Hot Topic
-
ప్రైవేట్ జెట్, రూ.100 కోట్ల లగ్జరీ బంగ్లా, యాడ్స్‌తో కోట్లు, ఎవరీ ‘తార’
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్‌గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్‌గా పాపులర్ అయిన నయనతార ఒకరు. పార్ట్ టైమ్ మోడల్‌గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్‌తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్‌తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్. కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఫలితమొచ్చి వారం గడుస్తున్నా.. ఒడవని మునుగోడు ముచ్చట!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచిన ‘మునుగోడు’ వేడి ఇంకా చల్లారలేదు. ఉప ఎన్నిక ఫలితం వచ్చి వారం గడుస్తున్నా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం ఇచ్చిన సంకేతాలేంటి? త్రిముఖ పోటీ జరిగితే 2023 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? అనే ఎన్నో ప్రశ్నలపై చర్చలు జరుగుతున్నాయి. గేరు మార్చిన ‘కారు’ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ దోస్తీ గురించే రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాజకీయ రణరంగంలో తిరుగులేని శక్తిగా నిలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు పొత్తు రాజకీయాలకు మునుగోడు నుంచే తొలి అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలవాలన్న టీఆర్ఎస్ వ్యూహం సత్ఫలితాన్నే ఇచ్చినా.. ‘కారు’కు అదనపు బలం అవసరం పడుతోందనే చర్చకూ తావిచ్చిందని చర్చ జరుగుతోంది. కోరి తెచ్చుకున్నా చేదు తీర్పు! మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మునుగోడు వేదికగా గోల్ కొట్టి ‘రాజ’సంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక ఫలితం చేదు తీర్పు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. కోలుకునేదెప్పుడు? సిట్టింగ్ స్థానంలో పోటీచేసి.. మూడోస్థానానికి పడిపోయి, డిపాజిట్‌ను గల్లంతు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఉప ఎన్నిక సందిగ్ధంలోకి నెట్టింది. తమకు 23 వేలకు పైగా ఓట్లు రావడం, పార్టీని వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడంతో సంతోషించాలో.. సిట్టింగ్ నుంచి మూడోస్థానానికి పడిపోవడంపై బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ఇంకెప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చిన్నాచితకా పార్టీలు.. ఎప్పటిలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతాయని మునుగోడు ఉప ఎన్నిక తేల్చిందనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ఉప ఎన్నికతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన
మొయినాబాద్(రంగారెడ్డి జిల్లా): ప్రస్తుతం చర్చంతా 111 జీవోపైనే సాగుతోంది. సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేసింది మొదలు స్థానికంగా ఎక్కడ చూసినా ‘జీవో ఎత్తేస్తారంట కదా..’ అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. జీవో పరిధిలోని గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఇది ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో.. ఇదీ జీవో కథ.. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంకోసం నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. జలాశయాలకు వరదనీరు వచ్చే ఎగువ ప్రాంతంలో ఉన్న ఏడు మండలాల్లోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చింది. నిబంధనల ప్రకారం ఈ గ్రామాల పరిధిలో కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు, లేఅవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు వీల్లేదు. దీంతో ఈ ప్రాంతంలో నగర విస్తరణ జరగలేదు. జంట జలాశయాల కింది భాగం వరకు పెద్ద నిర్మాణాలు చేపట్టి నగర విస్తరణ జరిగినా జలాశయాలను దాటి మాత్రం రాలేదు. స్థానికంగా భూముల ధరలు పెరగలేదు. అందరికీ ప్రచారాస్త్రం జీవో కారణంగా కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం.. భూముల ధరలు పెరగడంలేదంటూ స్థానిక రైతులు, ప్రజలు వ్యతిరేకించారు. 2007లో 111 జీవో వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేపట్టారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు జీవో ఎత్తివేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. రాజకీయ పారీ్టలు సైతం ఈ జీవోను ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. రెండు సార్లు టీఆర్ఎస్ కూడా జీవోను ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. సీఎం ప్రకటనతో.. ‘హైదరాబాద్ దాహర్తి తీర్చడానికి కృష్ణా, గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నాయని.. జంటజలాశయాల నీళ్లను ఇప్పుడు వాడటం లేదని.. ఇక 111 జీవో కాలం చెల్లిందని.. ఎత్తివేస్తాం’ అంటూ సీఎం ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, బస్టాపులు, ఆఫీసులు, రోడ్లపై ఎటు చూసినా ఇదే చర్చ. జీవో నిజంగా ఎత్తివేస్తే తమ భూములకు ధరలు పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇది సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జీవోను ఎత్తివేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్ష పారీ్టల నాయకులు ఇది ఎన్నికల డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయనే ఊహాగానాలతోనే సీఎం ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా 111 జీవోపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి. జీవో ఎత్తేస్తేనే మేలు 111 జీవోతో ఇప్పటి వరకు మా భూములకు ధరలు లేవు. భూమిపై బ్యాంకులో అప్పు తీసుకోవాలన్నా ఇబ్బంది ఉంది. జీవో ఎత్తేస్తే భూ ముల ధరలు పెరుగుతాయి. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -మల్లేష్, రైతు, ఎత్బార్పల్లి మా పోరాట ఫలితమే.. 111 జీవోను వ్యతిరేకిస్తూ 2007 నుంచి పోరాటం చేస్తున్నాం. స్థానికులంతా జీవోను వ్యతిరేకిస్తున్నారు. మా పోరాటంతోనే ఇప్పు డు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను త్వరలోనే నిజం చేయాలి. -కొమ్మిడి వెంకట్‌రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట కమిటీ అధికార ప్రతినిధి ఇది ఎన్నికల డ్రామా సీఎం కేసీఆర్ 111 జీవోను ఎన్నికల స్టంట్‌గా వాడుకుంటున్నారు. గతంలో రెండుసార్లు జీవో ఎత్తేస్తామని హామీ ఇచ్చా రు. ఇప్పుడు ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని మరోసారి జీవోను తెరపైకి తెచ్చారు. ఇది ఎన్నికల డ్రామాలో భాగమే. -మధుసూదన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు, మొయినాబాద్ -
హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు
-
ఢిల్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఓ అంశం నేడు ప్రచారాస్త్రమైంది. అక్రమ వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసువేయడం కోసం కొనసాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ అది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి డ్రైవ్ 2006లోనే ప్రారంభంకాగా, తాజా డ్రైవ్ 2017, డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. దీని క్రింద 2019, జనవరి 31వ తేదీ నాటికి ఢిల్లీ నగరంలో 10,533 షాపులను మూసివేశారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ సీలింగ్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ మూడు పాలక మండళ్లలోను బీజేపీయే అధికారంలో ఉంది. ఈ దుకాణాదారులంతా సంప్రదాయంగా బీజేపీ విధేయులు. ఇప్పుడు వారంతా బీజేపీ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, వారు ఈసారి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయక పోవచ్చని బీజేపీలోని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీలింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులంతా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో స్థానిక బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వ్యాపారుల సమస్యకు సామరస్య పరిష్కారాన్ని వెతకాలంటూ ఓ వర్గం వ్యాపారుల పక్షం వహిస్తోంది. ఏదేమైనా ఈ సమస్య ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీదకు నెట్టివేసేందుకు ఇరువర్గాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌ను అధికారంలోని ఆప్ ప్రభుత్వం మార్చిందని, అలా మార్చకపోయి ఉన్నట్లయితే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేశ్ భాటియా వాదిస్తున్నారు. మరోపక్క అరవింద్ కేజ్రివాల్ వివిధ వ్యాపార వర్గాల నాయకులతో ఇప్పటికే పలు విడతలుగా చర్చలు జరిపారు. రాష్ట్ర హోదాకు వారి సమస్యలకు లింకు పెట్టారు. రాష్ట్ర హోదా వచ్చినట్లయితే వ్యాపారం మరింత విస్తరిస్తోందంటూ వారికి ఆశ చూపిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వచ్చినట్లయితే పది రోజుల్లో మూసివేసిన షాపులను తెరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఏదేమైనా వ్యాపారుల సమస్యే నేడు హాట్ ఠాపిక్‌గా మారింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన పోలింగ్ జరుగుతోంది. -
‘నో’ చెప్పడం నేర్చుకున్నా!
‘కెరీర్ బిగినింగ్ డేస్‌లో నేనూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేశాను’ అంటున్నారు బాలీవుడ్ హాట్ యాక్టర్ రాఖీ సావంత్. క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్. ఈ విషయం గురించి రాఖీ సావంత్ మాట్లాడుతూ –‘‘కెరీర్ స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. అలా అని అందరు దర్శకులు, నిర్మాతలను తప్పుపట్టడం లేదు. కేవలం కొందరిని మాత్రమే. అవును.. ఇండస్ట్రీలో సెక్సువల్ కరప్షన్ ఉంది. అయినా.. ఎక్కడ లేదని? నేను నా ట్యాలెంట్‌ని నమ్ముకున్నాను. అందుకే ఎక్కడా లొంగిపోలేదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకోవడానికి నా ట్యాలెంట్‌ను ఉపయోగించుకున్నాను. స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్న ఆర్టిస్ట్‌లందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఓపికగా ఉండండి. షార్ట్‌కట్స్‌కు టెంప్ట్ అవ్వకండి’’ అని పేర్కొన్నారు. -
మా నాయనే! బంగారం!!
బంగారం ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. తులం బంగారమైనా మనకు కొండంత బంగారమే.కానీ వీళ్లు చూడండి... బంగారు కొండల్నే పిండిగొట్టి తెచ్చినట్టుగా బంగారాన్ని రేకులుగా, కేకులుగా, పూతరేకులుగా, పొరలు పొరలుగా మలిచి ఎన్ని శింగారాలు పోయారో!! గోల్డ్ డంబెల్స్: జపాన్‌లో 2006లో ఈ గోల్డెన్ డంబెల్స్ తయారయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ డంబెల్స్‌ను టోక్యో హోటల్లో ప్రదర్శనకు పెట్టారు. కిలో నుంచి మూడు కిలోల వరకు బరువున్న ఈ డంబెల్స్‌ను 15 నుంచి 43 లక్షల రూపాయల మధ్య విక్రయించారు. టనాకా అనే కంపెనీ వీటిని డిజైన్ చేసింది. గోల్డ్ క్యాలెండర్: ఇది 2009 నాటి క్యాలెండర్. దీనిని టనాకా జ్యుయలరీ కంపెనీ తయారు చేయించింది. 2008లో ఈ క్యాలెండర్‌ను అమ్మకానికి పెడితే కోటీ 94 లక్షల రూపాయలకు ఎవరో ఎగరేసుకుపోయారు. గోల్డ్ టాయ్‌లెట్: హాంకాంగ్‌లోని ఒక సంపన్నుడు.. తన కోసం చేయించుకున్న ఈ బంగారు టాయ్‌లెట్‌ని చూసే భాగ్యాన్ని 2005లో బయటి ప్రపంచానికి కలిగించాడు. విలువ సుమారు 28 కోట్ల రూపాయలు. గోల్డ్ లెన్స్: లెన్స్ అంటే కాంటాక్ట్ లెన్స్. ఇండియాలోని ప్రముఖ కళ్లద్దాల విక్రేత చంద్రశేఖర్ చవాన్ 2011లో ఐదు గ్రాముల బరువుతో ఈ బంగారు లెన్స్‌ను రూపొందించారు. పదిన్నర లక్షల రూపాయలకు వీటిని విక్రయించారు. గోల్డ్ హార్స్: ఈ కంచు గుర్రం విగ్రహం మీద పూత అంతా బంగారమే. 2014 అశ్వనామ సంవత్సరం కావడంతో జపాన్‌లోని టనాక జ్యుయలరీస్ వారు దీనిని డిజైన్ చేసి అప్పట్లో కోటి రూపాయలకు అమ్మారు. గోల్డ్ పిల్స్: కొన్నేళ్ల క్రితం జండూ ఫార్మస్యూటికల్స్ వాళ్లు బంగారు పూత పూసి, శృంగార ఉద్దీపనాలుగా బ్రిటన్‌లో విక్రయించిన నక్స్ వామికా ఔషధ గుళికలు ఇవి. బ్రిటన్‌లో ఆసియా సంతతి పురుషులు వీటిని అప్పట్లో ఎగబడి కొన్నారట! గోల్డ్ టాయ్‌లెట్ పేపర్ 24 క్యారెట్ల బంగారు పొరలతో ఈ లగ్జరీ టాయ్‌లెట్ పేపర్ తయారైంది. 2014లో జర్మనీలోని ఓ టిష్యూ డిజైన్ వర్క్‌షాప్ దీనిని రూపొందించింది. ఒక్కో రోల్ ధర రూ. 17 వేలు. గోల్డ్ షూ: సుమారు కిలో బరువున్న ఈ గోల్డ్ షూను చైనాలోని షెన్యాంగ్ పట్టణంలోని ఒక చెప్పుల దుకాణం ఇటీవల ప్రదర్శనకు పెట్టింది. ఈ సింగిల్ షూ ఖరీదు 27 లక్షల రూపాయలు. గోల్డ్ సండే: సండే అంటే ఒక రకం ఐస్ క్రీమ్. పండ్ల ముక్కలు, ఎండు పప్పులు, స్వీట్ సాస్ చల్లి చేసే ఐస్‌క్రీమ్. వీటితో పాటు 24 క్యారెట్ల బంగారాన్ని కూడా పూత రేకుగా పైన అంటించి 2007లో ఈ గోల్డ్ సండేని న్యూయార్క్‌లోని ‘సెరెండిపిటి 3’ అనే రెస్టారెంట్ తయారు చేసింది . దీనికి ‘ఫ్రోజెన్ ఔట్ చాకొలెట్’ అనే పేరు పెట్టి 17 లక్షల రూపాయలకు అమ్మింది! అదే ఏడాది ఈ బంగారు చాక్లెట్ క్రీమ్.. అత్యంత ఖరీదైన స్వీట్‌గా గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది! -
నోట్ల రద్దుతో వారిద్దరూ హాట్ టాపిక్ మారారు
-
అంతా మాఇష్టం
ట్రిపుల్‌ఐటీలో అనధికార ఉద్యోగులు ఈసీ నిర్ణయం బేఖాతరు ఇష్టారాజ్యంగా పరిపాలన ట్రిపుల్ ఐటీలో పాలన గడితప్పుతోంది. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టు పోస్టుల్లో ఇష్టారాజ్యంగా సిబ్బందితో నింపేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సిబ్బంది పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూజివీడు : ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులున్నారు. వెయ్యి మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం వివాదస్పదమవుతోంది. ఈసీ అనుమతి లేకుండానే రెండు నెలల క్రితం డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు దాదాపు వంద మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇంతమంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాలి. ఈసీ అనుమతినివ్వనప్పటికీ బేఖాతరు చేస్తూ నియామకాలు జరపడం సంచలనంగా మారింది. సిబ్బంది నియామకంపై.. ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సరిపోయిన సిబ్బంది ఆరువేల మందికి తగ్గినప్పుడు ఎందుకు సరిపోరనే వాదనను పలువురు తెచ్చిన లెక్కచేయకుండా కొందరు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో ఈ నియామకాలకు తెరలేపినట్లు ట్రిపుల్‌ఐటీలో వినికిడి. ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎలా ఇస్తారని నూజివీడు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు డైరెక్టర్‌ను ప్రశ్నించారు. రెండు నెలలుగా జీతాలు లేవు.. ఈసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ట్రిపుల్‌ఐటీలో సొంతంగా నియమించుకున్న దాదాపు వంద మంది అనధికార వ్యక్తులకు రెండు నెలలు గడిచినా ఇంత వరకు జీతాలు చెల్లించలేదు. అసలు మా పోస్టులు ఉంటాయా, ఉండవా..? పనిచేసిన కాలానికైనా జీతాలు ఇస్తారా, ఇవ్వరా...? ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విద్యాసంస్థలో నియామకాలను ఒక పద్ధతి లేకుండా నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు: ఉన్నం వెంకయ్య, ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు. నియమించుకున్న వారిని వెంటనే తొలగించమని కూడా చెప్పడం జరిగింది. -
ఓటుకినోటు హాట్‌టాపిక్
-
‘హాట్ సీటు’ ఎవరిదో!
సాక్షి, రాజమండ్రి :వచ్చే అధికారి మనవాడైతే పుష్కరాల్లో అంతా చక్రం తిప్పవచ్చని కొందరు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పుష్కరాలకు ప్రధాన వేదికైన రాజమండ్రిలో ఉండే కీలక శాఖల ఉన్నతాధికారులు.. తాము చెప్పినట్టు తలాడించే వారే కావాలని ప్రజాప్రతినిధులు ఆరాటపడుతున్నారు. దీనిని ముందే గ్రహించిన కొందరు అధికారులు.. ఆ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీ ఇప్పుడు అధికార, రాజకీయ ప్రముఖులకు హాట్ టాపిక్‌గా మారింది. పావులు కదుపుతున్న రాజేంద్రుడు ప్రస్తుతం రాజమండ్రి కార్పొరేషన్లో రవీంద్రబాబు కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఈయన మున్సిపల్ రీజనల్ డెరైక్టర్‌గా పనిచేశారు. మళ్లీ ఈయనకే ఆర్డీ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇటీవల రెండు పదవులూ ఒకే అధికారి నిర్వర్తించడం విమర్శలకు దారితీసింది. దీంతో ఆర్డీగా కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పోస్టుకు గతంలో ఇక్కడే పనిచేసిన రాజేంద్రప్రసాద్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాదాపు ఇది ఖాయమైనట్టు మున్సిపల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతటితో ఆగక .. కాగా ఆర్డీగానే కాకుండా మున్సిపల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు చేపట్టేలా రాజేంద్రప్రసాద్ స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న రవీంద్రబాబు తమకు సహకరించడం లేదంటూ కొందరు టీడీపీ నేతలు ఆయన బదిలీకి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా పురపాలక శాఖ అధికారులు తమకు సహకరించడం లేదని తరచూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ప్రస్తుత కమిషనర్ బదిలీ వార్తలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో పట్టు చలాయించాలని చూస్తున్న గోరంట్ల.. కమిషనర్‌ను కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని రప్పించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే రాజేంద్రప్రసాద్ రాకపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాత్రం అయిష్టంగా ఉన్నట్టు తెలిసింది. పుష్కరాలను సమర్థంగా నిర్వహించాలంటే ఐఏఎస్ అధికారి ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇద్దరు అధికారుల నేపథ్యమిదీ.. గతంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు 2009 అక్టోబర్ 10 నుంచి జూలై ఏడు వరకు రాజేంద్రప్రసాద్ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం జూలై తొమ్మిది నుంచి 2013 ఏప్రిల్ నాలుగు వరకు మున్సిపల్ ఆర్డీగా కొనసాగారు. అనంతరం మళ్లీ ఆయనే 2013 ఏప్రిల్ 20 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి రెండు వరకు కమిషనర్‌గా మరోసారి పనిచేశారు. ఈ కాలంలో ప్రస్తుత కమిషనర్ రవీంద్రబాబు ఆర్డీగా వ్యవహరించారు. రాజేంద్రప్రసాద్ బదిలీ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి రెండున రవీంద్రబాబు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుని, ఆర్డీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కిస్ కీ బాతే
‘కిస్ ఆఫ్ లవ్’ కేరళలో రాజుకున్న ఈ వివాదం.. హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కేంద్రంగా నిలిచిన హోటల్‌పై దాడిని ఖండిస్తూ.. హెచ్‌సీయూలో కొందరు విద్యార్థులు నిరసన గళం వినిపిస్తున్నారు. ముద్దుతో కల్చర్‌కు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు. ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్లో ముద్దు కూడా ఓ భాగమని క్యాంపస్ కబుర్లలో ‘కిస్ కీ బాతే’ షేర్ చేసుకున్నారు. అతిరా: ‘కిస్ ఆఫ్ లవ్’ అనేది చాలా చిన్న విషయం. మోరల్ పోలీసింగ్ (నైతిక నిఘా) పేరుతో మమ్మల్ని రకరకాలుగా వేధించడంలో ఇది ఒక అంశం మాత్రమే. బయట రోడ్డుపై ఒకమ్మాయి, అబ్బాయి కలసి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్లిద్దరికీ పెళ్లి చేయడం నుంచి మొదలుపెట్టారు. ఇదిగో ఈ రోజు ముద్దు పెట్టుకోవడం పెద్ద క్రైమ్ అంటూ మా మీద దాడులు చేస్తున్నారు. అమ్మూమోహన్: సమాజంలో జరిగే అంశాలపై స్పందించే హక్కు విద్యార్థులుగా మాకుంది. కేరళలో ఒక రెస్టారెంట్లో ఓ ఇద్దరు ప్రేమికులు ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని టీవీలో చూసి మొత్తం రెస్టారెంట్‌ని ధ్వంసం చేయడం చిన్న విషయం కాదు. దాని మీద స్పందిస్తే తప్పా..? అలాగని మేమేమీ అందరినీ ముద్దు పెట్టుకోమని సలహాలు ఇవ్వడం లేదు కదా! ధీరజ్: కేరళలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ మేం చిన్న గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే..దానిపై పెద్ద రభస చేసి బయట మనుషులొచ్చి మాపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయం? పైగా భారతీయ కల్చర్‌ని పాడుచేస్తున్నామంటూ నిందలు వేస్తున్నారు. కేవలం ప్రేమికుల వల్లే మన కల్చర్ పాడైపోతోందని గగ్గోలు పెడుతున్నారు. అతిరా: అయినా ‘కిస్ ఆఫ్ లవ్’లో తప్పేముంది. ఆత్మీయంగా హగ్ చేసుకోవడం.. ముద్దుతో మనలోని ఎమోషన్ని ఎక్స్‌ప్రెస్ చేయడమే. మోరల్ పోలీసింగ్ పేరుతో కండిషన్లు పెట్టడం పౌరహక్కుల ఉల్లంఘన కాదంటారా! ధీరజ్: ఎగ్జాట్లీ...