సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m
— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024
Comments
Please login to add a commentAdd a comment