
బుడ్డోడి ‘కడక్’ సెల్యూట్‌కు ఫిదా అయిన ఐటీబీపీ సిబ్బంది అతనికి యూనిఫాం అందించి గౌరవించారు.
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సెల్యూట్ చేసి వార్తల్లో నిలిచిన ఐదేళ్ల నవాంగ్ నంగ్యాల్ మరోసారి హైలైట్ అయ్యాడు. బుడ్డోడి ‘కడక్’ సెల్యూట్‌కు ఫిదా అయిన ఐటీబీపీ సిబ్బంది అతనికి యూనిఫాం అందించి గౌరవించారు. మిలటరీ యూనిఫాం ధరించి సైనిక కవాతు చేస్తున్న నంగ్యాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, లేహ్‌లోని చుశూల్‌కు చెందిన కిండర్ గార్టెన్ విద్యార్థి నంగ్యాల్ తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందికి గత అక్టోబర్ 11న సెల్యూట్ చేశాడు. అతని దేశభక్తికి ముగ్ధుడైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సైనిక వందనంలో చిన్నారికి కొన్ని సూచనలు చేశారు. దాంతోపాటు ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్ అయింది. క్యూట్ సోల్జర్, భవిష్యత్ సైనికుడు, వీరుడు సిద్ధమవుతున్నాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
(చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు)