న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇదే.
ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వీటిని సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment