత వద్ద తాము రూపొందించిన జాబితాలు ఉంచినట్లు సమాచారం. ఒక నేత ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే గురిపెట్టినట్టు తెలుస్తోంది.జిల్లాలో ఓ మాజీ మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మరో వర్గం నేతలంతా ఏకమై ఉన్నతాధికారుల నియామకంలో తమ మాటే నెగ్గేలా ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేసినట్లు తెలుస్తోంది. సదరు ముఖ్యనేతకు మరో మాజీమంత్రికి విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ బదిలీలను ఆయన అడ్డుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, పదిమంది ఎమ్మెల్యేల చేత సంతకాలు కూడా సేకరించినట్లు చెబుతున్నారు. జిల్లా ఉన్నతస్థాయి అధికారులు తాము తెచ్చుకున్న వారైతే జిల్లాలో తమ ఆధిపత్యం కొనసాగుతుందనేది ఆ ముఖ్యనేత ఆలోచన అయి ఉంటుందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. క్యాంపు కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి అక్కడి నుంచే పాలన కొనసాగించాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నాయకులు చెప్పిన అధికారులను నియమిస్తారా లేదా తన సొంత టీమ్‌లోని అధికారులు చెప్పిన వారిని నియమిస్తారా అనేది వేచి చూడాలి. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తే రాష్ట్రస్థాయి అధికారులంతా ఇక్కడే మకాం వేసే అవకాశాలు ఉండటంతో వారికి దూరంగా వేరే జిల్లాల్లో పోస్టింగ్‌లు పొందితే బాగుంటుందనే అభిప్రాయంతో కొందరు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్ల తరువాత అధికారం పొందిన టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కొందరు అధికారులు ప్రస్తుతం పోస్టింగ్‌లు తీసుకోకుండా లూప్లైన్లో పనిచేయడం మంచిదని భావిస్తున్నారు. టీడీపీ నేతల చుట్టూ అధికారుల ప్రదక్షణలు.. జిల్లా స్థాయిలో అధికారుల తీరు ఇలా ఉంటే పట్టణ, మండల స్థాయిలో అధికారులు మాత్రం పోస్టింగ్‌ల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తమకు తెలిసిన టీడీపీ ద్వితీయశ్రేణి నేతల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సిఫార్సులు చేయించుకుంటూ ప్రాధాన్యం ఉన్న చోట పోస్టింగ్‌ల కోసం పరితపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రి పదవుల కోసం హైదరాబాద్‌లోనే మకాం వేయడంతో ముందుగా ఫోన్లో ఎవరికీ మాటివ్వొద్దంటూ ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉండగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతోపాటు ఆర్డీవో, తహశీల్దార్, ఎంపీడీవో వంటి పోస్టులకు తీవ్ర పోటీ నెలకొని ఉండటంతో తాము మొదట్నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండే వారమని చెప్పుకుంటూ అధికారులు తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. -
అదృష్టం ఎందరికో..!
టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ పాలమూరు వాకిట ఎన్ని బుగ్గకార్లు షికారు చేస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. వివిధ రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ‘గులాబీ దళపతి’ మంత్రి వర్గ జాబితాన్ని పకడ్బందీగా రూపొందించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలనుంచీ ఆశావహులు ఎక్కువగానే ఉండడంతో అదృష్టం ఎవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఉత్కంఠకు లోనవుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మరో 24 గంటల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఎందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, జిల్లా నుంచి ఎంతమందికి చోటు దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ అనూహ్య ఫలితాలు సాధించింది. పధ్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జిల్లా నుంచి మంత్రి వర్గం లో చోటు కోసం ముగ్గురు నేతలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. వీరిలో కనీసం ఇద్దరికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మంత్రులు, వారు చేపట్టే శాఖలను కేసీఆర్ ఖరారు చేశారనే వార్తల నేపథ్యంలో జూపల్లి,ల క్ష్మారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే శ్రీనివాస్‌గౌడ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి. మధ్యాహ్నం కల్లా స్పష్టత కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆదివారం మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుందని సమాచారం. సోమవారం తనతో పాటు పదవీ స్వీకార ప్రమాణం చేసే మంత్రుల జాబితాను కేసీఆర్ ఆదివారం ఉదయం గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిన ప్పటికీ ముందస్తుగా వెల్లడిస్తే పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లా ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు దక్కే అవకాశం వుంది. జిల్లాలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పులో కేసీఆర్ కసరత్తు చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రధాన శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. లక్ష్మారెడ్డికి వ్యవసాయం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తార ని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గులాబీ నేత పరిమితంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే జిల్లా నుంచి తొలి విడతలో జూపల్లి కృష్ణారావుకు మాత్రమే మెరుగైన అవకాశాలు ఉంటాయని అంచనా. -
అమరులకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల మందుపాతరకు బలైపోయిన ఏడుగురు పోలీసుల అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య పోలీసులు గౌరవ వందనంతో అమరవీరులకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాధిత కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా చామూర్శి తాలూకా పవిమురాండా-మురమాడి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.