ఉత్తర కొరియాపై జపాన్కు కోపమొచ్చింది | Japan's Abe calls North Korean missile test 'reckless act' | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియాపై జపాన్కు కోపమొచ్చింది

Published Wed, Aug 24 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఉత్తర కొరియాపై జపాన్కు కోపమొచ్చింది

ఉత్తర కొరియాపై జపాన్కు కోపమొచ్చింది

టోక్యో: ఉత్తర కొరియా చర్యలపై జపాన్ మండిపడింది. ఇటీవల ఆదేశం బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ ప్రధాని షింజో అబే ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడమనేది ఉత్తర కొరియా ఏమాత్రం ఆలోచన లేకుండా చేస్తున్న చర్య అన్నారు.

ఇలాంటి చర్యలను తమ భద్రతకు ఆ దేశం చేస్తున్న హెచ్చరికలుగానే భావిస్తున్నామని.. వెంటనే ఉత్తర కొరియా వాటిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర కొరియా చేస్తున్న చర్యలు ఈ మాత్రం క్షమించరానివని, ఆ దేశం నిర్లక్ష్యంగా చేస్తున్న చేష్టలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరుపుతున్న తెలిసిందే. ఈ చర్యల పట్ల ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా జపాన్ కూడా వాటి సరసన చేరింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement