
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు భారత నౌకాదళం సంఘీభావం ప్రకటించింది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పోర్టులలో నౌకలకు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. ముంబై, విశాఖ, చెన్నై, కొచ్చిలలో నౌకలకు దీపాలంకరణ చేసి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు.
కాగా, కరోనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ రోజు ఉదయం వాయుసేన దేశవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా పోరాటానికి రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించింది.
చదవండి : కరోనా యోధులకు గౌరవ వందనం