అతిరా. ఇదో వంక మాత్రమే. వాలెంటైన్స్ రోజున కనిపించిన ప్రేమికులందరికీ పెళ్లిళ్లు చేయాలనే పేరుతో యువతను వేధించిన సందర్భాలున్నాయి. శ్రీలత: అవును.. గొప్పగా చదవాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. ఇష్టమైతే వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు. హైఫై జీవితం గడపొచ్చు. కానీ, స్వేచ్ఛగా స్నేహం చేయకూడదు. ప్రేమించకూడదు. కోరుకున్నవాణ్ని పెళ్లి చేసుకోకూడదు. అలా చేస్తే మన కల్చర్ పాడైపోతుందంటారు. కల్చర్ అంటే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం ఒప్పుకోవడం ఒక్కటే కాదు కదా ! మన దేశ సంస్కృతిని కాపాడటానికి ఈ ఒక్క పని చేస్తే సరిపోతుందా..? అతిరా: శ్రీలత.. మొన్నామధ్య నేను మా ఊరెళ్లాను (కేరళ). తమ్ముడు, నేనూ ఫస్ట్ షో సినిమాకి వెళితే టికెట్లు దొరకలేదు. సెకండ్ షోకి వెళ్లాం. అంతే సినిమా అయిపోయాక రిటర్న్ అవుతుంటే.. ఓ పదిమంది గ్యాంగ్ వచ్చి ‘మీరిద్దరు లవర్సే కదా!.. పదండి పెళ్లి చేస్తాం’ అంటారు. నేను షాక్. కాదురా బాబు అని బతిమాలితే వదిలారు. ఆ గ్యాంగ్‌లో ఒకరు మా తమ్ముడి ఫ్రెండ్ రిలేటివ్. వాడి నిజస్వరూపం ఏంటంటే.. ప్రతి రోజూ తాగి వెళ్లి భార్యను కొడతాడట. ఇంట్లో ఆడవాళ్లను చావగొట్టే వీళ్లు దేశంలోని అమ్మాయిలకు రక్షణ కల్పిస్తారా? అను : అయినా విద్యార్థులు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఇలా నడుచుకోవాలంటూ ఆంక్షలు పెట్టడానికి వీళ్లెవరు ? మమ్మల్ని ప్రశ్నించి, వేధించి నలుగురిలో హీరోలవ్వాలనే ఫీలింగ్‌తో చేస్తున్న పనులివి. వైఖరి: కేరళలోని రెస్టారెంట్ పగలగొట్టి వారి వ్యతిరేకతను నిరూపించుకున్నారు. మాపై దాడులు చేయడం, లేదంటే రోడ్లెక్కి అరవడాలు తప్ప.. మోడ్రన్ యుగంలో వచ్చే ఏ ఒక్క మార్పుని ఎవరూ ఆపలేరు. అది అయ్యే పని కాదు. సాయికుమార్: ప్రస్తుతం మా యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ అనే అంశంపై కేరళ విద్యార్థులకు మద్దతుగా మిగతా అన్నిప్రాంతాల విద్యార్థులు ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెబుతున్నారు. నిజమే మోరల్ పోలీసింగ్ పేరుతో మా నడవడికను కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు. రహమతుల్లా: యస్. ఈరోజు స్టూడెంట్స్ మంచేదో, చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో లేరు. స్నేహంలోనైనా, ప్రేమలోనైనా చేదు అనుభవం ఎదురైతే ఆ బాధ్యత తనదే. లేదంటే వారి తల్లిదండ్రులది. దీని కోసం ప్రత్యేకంగా ఎవరో పని చేయాల్సిన అవసరం లేదు. ‘కిస్ ఆఫ్ లవ్’ అంటే ఎవరిని ఎవరైనా ముద్దుపెట్టుకునే స్వేచ్ఛ ఉంది అని అర్థం. అది అమ్మ కావొచ్చు, అక్క కావొచ్చు, ప్రేమికురాలు కావొచ్చు, భార్య కావొచ్చు. దాన్ని ఒక భావోద్వేగంగానే చూడాలి. భువనేశ్వరి -
హాట్ టాపిక్
-
తమ్ముళ్లను నమ్మొచ్చా?
టీడీపీ అభ్యర్థుల్లో అంతర్మథనం తాయిళాల పంపిణీ ఎలా అన్న సందేహం అనుచరుల్ని నమ్ముకుంటే పోలా అని నిర్ణయం నక్కపల్లి, న్యూస్‌లైన్: అసలే ఎన్నికల వేళ... పరిస్థితి చూస్తే అంతంతమాత్రంగా ఉంది... కనీసం తాయిళాలిచ్చైనా ఓటర్లను ప్రసన్నం చేసుకుందామంటే అదీ అంత ‘వీజీ’లా లేదు. ఇప్పుడెలా? టీడీపీ అభ్యర్థుల అంతర్మథనమిది. అసలే మూడు వర్గాలు... ఆరు గ్రూపుల గోలతో సతమతమవుతుంటే పోనీ ఇచ్చిందయినా సక్రమంగా ఓటరుకు చేరుతుందా? లేక మధ్యలోనే మింగేస్తారా? అన్నదే వీరి అనుమానం. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశం. తెలుగు తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్లా చర్చ సాగుతోంది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం స్థానంలో ఎంపీ అభ్యర్థితోపాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికేతరులే కావడంతో వీరంతా పూర్తిగా పార్టీ కేడర్‌పైనే ఆధారపడి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. జగన్మోహన్రెడ్డికి ఒకసారి అధికారమిద్దామన్న కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఎంత డబ్బు వెదజల్లి ఎన్ని ఆశలు చూపినా ఓటర్లు మాత్రం వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ కార్యకర్తలు, నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే ఓటర్లకు చేరుతుందా అన్న గుబు లు అభ్యర్థులను వేధిస్తోంది. ప్రధానంగా ‘ఎలాగూ ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు కావున, ఇప్పుడు డబ్బులిచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఈ పరిస్థితుల్లో అభ్యర్థులిచ్చిన మొత్తం కాస్తా మనమే నొక్కేస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకున్నట్లు ఉంటుంది కదా’ అన్న ఆలోచన పలువురు తమ్ముళ్లు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా మరో ఐదేళ్ల వరకు ఎన్నికలుండవు, ఈ ఎన్నికల తర్వాత అభ్యర్థులు పలకరించిన పాపాన పోరు. ఈ పరిస్థితుల్లో అందినకాడికి వెనుకేసుకోవడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది తమ్ముళ్లలో ఉన్నట్లు సమాచారం. ఆ నోటా ఈ నోటా విస్తరించిన ఈ మాటలు చివరికి అభ్యర్థుల చెవుల్లోకి చేరాయి. దీంతో డబ్బులు పంచినా ఓటర్లకు చేరుతాయన్న గ్యారంటీ లేదన్న నమ్మకానికి అభ్యర్థులు వచ్చేశారు. పైగా ఎన్నికల ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరారు. ఎప్పటి నుంచో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, వీరికి మధ్య అసలు పొసగడం లేదు. దీంతో ఓటర్లకు పంచే డబ్బులు మా ద్వారా పంపిణీ జరగాలంటే... మా ద్వారా జరగాలంటూ రెండు వర్గాలు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒక వర్గానికి ఇచ్చి మరొక వర్గానికి ఇవ్వకపోతే ఏ చిక్కు వచ్చిపడుతుందోననే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారని సమాచారం. సొంతవారితోనే కొంత మేలు స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లను నమ్ముకునే కంటే తమ వారిని నమ్ముకుంటేనే కొంతై నా మేలు జరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నట్లు స మాచారం. ఒక అభ్యర్థి అయితే ఏకంగా తన సంస్థల్లో పనిచే సే సిబ్బందిని, చదువుతున్న విద్యార్థులతోపాటు తన సొం త ప్రాంతానికి చెందిన వారితో తాయిళాలు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సదరు అభ్యర్థి అనుచర గణం గ్రామాల్లో ఈ దిశగా పనిచేస్తున్నారు. పార్టీ జెండాలు, స్టిక్కర్లు, పోస్టర్లను వారే పంపిణీ చేస్తున్నారు. దీన్ని చూసి స్థానిక తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జెండాలు మోసే తమను కాదని వారి సొంత మనుషులతో ఎలాపంపిణీ చేస్తారో చూద్దామంటూ తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉప ఎన్నికల్లో ఇలా వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వచ్చి పెత్తనం చేయడంవల్లే కాంగ్రెస్, టీడీపీలు పరాజయం పాలయ్యాయనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అభ్యర్థులు తమ వారితో డబ్బులు పంపిణీ చేయిస్తారా? లేక ఏదయితే అదయిందిలే అని స్థానికంగా ఉన్న కార్యకర్తలకే ఇస్తారా చూడాలి. -
ఎగిరితే... గంతే..
‘ఎంత ఎగురుతారో ఎగురనీ... వుున్సిపల్ ఎన్నికల్లో గెలువకుంటే చెబుదాం...’ అంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లా పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో టికెట్ రావాలంటే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు గట్టెక్కాలని మెలికపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన అనుకూల పవనాలతో కారెక్కి సునాయసంగా అసెంబ్లీలో అడుగు పెడుదావునుకుంటున్న ఆశావహుల దూకుడుకు కళ్లెం వేశారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అదే సందర్భంగా ఈ విషయుం చర్చకు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఇదో హాట్ టాపిక్‌గా వూరింది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం, అభ్యర్థుల ఎం పిక, కచ్చితంగా విజయం సాధించాలనే అంశాలపై ఈ భేటీలో ఎక్కువగా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు కేసీఆర్ ఈ హెచ్చరిక జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అంశంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని అధినేత స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ టికెట్లు ఖరారయ్యాయని ఎవరూ భావించొద్దని, మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలో ఆలోచించాల్సి వస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసినట్లు తెలిసింది. అదే సవుయుంలో ఆశావహులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సవూచారం. దీంతో ఇన్నాళ్లు టికెట్ తమకే అని ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు కంగుతిన్నారు. మున్సిపల్ పట్టణాల్లో గత వైభవం లేని టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు వుున్సిపాలిటీలు, అరుుదు నగర పంచాయుతీలున్నారుు. వీటిలో ఒక్కటి కూడా టీఆర్ఎస్ గుప్పిట్లో లేదు. కానీ.. ఈ ఎన్నికలు జరుగుతున్న తొమ్మిది సెగ్మెంట్లలో ఆరు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రావుగుండం, కోరుట్ల, సిరిసిల్ల, కరీంనగర్, వేవుులవాడ, హుజూరాబాద్ ఎన్నికలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షలా తయూరయ్యూరుు. ప్రతిష్టాత్మకంగా వూరిన కరీంనగర్, రావుగుండం కార్పొరేషన్లు రెండూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుప్పిట్లోనే ఉన్నారుు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పరిధిలో రెండు వుున్సిపాలిటీలుండగా... ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో రెండు నగర పంచాయుతీలకు ఎన్నికలు జరుగుతున్నారుు. ఈ సవుయుంలో అనుకున్న ఫలితాలు రాకపోతే తమ జాతకం మారిపోతుందో.. ఏమోనని.. ఆ పార్టీ వుుఖ్య నేతలు తల పట్టుకుంటున్నారు. వుుందుగా వచ్చిన ఈ ఎన్నికలు తమ గండాన వచ్చాయంటూ వాపోతున్నారు. -
ఇదేంది బాస్
జూనియర్ల వద్ద సీనియర్ల కొలువు {పొబేషనరీ ఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు సీనియర్లకు సెకండ్ ఎస్సైగా డిమోషన్ పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్‌గా పీఎస్సై పోస్టింగ్‌లు అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత సబ్ ఇన్స్పెక్టర్లు నిన్నటి వరకు వారందరూ సీనియర్ ఎస్సైల వద్ద వృత్తిలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుంచి కేసు దర్యాప్తు వరకు అనేక విషయూలను సీనియర్ల వద్ద ఉండి నేర్చుకున్నారు. సీనియర్లు ఆదేశించగానే ‘ఎస్ సర్’ అని సెల్యూట్ చేస్తూ గౌరవించారు. పోలీస్ బాస్‌ల నిర్ణయం పుణ్యమా.. అని తాజా పరిస్థితి తారుమారైంది. ప్రొబేషనరీ ఎస్సైలకు సీనియర్లే సెల్యూట్ చేయూల్సిన వింత పరిస్థితి ఏర్పడింది. ఇది తమను అవమానించడమేనని, ఆత్మగౌరవాన్ని గాయపరచడమేనని సీనియర్లు వాపోతున్నారు. వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల(పీఎస్సై)ల పోస్టింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. సీనియారిటీని విస్మరించి కొత్తగా శిక్షణ తీసుకున్న పీఎస్సైలకు ఎస్హెచ్ఓ స్థానాలు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న సీనియర్లను అదేస్థానంలో ఉంచి.. కొత్తగా శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన వారికి ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. 2013 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి తాజాగా రూరల్‌లో 27 మందికి, అర్బన్ పరిధిలో ఆరుగురికి శుక్రవారం పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఇచ్చిన పోస్టింగ్ ప్రాధాన్యతే ఇక్కడ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆయూ స్థానాల్లో ఎస్సై లుగా కొనసాగుతున్న వారిని డిమోట్ చేసి వారి స్థానంలో ప్రొబేషనరీ ఎస్సైలను నియమించారు. 2002, 2007, 2009 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు పనిచేస్తున్న స్థానాలకు 2013 బ్యాచ్ ఎస్సైలను పంపించారు. వారి వద్ద సీనియర్లు సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ అందుకున్న కొందరు ఎస్సైలను ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడంతోపాటు వారి కిందే అక్కడే పని చేయాలని సీనియర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. నిన్నగాక మొన్న శిక్షణ పూర్తిచేసుకున్న వారు చెప్పినట్లు ఇకపై సీనియర్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి న్యాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తికాకుండానే... ప్రస్తుతం పోస్టింగ్‌లు పొందిన ఎస్సైలకు ప్రొబేషనరీ డిక్లేర్ కావడానికి ఇంకా 18 నెలల సమయం ఉంది. వీరంతా 13 నెలలు హైదరాబాద్ అప్పాలో శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ కాలం ప్రొబేషనరీ పిరియడ్‌లోకి రాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 6 నెలలపాటు ఇక్కడ శిక్షణ ఉంటుది. ఈ సమయంలో వారు కానిస్టేబుల్‌గా, హెడ్‌కానిస్టేబుల్‌గా, ఏఎస్సైగా పలు విభాగాల్లో పనిచే యాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల కాలం కలిపితే మరో 18 నెలలు ఇంకా ప్రొబేషనరీ కాలం ఉంటుంది. ఈ కాలం పూర్తయితే సర్వీసు పరంగా వీరికి అన్ని కౌంటింగ్‌లోకి వస్తాయి. ఈ ప్రొబేషనరీ సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఏమైనా తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం నుంచే డిస్మిస్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదెక్కడి న్యాయం.. అర్బన్ పరిధిలో ఆరుగురు పీఎస్సైలను మామునూరు, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, జఫర్‌గఢ్ పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అయా స్థానాల్లో పనిచేస్తున్న వారంతా సెకండ్ ఎస్సైలుగా కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రూరల్ పరిధిలో మరిపెడ పీఎస్ ఎస్సై జె.వెంకటరత్నం, చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, చేర్యాల ఎస్సై సూర్యప్రసాద్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్సైలకు బాధ్యతలు అప్పగించి అక్కడే సెకండ్ ఎస్సైలుగా కొనసాగాలి. నర్సింహులపేట ఎస్సై వై. వెంకటప్రసాద్ ఏటూరునాగారం బదిలీ అయ్యూరు. ఆయన కూడా తన వద్ద శిక్షణ పొంది ఏటూరునాగారం పీఎస్ ఎస్సైగా పోస్టింగ్ పొందిన రవీందర్ వద్ద సెకండ్ ఎస్సైగా పనిచేయూల్సి ఉంది. పదేళ్ల సీనియూరిటీ కలిగిన చిట్యాల ఎస్సై ప్రవీణ్‌కుమార్, మామూనూరు ఎస్సై సత్యనారాయణ సైతం తాము పనిచేసే స్టేషన్లలోనే సెకండ్ ఎస్సైలుగా డిమోట్ అయ్యూరు. ఆవేదన చెందుతున్న సీనియర్లు జూనియర్లు వస్తే సీనియర్లకు పదోన్నతి ఉండాలిగానీ అందుకు విరుద్ధంగా డిమోట్ చేయడం చర్చనీయూంశంగా మారింది. అనుకోని విధంగా ఉత్తర్వులు రావడంతో బాధిత ఎస్సైలు కలత చెందుతున్నారు. జూనియర్ల వద్ద తమను సెకండ్ ఎస్సైలుగా పనిచేయించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన చెందుతున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి తమను బలిచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే తమను వీఆర్లోనో, ఉన్నతాధికారులకు అటాచ్డ్గానో నియమించినా బాగుండేదని వాపోతున్నారు. శాఖాపరంగా తప్పులు చేసిన వారికి మాత్రమే.. ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తారని కాని తాము ఎలాంటి తప్పుడు విధానాలు అవలంభించకున్నా తమకు ఈ శిక్ష ఎందుకు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. -
వచ్చిన మూడు నెలల్లోనే...పట్టుబిగిస్తున్న కలెక్టర్
=ఇసుక, చెరువులపై ఆరా =సుతిమెత్తని కత్తిలా పాలన =శాఖల వారీగా సమాచారం సేకరణ =జిల్లా అధికారుల్లో ఇదే హాట్ టాపిక్! సాక్షి, మచిలీపట్నం : ‘జిల్లాలో కీలకమైన శాఖను చూడాల్సిన మీరు మూడు మండలాలకు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు చూస్తే ఏం న్యాయం చేస్తారు..’ అంటూ ఒక అధికారికి ఊరడింపు. ‘ఇతర శాఖలో పనిచేసే మీరు రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీవోపై కూడా విచారణ నిర్వహించేలా అవకాశం ఎలా వచ్చింది.. మీ రికార్డు చూస్తే చాలా మంది అధికారులపై మీరే విచారణ అధికారిగా వ్యవహరించారు..’ అంటూ మరో అధికారిపై ఆరా. ‘ఫైళ్లు, కాగితాల్లో మునిగిపోకుండా కాస్తయినా హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించండి..’ అంటూ ఇంకో అధికారికి సుతిమెత్తని హెచ్చరిక. ‘జిల్లాలో అవినీతిరహితంగా ప్రజలకు సేవలు అందించలేమా.. చిత్తశుద్ధితో పనిచేయండి..’ అంటూ అధికారంతో కూడిన ఆదేశం. ఇలా వేర్వేరు సందర్భాల్లో కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా యంత్రాంగం విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో బాధ్యతలు చేపట్టి మూడు నెలలు నిండకముందే పాలనా యంత్రాంగంపై ఆయన పట్టు బిగిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారు. సీరియస్‌గా స్పందించినట్టు లేకపోయినా సుతిమెత్తని కత్తిలా విషయాన్ని నరుక్కుని పోతున్నారు. దీంతో ఆయన తమకు కొరుకుడుపడటం లేదని పలువురు కీలక అధికారులు తమ సొంత మనుషుల వద్ద మధనపడాల్సిన పరిస్థితి వచ్చింది. పనిచేయని బిల్డప్‌లు... కలెక్టర్‌ను బుట్టలో వేసుకుని తమ పని కానిచ్చుకునేందుకు పలువురు అధికారులు చేసిన ప్రయత్నాలు పనిచేయలేదని సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు పనిచేసిన కలెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించి తక్కువ సమయంలోనే బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసినవారి నీడ ఆయా కలెక్టర్లపై పడటంతో అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఇదే జిల్లాలో పలు శాఖల ఉన్నతాధికారులుగా ఉన్నవారు కొందరు జిల్లా కలెక్టర్లను తమ దారికి తెచ్చుకుని పబ్బం గడుపుకొనేందుకు ప్రాధాన్యతఇచ్చేవారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో కీలక అధికారి రకరకాల మాంసాహారాలు, నోరూరించే వంటకాలతో క్యారేజీ తీసుకెళ్లి మరీ పెట్టి అవన్నీ తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆకట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో అధికారి సర్వం తానే అన్నట్టుగా హంగామా చేసుకుని ఆయన పేరు చెప్పుకొని అవకాశం ఉన్నంతమేర ‘పోగేసుకున్నట్టు’ సమాచారం. ఇలాంటి ఎత్తులు కొత్త కలెక్టర్ వద్ద ఎలా వేయాలా అని ఆలోచించే పలువురు అధికారులు ఇప్పుడు కంగారుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొత్త కలెక్టర్‌ను బుట్టలో వేసేందుకు అప్పుడే జిల్లాలో పలు శాఖల ఉన్నత అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఇసుక, ఆక్వాపై ఆరా.. జిల్లాను పాడికుండగా మలుచుకున్న కొందరు అధికారులు ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం హడావుడి చేయకుండానే కాసులు కురిపించే వనరులను పలువురు తమకు అనుకూలంగా మలుచుకుని కాలక్షేపం చేసేవారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇక్కడి ఇసుక మాఫియా, ఆక్వా చెరువుల తవ్వకం, భూదందాలు, మడ అడవుల ఆక్రమణలపై ఇప్పటికే ఆరా తీసినట్టు సమాచారం. అనుమతి లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక తవ్వకాలపై జిల్లా అధికారులు కొందరు చూసీచూడనట్టుగానే వ్యవహరించడంలో పలువురి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కొల్లేరు, తీర ప్రాంత మండలాల్లోనూ అనుమతి లేకుండా ఇష్టానుసారం చేపల చెరువుల తవ్వకాలు సాగిపోతున్నాయి. జీవ వైవిధ్యానికి కీలకంగా ఉండే తీరప్రాంతంలోని మడ అడవులు ఆక్రమణ కోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వాటిపై కోర్టు వ్యాజ్యాలు తదితర విషయాలపై కూడా ఆయన సమాచారం రప్పించుకుంటున్నారు. వచ్చి మూడు నెలలు నిండకముందే వీటన్నిటిపై కొత్త కలెక్టర్ దృష్టిపెట్టడం కొందరు అధికారుల్లో కంగారుపుట్టిస్తోంది. గతానికి భిన్నంగా.. గతంలో ఇక్కడ పనిచేసి కలెక్టర్లు సోమవారం ప్రజావాణికి మాత్రమే జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చి మిగిలిన రోజుల్లో విజయవాడ క్యాంపు ఆఫీసుకు పరిమితమయ్యేవారు. కలెక్టర్ రఘునందనరావు మాత్రం వారంలో కనీసం నాలుగు రోజులు బందరులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇటీవల వచ్చిన తుపాను సమయంలో తన చాంబర్‌కే పరిమితం కాకుండా దిగువస్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండేలా రెండు రోజులపాటు జాయింట్ కలెక్టర్ చాంబర్లో కూర్చుని విధులు నిర్వర్తించారు. క్రమంగా తనదైన తరహాలోనే ప్రతి శాఖ సమాచారం, అధికారుల పనితీరును ఆరా తీసుకుంటూ ఓ కంట కనిపెడుతుండటం వారిలో వణుకు పుట్టిస్తోంది. -
రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తేల్చేసినట్టేనా?
-
ట్రెండ్ మార్చిన అధికార కాంగ్రెస్ నేతలు