‘ఎంత ఎగురుతారో ఎగురనీ... వుున్సిపల్ ఎన్నికల్లో గెలువకుంటే చెబుదాం...’ అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లా పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో టికెట్ రావాలంటే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు గట్టెక్కాలని మెలికపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన అనుకూల పవనాలతో కారెక్కి సునాయసంగా అసెంబ్లీలో అడుగు పెడుదావునుకుంటున్న ఆశావహుల దూకుడుకు కళ్లెం వేశారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అదే సందర్భంగా ఈ విషయుం చర్చకు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఇదో హాట్ టాపిక్‌గా వూరింది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం, అభ్యర్థుల ఎం పిక, కచ్చితంగా విజయం సాధించాలనే అంశాలపై ఈ భేటీలో ఎక్కువగా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు కేసీఆర్ ఈ హెచ్చరిక జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌లు ఇచ్చే అంశంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని అధినేత స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ టికెట్లు ఖరారయ్యాయని ఎవరూ భావించొద్దని, మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోతే ఎవరికి టికెట్ ఇవ్వాలో ఆలోచించాల్సి వస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసినట్లు తెలిసింది.
అదే సవుయుంలో ఆశావహులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సవూచారం. దీంతో ఇన్నాళ్లు టికెట్ తమకే అని ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంగుతిన్నారు. మున్సిపల్ పట్టణాల్లో గత వైభవం లేని టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు వుున్సిపాలిటీలు, అరుుదు నగర పంచాయుతీలున్నారుు. వీటిలో ఒక్కటి కూడా టీఆర్‌ఎస్ గుప్పిట్లో లేదు. కానీ.. ఈ ఎన్నికలు జరుగుతున్న తొమ్మిది సెగ్మెంట్లలో ఆరు చోట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రావుగుండం, కోరుట్ల, సిరిసిల్ల, కరీంనగర్, వేవుులవాడ, హుజూరాబాద్ ఎన్నికలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షలా తయూరయ్యూరుు. ప్రతిష్టాత్మకంగా వూరిన కరీంనగర్, రావుగుండం కార్పొరేషన్లు రెండూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గుప్పిట్లోనే ఉన్నారుు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పరిధిలో రెండు వుున్సిపాలిటీలుండగా... ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో రెండు నగర పంచాయుతీలకు ఎన్నికలు జరుగుతున్నారుు. ఈ సవుయుంలో అనుకున్న ఫలితాలు రాకపోతే తమ జాతకం మారిపోతుందో.. ఏమోనని.. ఆ పార్టీ వుుఖ్య నేతలు తల పట్టుకుంటున్నారు. వుుందుగా వచ్చిన ఈ ఎన్నికలు తమ గండాన వచ్చాయంటూ వాపోతున్నారు.
ఎగిరితే... గంతే..
Published Sat, Mar 8 2014 4:06 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement
Advertisement