ఇదేంది బాస్ | Police Department Hot Topic ps potsings | Sakshi
Sakshi News home page

ఇదేంది బాస్

Published Sun, Jan 26 2014 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

ఇదేంది బాస్ - Sakshi

ఇదేంది బాస్

  •      జూనియర్ల వద్ద సీనియర్ల కొలువు
  •      {పొబేషనరీ ఎస్సైలకు ఎస్‌హెచ్‌ఓ స్థానాలు
  •      సీనియర్లకు సెకండ్ ఎస్సైగా డిమోషన్
  •      పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్‌గా పీఎస్సై పోస్టింగ్‌లు
  •      అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్న  బాధిత సబ్ ఇన్‌స్పెక్టర్లు
  •  
     నిన్నటి వరకు వారందరూ సీనియర్ ఎస్సైల వద్ద వృత్తిలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం నుంచి కేసు దర్యాప్తు వరకు అనేక విషయూలను సీనియర్ల వద్ద ఉండి నేర్చుకున్నారు. సీనియర్లు ఆదేశించగానే ‘ఎస్ సర్’ అని సెల్యూట్ చేస్తూ గౌరవించారు. పోలీస్ బాస్‌ల నిర్ణయం పుణ్యమా.. అని తాజా పరిస్థితి తారుమారైంది.  ప్రొబేషనరీ ఎస్సైలకు సీనియర్లే సెల్యూట్ చేయూల్సిన వింత పరిస్థితి ఏర్పడింది. ఇది తమను అవమానించడమేనని, ఆత్మగౌరవాన్ని గాయపరచడమేనని సీనియర్లు వాపోతున్నారు.
     
    వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ల(పీఎస్సై)ల పోస్టింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. సీనియారిటీని విస్మరించి కొత్తగా శిక్షణ తీసుకున్న పీఎస్సైలకు ఎస్‌హెచ్‌ఓ స్థానాలు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న సీనియర్లను అదేస్థానంలో ఉంచి.. కొత్తగా శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన వారికి ఎస్‌హెచ్‌ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. 2013 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి తాజాగా రూరల్‌లో 27 మందికి, అర్బన్ పరిధిలో ఆరుగురికి  శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఇచ్చిన పోస్టింగ్ ప్రాధాన్యతే ఇక్కడ తలనొప్పిగా మారింది.

    ఇప్పటికే  ఆయూ స్థానాల్లో ఎస్సై లుగా కొనసాగుతున్న వారిని డిమోట్ చేసి వారి స్థానంలో ప్రొబేషనరీ ఎస్సైలను నియమించారు. 2002, 2007, 2009 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు పనిచేస్తున్న స్థానాలకు 2013 బ్యాచ్ ఎస్సైలను పంపించారు. వారి వద్ద సీనియర్లు సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ అందుకున్న కొందరు ఎస్సైలను ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడంతోపాటు వారి కిందే అక్కడే పని చేయాలని సీనియర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. నిన్నగాక మొన్న శిక్షణ పూర్తిచేసుకున్న వారు చెప్పినట్లు ఇకపై సీనియర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి న్యాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    ప్రొబేషనరీ పీరియడ్ పూర్తికాకుండానే...
     
    ప్రస్తుతం పోస్టింగ్‌లు పొందిన ఎస్సైలకు ప్రొబేషనరీ డిక్లేర్ కావడానికి ఇంకా 18 నెలల సమయం ఉంది. వీరంతా 13 నెలలు హైదరాబాద్ అప్పాలో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ కాలం ప్రొబేషనరీ పిరియడ్‌లోకి రాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 6 నెలలపాటు ఇక్కడ శిక్షణ ఉంటుది. ఈ సమయంలో వారు కానిస్టేబుల్‌గా, హెడ్‌కానిస్టేబుల్‌గా, ఏఎస్సైగా పలు విభాగాల్లో పనిచే యాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల కాలం కలిపితే మరో 18 నెలలు ఇంకా ప్రొబేషనరీ కాలం ఉంటుంది. ఈ కాలం పూర్తయితే సర్వీసు పరంగా వీరికి అన్ని కౌంటింగ్‌లోకి వస్తాయి. ఈ ప్రొబేషనరీ సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఏమైనా తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం నుంచే డిస్మిస్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
     
    ఇదెక్కడి న్యాయం..
     
    అర్బన్ పరిధిలో ఆరుగురు పీఎస్సైలను మామునూరు, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అయా స్థానాల్లో పనిచేస్తున్న వారంతా సెకండ్ ఎస్సైలుగా కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రూరల్ పరిధిలో మరిపెడ పీఎస్ ఎస్సై జె.వెంకటరత్నం, చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, చేర్యాల ఎస్సై సూర్యప్రసాద్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్సైలకు బాధ్యతలు అప్పగించి అక్కడే సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలి. నర్సింహులపేట ఎస్సై వై. వెంకటప్రసాద్ ఏటూరునాగారం బదిలీ అయ్యూరు. ఆయన కూడా తన వద్ద శిక్షణ పొంది ఏటూరునాగారం పీఎస్ ఎస్సైగా పోస్టింగ్ పొందిన రవీందర్ వద్ద సెకండ్ ఎస్సైగా పనిచేయూల్సి ఉంది. పదేళ్ల సీనియూరిటీ కలిగిన చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, మామూనూరు ఎస్సై సత్యనారాయణ సైతం తాము పనిచేసే స్టేషన్లలోనే సెకండ్ ఎస్సైలుగా డిమోట్ అయ్యూరు.
     
    ఆవేదన చెందుతున్న సీనియర్లు

     
    జూనియర్లు వస్తే సీనియర్లకు పదోన్నతి ఉండాలిగానీ అందుకు విరుద్ధంగా డిమోట్ చేయడం చర్చనీయూంశంగా మారింది. అనుకోని విధంగా ఉత్తర్వులు రావడంతో బాధిత ఎస్సైలు కలత చెందుతున్నారు. జూనియర్ల వద్ద తమను సెకండ్ ఎస్సైలుగా పనిచేయించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన చెందుతున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి తమను బలిచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే తమను వీఆర్‌లోనో, ఉన్నతాధికారులకు అటాచ్డ్‌గానో నియమించినా బాగుండేదని వాపోతున్నారు. శాఖాపరంగా తప్పులు చేసిన వారికి మాత్రమే.. ఇలాంటి పనిష్‌మెంట్‌లు ఇస్తారని కాని తాము ఎలాంటి తప్పుడు విధానాలు అవలంభించకున్నా తమకు ఈ శిక్ష ఎందుకు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement