చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు! | Little Girl Hit by Soldier Saluting Britain's Queen | Sakshi
Sakshi News home page

చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!

Published Sun, Jun 14 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!

చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!

లండన్: చక్కగా ఎర్రటి గౌను వేసుకొని, తలపై నల్లటోపి పెట్టుకొని చేతిలో పూల బొకేతో చిరునవ్వులు చిందిస్తున్న కనిపిస్తున్న ఆ పాప పేరు మైసీ గ్రాగరీ. ఆరేళ్ల ఈ పాప పూల బొకే ఇస్తుంది ఎవరికనుకుంటున్నారు? బ్రిటన్ మహారాణికి. చక్కగా వందనం చేస్తూ తనకు పూల బొకే అందించిన మైసీని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 అభినందించి అలా ముందుకు వెళ్లిందో లేదో ఆ పాప ఆనందం ఇట్టే మాయమైంది. కెవ్వున ఏడుపు కేక పెట్టింది. ఎందుకంటారా.. మరేం లేదు.. బ్రిటన్ రాణి వస్తుండగా ఆమెకు స్వాగతం పలికే సోల్జర్స్లో ఒకతను ఆ పాప మైసీ పక్కనే ఉన్నాడు.

పూల బొకే అందుకుని బ్రిటన్ రాణి సరిగ్గా తనను దాటి వెళుతుండగా అతడు వేగంగా తన చేయితో సెల్యూట్ చేశాడు. ఈ క్రమంలో అతడి చేయి మైసీకి బలంగా తగలడంతోపాటు టోపీ కూడా ఊడిపోయింది. దీంతో అప్పటి వరకు నవ్వులు చిందించిన ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో భిక్కమొఖం పెట్టి తన తల్లి చాటుకు వెళ్లి నిల్చుని బుంగమూతితో కాస్త కోపంగా ఆ సైనికుడి వైపు చూసింది. ఆ వెంటనే సైనికుడు దగ్గరికొచ్చి మైసీకి, ఆమె తల్లికి క్షమాపణలు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement