ballistic missile launch
-
మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం సాయంత్రం 6.20గంటల సమయంలో పశ్చిమ తీర నగరం నంపో నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ మిస్సైల్ ఎంత దూరం ప్రయాణించిందో వెల్లడించలేదు. అణు సామర్థ్యం కలిగిన బీ–52 బాంబర్ పరీక్షలను అమెరికా, దక్షిణకొరియా చేపట్టడంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. -
'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..'
వాషింగ్టన్: వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియా చర్యలను ఖండించాలని ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో అమెరికా ప్రతిపాదించింది. ప్యాంగ్యాంగ్ను దౌత్యపరమైన సంబంధాలవైపు మళ్లేలా చూడాలని సూచించింది. 15 ఉన్నత దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకర దేశంగా అవతరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై తక్షణే చర్యలు తీసుకోవాలని, కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. భద్రతా మండలి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు కంటే దారుణమని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అయితే చైనా, రష్యా మాత్రం అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఉత్తరకొరియాపై మరింత ఒత్తిడి తెస్తే అది నిర్మాణాత్మకంగా ఉండదని వాదించాయి. గతేడాది మేలో ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి మరిన్ని ఆంక్షాలు విధించాలనుకున్నప్పుడు కూడా ఈ రెండు దేశాలే వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నాయి. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆసియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతాయనే విషయాన్ని ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు గుర్తుంచుకోవాలని లిండా వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ఇటీవల మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అనంతరం ప్యోంగ్యాంగ్ పసిఫిక్‌ను 'ఫైరింగ్ రేంజ్'గా ఉపయోగించడం ఆమెరికా దళాల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని కిమ్ జోంగ్ ఉన్ సోదరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. అనంతరం మండలిలోని మూడింట రెండొంతుల సభ్య దేశాలు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఖండిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం -
ఇదేం ఆనందం కిమ్.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..?
కరోనా వైరస్ వ్యాప్తిలో ఉత్తర కొరియా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సమయంలో కిమ్.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. వివరాల ప్రకారం.. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు. రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ ప్రాంతం నుంచి ఆదివారం నార్త్ కొరియా.. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఒక్కరోజులో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇక, తాజాగా చేపట్టిన ప్రయోగాలతో నార్త్ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా అణు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఇటీవలే అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. దీనికి కౌంటర్ ఇస్తూ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. North Korea launched multiple ballistic missiles into waters off its east coast Sunday, South Korea's military said, a day after Seoul and Washington completed their first joint drills involving a US aircraft carrier in more than four years.#VoiceOfNations pic.twitter.com/Hjx3T1QKof — Voice of Nations (@VoiceOfNations7) June 5, 2022 ఇది కూడా చదవండి: జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. వీడియో -
తస్మాత్ జాగ్రత్త!
మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు. మారియుపోల్‌పై ఫోకస్ కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్మిల్ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు. స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది. ► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు. ► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది. ► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది. ► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. -
అణు క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత భారతదేశంపై కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం పాకిస్తాన్ తాజాగా అణు బాలిస్టిక్ క్షిపణి ‘ఘజ్నవి’ని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే కరాచీలోని మూడు గగనతల మార్గాలను మూసివేసి, నిత్యం భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతున్న పాక్ ఇప్పుడు ఏకంగా అణు క్షిపణిని పరీక్షించడం గమనార్హం. అణు వార్హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు. స్కడ్ టైప్ బాలిస్టిక్ మిస్సైల్‌ను అభివృద్ధి చేసి ఘజ్నవిని రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఘజ్నవి వీడియోను పాకిస్తాన్ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ గురువారం ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందించారని అసిఫ్ గఫూర్ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ‘నాజర్’, మే నెలలో ‘షహీన్–2’ అనే బాలిస్టిక్ మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై పాకిస్తాన్ భగ్గుమంటోంది. కశ్మీర్‌పై ఎంతదాకా అయినా వెళ్తామని, అణు యుద్ధానికైనా సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలోనే చెప్పారు. ఈ అణు క్షిపణి లక్ష్య పరిధి: 290 కి.మీ. బరువు: 5,256 కేజీలు పొడవు: 9.64 మీటర్లు చుట్టుకొలత: 88 సె.మీ వార్‌హెడ్: అణ్వాయుధం -
టార్గెట్ అమెరికా..!
సియోల్: అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు, ఆంక్షలను పెడచెవినపెడుతూ ఉత్తరకొరియా మరోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ఉన్ బుధవారం ప్రకటించారు. ఈ క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలమని ఆ దేశ మీడియా చెప్పింది. ఉ.కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, ద.కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి. 4,475 కి.మీ ఎత్తులో.. ఉ.కొరియా విజయవంతంగా పరీక్షించిన ఖండాంతర క్షిపణుల్లో ఇది మూడోది. గత రెండు నెలల కాలంలో మొదటిది. గతంలో ప్రయోగించిన వాటి కన్నా తాజా క్షిపణి ఎంతో అధునాతనమైనదని ఉ.కొరియా వెల్లడించింది. హవాసాంగ్–15గా పిలిచే ఈ ఖండాంతర క్షిపణి 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని పేర్కొంది. ఉ.కొరియాకు చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత రి చున్–హీ అధికారికంగా ఈ ప్రయోగం గురించి ప్రకటన చేశారు. ‘అణు దేశంగా అవతరించాలనుకుంటున్న తమ కల ఎట్టకేలకు నెరవేరిందని అధ్యక్షుడు కిమ్ సగర్వంగా ప్రకటించారు. ఉ.కొరియా ప్రజలు సాధించిన ఈ విజయం వెల కట్టలేనిది’ అని తెలిపారు. భారీ అణు వార్హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేసే సత్తా ఈ క్షిపణి సొంతమని ఉ.కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ వార్త తెలియగానే రాజధాని పాంగ్యాంగ్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రయోజనాలు దెబ్బతిననంత వరకు ఏ దేశం, ప్రాంతానికీ తమ ఆయుధాలతో ఎలాంటి ముప్పు లేదని ఉ.కొరియా చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ చర్చలు ఉ.కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అత్యవసరంగా ఫోన్లో చర్చలు జరిపారు. ఉ.కొరియా దుందుడుకు చర్యలు అమెరికాకే కాకుండా జపాన్, దక్షిణ కొరియా, మొత్తం ప్రపంచానికే ముప్పని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఉ.కొరియా తీరును ఖండించిన నలుగురు నేతలు తాజా పరిణామాలు ఆ దేశ భద్రతను దిగజార్చటంతో పాటు, దౌత్య, ఆర్థిక రంగాల్లో మరింత ఏకాకిని చేస్తాయని హెచ్చరించినట్లు శ్వేతసౌధం తెలిపింది.‘మేం చూసుకుంటాం. మేము ఈ పరిస్థితిని ఎదుర్కోగలం’ అని ట్రంప్ మీడియాతో చెప్పారు. ఉ.కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం అక్రమం, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ స్పందిస్తూ...ప్రపంచ శాంతికి అస్థిరత కలిగించే చర్యలను మానుకోవాలని సూచించారు. తాజా ప్రయోగం ఆసియాలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుందని రష్యా హెచ్చరించింది. ఉ.కొరియా మిత్ర దేశం చైనా కూడా క్షిపణి ప్రయోగాన్ని ఖండిస్తూ...కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దిగొద్దని ఆ దేశానికి సూచించింది. -
ఉత్తర కొరియాపై జపాన్‌కు కోపమొచ్చింది
టోక్యో: ఉత్తర కొరియా చర్యలపై జపాన్ మండిపడింది. ఇటీవల ఆదేశం బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ ప్రధాని షింజో అబే ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడమనేది ఉత్తర కొరియా ఏమాత్రం ఆలోచన లేకుండా చేస్తున్న చర్య అన్నారు. ఇలాంటి చర్యలను తమ భద్రతకు ఆ దేశం చేస్తున్న హెచ్చరికలుగానే భావిస్తున్నామని.. వెంటనే ఉత్తర కొరియా వాటిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర కొరియా చేస్తున్న చర్యలు ఈ మాత్రం క్షమించరానివని, ఆ దేశం నిర్లక్ష్యంగా చేస్తున్న చేష్టలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరుపుతున్న తెలిసిందే. ఈ చర్యల పట్ల ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా జపాన్ కూడా వాటి సరసన చేరింది.