harathi
-
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలెట్ సందీప్‌కుమార్ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్ అంటూ 108 సిబ్బందిని అభినందించారు. -
వివాదంలో మెగా హీరో.. అసలేం జరిగిందంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ఇటీవలే విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి వివాదం మొదలైంది. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. అక్కడ సుబ్రమణ్యస్వామివారికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే హీరోకు తలనొప్పిగా మారింది. అయితే నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) -
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
Tirumala Nitya Harathi: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి
తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. తమ జీవితం ధన్యమైందని భావిస్తారు భక్తులు. ఇక స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకుని స్వామివారికి ఇచ్చే హారతిని అందుకుంటే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదని భావిస్తారు భక్తులు. అటువంటిది ప్రతి నిత్యం స్వామివారికి హారతిని సమర్పించుకునే భాగ్యం లభిస్తే అలాంటి అవకాశం ఒకటి వుంటుందా అంటే అన్నింటికీ అవుననే సమాధానం. నిత్యహారతుల కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం హారతులు సమర్పించే భాగ్యం కొంతమందికి లభిస్తోంది. 1986లో ఐదుగురితో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు 22 మందికి విస్తరించింది. శ్రీవారి ఆలయంతో సంబంధం వున్న మఠాల ప్రతినిధులకు స్వామివారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే కొన్ని కుటుంబాలకు ఈ మహద్భాగ్యం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో పూజాకైంకర్యాలను బట్టి కొన్ని రోజులలో మొదటి గంట జరుగుతున్న సమయంలో నిత్యహారతికి అనుమతిస్తుండగా మరికొన్ని రోజులలో రెండవ గంట తరువాత నిత్యహారతులకు అనుమతిస్తారు. మొదటి గంట ముగిసిన తరువాత నిత్యహారతులు సమర్పించే వారిని సన్నిధి వరకు అనుమతిస్తుండగా వారు తెచ్చిన పళ్లెంతో స్వామివారికి హారతిని అర్చకులు సమర్పిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం వారిని రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతిస్తారు. మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో అయితే రెండవ గంట అయిన తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణమండపం వేంచేపు కాబడిన తర్వాత వారిని అనుమతిస్తారు. మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, రెండవ గంట అయిన తర్వాత నిత్యహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకం, రెండవ అర్చన, రెండవ గంట, సర్కార్ హారతి, శ్రీవారి వేంచేపు అయిన తర్వాత నిత్య హారతులకు అనుమతి ఇస్తారు. గురువారం రోజున మూలమూర్తికి సడలింపు కార్యక్రమం, తిరుప్పావడ సేవ తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. శుక్రవారం రెండవ తోమాల, రెండవ అర్చన, రెండవ గంట ముగిసిన తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. విశేష ఉత్సవాలు, అత్యవసర సమయంలో మొదటిగంట, బలి అయిన వెంటనే శ్రీవారి ఉత్సవమూర్తులు కళ్యాణమండపానికి వేంచేపు చేసిన తర్వాత అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన ధ్వజారోహణం రోజు రాత్రి నిత్యహారతులకు అనుమతిస్తారు. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత) అహోబిల మఠానికి 1997 నుంచి అనుమతి ఇవ్వగా ఆండావన్ ఆశ్రమానికి 1988లో, పరకాల స్వామి మఠానికి 1997లో, శ్రీమన్నారాయణ చిన్న జీయర్ మఠానికి 1986లో, శ్రీ ఉత్తరాది మఠానికి 1997లో, రాఘవేంద్రస్వామి మఠానికి 1997లో, శ్రీశృంగేరి శంకర మఠానికి 1986లో, శ్రీ కంచికామకోటి పీఠానికి 1988లో, ఉడిపి మఠానికి 2002లో, వల్లభాచార్య మఠానికి 1986లో, ఆర్య మైత్రేయ స్వామి వారికి 1986లో, కర్ణాటక రాష్ట్ర చారిటీస్‌కి 1986లో, నారద మందిరానికి 1986లో, తులసీదాసు మఠానికి 1986లో, రాధాకృష్ణ మందిరానికి 1988లో, వ్యాసరాజ మఠానికి 1997లో, లక్ష్మీనారాయణ మందిరానికి 1986లో, హాథీరాంజీ మఠానికి 1986లో, మూల మఠానికి 2005లో, పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానానికి 2007లో, తాళ్ళపాక అన్నమాచార్య కుటుంబానికి 2007లో, అనంతాళ్వార్ కుటుంబానికి 2009 నుంచి నిత్యహారతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. (క్లిక్ చేయండి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...) -
ముగిసిన కృష్ణా పుష్కరాలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
బీచుపల్లి : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా ముగిశాయి. బీచుపల్లి ఘాట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి 80 లక్షలు, నల్లగొండ జిల్లాలో 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల్లో భక్తులకు విశిష్ట సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
వేడుకగా కృష్ణా హారతి
-
కృష్ణమ్మకు మహా హారతి
అమరావతి : ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవాలయంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా హారతి కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, పుష్కరాల ప్రత్యేకాధికారి డీసీపీ ఎల్.ఎస్.చౌహాన్, స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలుత నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పూర్ణకుంభం పూజలు చేసిన అనంతరం నదికి నక్షత్ర, కుంభ, నాగ, నంది ధూప, కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వైభవంగా సాగితున్న కృష్ణా పుష్కరాలు
-
ముగిసిన అంత్యపుష్కర ఘట్టం
-
ఈ ఘనత మాదే
కృష్ణా–గోదావరి సంగమంపై సీఎం చంద్రబాబు నదీమ తల్లులకు ప్రత్యేక పూజలు నవ హారతి సభకు వచ్చేందుకు నిరాకరించిన డ్వాక్రా మహిళలు ఇంజినీరింగ్ విద్యార్థుల తరలింపు ముఖ్యమంత్రి రాక ఆలస్యంతో వారూ జంప్ ఇబ్రహీంపట్నం : కృష్ణా,గోదావరి నదుల అనుసంధాన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంగమ ప్రాంతానికి చేరుకున్న ఆయన తొలుత పుష్కర ఘాట్లను పరిశీలించారు. అనంతరం నదీమ తల్లులకు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ నవ హారతి ఇచ్చారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు జీవనదులను కలిపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. బ్రిటీష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించటం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఆయన ఫొటోలు విగ్రహాలకు పూజలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రధాన కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరువును చూసి భయపడేవారమని ఇప్పుడు నదుల అనుసంధానంతో కరువు భయపడాలన్నారు. పొగడ్తలతో... ఇదిలా ఉంటే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గృహనిర్మాణ కార్పొషన్ చైర్మన్ వర్ల రామయ్య, మరో మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని నానిలు సీఎం చంద్రబాబును అపర భగీరథుడు, సర్ ఆర్థర్ కాటన్‌తో పోల్చారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కాటన్ మాదిరిగా చంద్రబాబు ఫొటోలను రైతులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని సూచించారు. సీఎం సభకు కళాశాల విద్యార్థులు ఉదయం 11 గంటలకు సీఎం సమావేశమని డ్వాక్రా మహిళలను ఆటోలు, బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు. సోమవారం సీఎం సభకు తరలివచ్చిన మహిళలు సభవాయిదా పడడంతో అవస్థలు పడ్డారు. దీంతో పలు గ్రామాల్లో మహిళలు మంగళవారం సీఎం సభకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు ప్రాంతాల్లోని నిమ్రా, నోవా, మిక్, అమృతసాయి, జాకీర్‌హుసేన్ వంటి పలు జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను సభకు తరలించారు. సమావేశం రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం కావడంతో సీఎం రాకముందే విద్యార్థులు వెళ్లిపోవటం కనిపించింది. బ్యాగులు, టిఫిన్‌బాక్స్‌లు కళాశాలలో వదిలి రావడంతో మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోయి విద్యార్థులు ఆకలితో అలమటించారు. విద్యార్థులతో పాటు మహిళలు వేదిక నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. సీఎం మాట్లాడుతున్న సమయంలో కూడా మహిళలు భారీగానే బయటకు తరలివెళ్లారు. కేవలం 500 మంది ముందు వరుసలో కూర్చున్న వారినుద్దేశించి సీఎం చంద్రబాబు 30 నిమిషాలు పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. పుష్కరఘాట్లు పరిశీలించేందుకు వచ్చిన సీఎం పుష్కరాల పనులు అసంపూర్తిగా మిగి లినప్పటికీ వాటిపై కనీసం స్పందించక పోవటం గమనార్హం. -
భద్రాచలంలో గోదావరి నదికి హరతి
-
మళ్లీ పన్నెండేళ్లకు..
-
మళ్లీ పన్నెండేళ్లకు..
వైభవంగా ముగిసిన పుష్కరఘట్టం గోదావరి తల్లికి హారతితో వీడ్కోలు 12 రోజుల్లో సుమారుగా 76.96 లక్షల మంది పుణ్యస్నానాల ఆచరణ తరలివచ్చిన భక్తజనం.. కిక్కిరిసిన ఘాట్లు బాసరలో అధికారికంగా ముగింపు వేడుక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అంగరంగ వైభవంగా సాగిన పుష్కర పర్వం ముగిసింది. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానమాచరించిన లక్షలాది మంది భక్తులు పునీతులయ్యారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలు ప్రారంభమైన ఈనెల 14 నుంచి 24 వరకు అన్ని ఘాట్లలో కలిపి 63.98 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. చివరి రోజు శనివారం 12.98 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. మొత్తం 12 రోజుల్లో కలిపి సుమారుగా 76.96 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. పుష్కరాల చివరి రోజు బాసరలో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గోదావరి హారతి కన్నుల పండువగా జరిగింది. జిల్లాలో ప్రధాన ఘాట్ల అన్నింటిలో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాసరలో బురద నీటిలో... ఏర్పాట్లలో ఘోర వైఫల్యం.. ఘాట్ల మట్టి దిబ్బలు తొలగించకపోవడం.. నదిలోకి నీరు లేకపోవడం.. ఆరంభంలో అవసరంగా వన్‌వే పేరుతో పొలీసుల ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా పలు కారణాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో పుష్కరాల నిర్వహణలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కొత్తగా నిర్మించిన ఘాట్ల వద్ద మట్టిని అలాగే ఉంచడంతో నదిలో ఉన్న నీళ్లు ఘాట్ల వద్దకు చేరలేదు. రూ.కోట్లు వెచ్చించి ఘాట్లు నిర్మించినా.. మట్టి తొలగించే చిన్న పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో బాసరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు బురద నీటిలో స్నానాలు చేయాల్సి వచ్చింది. బాసరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా.. లక్షలాది మంది భక్తులు బాసరలో పుష్కర స్నానాలు ఆచరించి, చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక్క అమ్మవారి దర్శనం విషయంలో మాత్రం దేవాలయ అధికారులు సఫలీకృతులయ్యారు. క్యూలైన్ల నిర్వహణ, గర్భగుడి ముందు ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ వేళల్లో పావు గంటలోపే అమ్మవారి దర్శనం కాగా, రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే రెండు నుంచి మూడు గంటలు పట్టింది. లడ్డూ విక్రయాల విషయంలోనూ అంచనాలు తారుమారు కావడంతో చివరి రెండు రోజులు ఒక్కో భక్తునికి రెండు చొప్పున లడ్డూలు విక్రయించారు. పుష్కరాల 12 రోజుల్లో బాసరకు వీఐపీల తాకిడి అంతగా లేదు. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, సినీ నటుడు సుమన్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. సోన్‌లో సక్సెస్.. పక్కనే 44వ జాతీయ రహదారి.. ఎస్సారెస్పీ నుంచి నిత్యం నీటి విడుదల.. ఘాట్ల వద్ద స్వచ్ఛమైన నీరు.. దీంతో నిర్మల్ మండలం సోన్ ఘాట్లకు భక్తులు పోటెత్తారు. అంచనాలకు మించి తరలివచ్చారు. నిత్యం లక్షల్లో భక్తుల రాకతో ఘాట్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్, మహారాష్ట్రతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా కొనసాగింది. పీఠాధిపతులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు సోన్ఘాట్లో పుష్కర స్నానాలు ఆచరించారు. సోన్‌లో పిండప్రదానాలు చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పిండప్రదానాలు జరిగాయి. మంచిర్యాలలో అంచనాలకు మించి.. జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. నిత్యం లక్షల్లో పోటెత్తడంతో గోదావరి తీరం జనసంద్రాన్ని తలపించింది. ప్రధాన రైలు మార్గం కావడం.. ప్రత్యేక రైళ్లు నడపడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. పైగా ఇక్కడ గోదావరి తీరం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, పుష్కలంగా నీళ్లుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు భక్తులు మొగ్గుచూపారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులను పక్కనే ఉన్న ముల్కల్ల, సీతారాంపల్లి ఘాట్లక మళ్లించాల్సి వచ్చింది. పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞం, నక్షత్ర యాగం వంటి ధార్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఈ ఆధ్మాతిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ప్రవచనాలు చేశారు. పులకించిన ఉత్తరవాహిని.. ఉత్తర వాహిని చెన్నూర్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మొదట్లో పొలీసులు నది వద్దకు వాహనాలను అనుమతించలేదు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఆంక్షలను ఎత్తివేశారు. చివరి మూడు రోజులు గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు భక్తులు షవర్ల వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఘాట్ల వద్ద భక్తులకు మంచినీటిని సరఫరా చేయడంలో మినహా అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. గూడేనికి అంతంతే... శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న గూడెం ఘాట్‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేశారు. ఇక్కడ ఘాట్ నిర్మాణంలో ఉన్న లోపం కారణంగా ఘాట్ వద్దకు నీరు వచ్చి చేరలేదు. పైగా లోతు ఎక్కువగా ఉండటంతో నదిలోకి దిగేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో భక్తులు షవర్ల కిందే పుష్కర స్నానాలు ఆచరించాల్సి వచ్చింది. చాలా మంది భక్తులు సమీపంలో ఉన్న ధర్మపురి, రాయపట్నంకు తరలిపోయారు. జిల్లా మంత్రులతోపాటు, హరీష్, ఈటల వచ్చి చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఏర్పాట్ల విషయమై స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు నిలదీసిన ఘటనలు జరిగాయి. చిన్న ఘాట్లకు అధిక సంఖ్యలో.. ఇంత వరకు అంతగా ప్రచారంలో లేని చిన్న ఘాట్ల వద్ద ఈ సారి పుష్కరాల్లో లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఘాట్లకు అంచనాలకు మించి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముల్కల్ల ఘాట్ వద్ద సుమారు ఆరు లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌లో రెండు లక్షలకు పైగా, కూచన్‌పల్లి, ఖనాపూర్, లక్షెట్టిపేట్, సీతారాంపల్లి వంటి ఘాట్లలకు లక్షకు మించి భక్తులు పుణ్యస్నానాలు చేశారు. -
గోదారమ్మకు హారతి
-
ఘనంగా దత్త జయంతి
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలోని దత్తాత్రేయ మందిరాల్లో దత్త జయంతి సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరారు. వివిధ ఆలయాలలో అఖండ గురుచరిత్ర పారాయణం, హారతి, జన్మోత్సవాలను జరిపారు. పుణేలోని మండాయి దత్తమందిర్, కసబాపేట్‌లోని కాళదత్తమందిర్, నారాయణ్పూర్లోని దత్త మందిర్, నవీపేట్‌లోని లోకమాన్య నగర్ దత్తమందిర్‌లతోపాటు వివిధ మండళ్లు దత్త జయంతి సందర్భంగా తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేశాయి. భక్తులు ఔదాంబిర వృక్షాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అప్పా బల్వంత్ చౌక్‌లోని ఆనందాశ్రమములో భజనలు, ప్రవచనాలు, కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా నాటకాలు ప్రదర్శించారు. వాసుదేవానంద సరస్వతి టేంబేస్వామి సమాధి 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురుచరిత్ర పారాయణం చేశారు. వార్జేలోని చిదానంద ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో భగవతితాయి సతార్కర్ కీర్తనలు ఆలపించారు. అలీబాగ్ నుంచి వచ్చిన పల్లకీ యాత్రకు శ్రీ క్షేత్రనారాయణ్‌పూర్‌లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దీపక్ పాయేగుడే, నిలేష్ కణసే, ఉమేష్ శేడగే, జితేంద్ర బోత్రే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడిని దర్శించ్జుకునేందుకు భక్తులు బారులు తీరారు. సుతార్వాడి మహాదేవ్ మందిరంలో దత్త జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలలో తీర్థ ప్రసాదాలు పంచారు. -
జమున బొమ్మల కొలువు
అపురూపం మసకబారుతున్న పండగ సంప్రదాయాలలో బొమ్మలకొలువు ఒకటి. బొమ్మ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారు ఈ తరంలో అంతగా లేరు. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదా! సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది. చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, ఈ మధ్య అమెరికాలో కొన్న బొమ్మల వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరవలసిందే. జమునగారి ఉత్సాహానికి ఆమె తల్లిగారి ప్రోత్సాహం జత అయ్యింది. ఇద్దరూ ఎన్నో రకాల బొమ్మలను సేకరించేవారు. రామాయణ ఘట్టాలకు సంబంధించిన రామాయణం బొమ్మల సెట్, ఇంకా గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కైలాసం సెట్... అలాగే కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు, తిరుపతి చెక్క బొమ్మలు, ఇంకా చిన్నప్పుడు తను ఆడుకున్న పొయ్యి బొమ్మ, పూజించిన సరస్వతీదేవి బొమ్మ... ఇలా ఎన్నో రకాల బొమ్మలతో శోభాయమానంగా, విజ్ఞానదాయకంగా కొలువును ఏర్పాటు చేసేవారు శ్రీమతి జమున. ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించి అందరికీ పంపేవారు. క్రమం తప్పకుండా ఎందరో ప్రముఖులు వచ్చేవారు. ఎందుకంటే జమునంటే ఇష్టం. జమున ఇంట పేరంటమన్నా ఇంకా ఇష్టం. నవరాత్రులప్పుడు రోజూ ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మలకొలువు పేరంటం... ఇలా తన ఆరో యేట మొదలు గత ఏడు దశాబ్దాలుగా అలుపెరగకుండా జమున బొమ్మల కొలువు పెడుతూనే ఉన్నారు. జమున బొమ్మలకొలువును చూడటానికి ప్రముఖ నటీమణులందరూ విచ్చేసేవారు. ఐదు సంవత్సరాలు హీరోయిన్గా నిలబడితే ఈ రోజుల్లో గొప్ప!ఇరవై అయిదు సంవత్సరాలు ఏకధాటిగా హీరోయిన్గా నటించడం ఆమె గొప్ప!! అంత బిజీ కథానాయిక అయినా... పండగలు - ఆచారాలు - పద్ధతులు - సంప్రదాయాలను మరువకపోవడం ఇంకా గొప్ప!వాటిని ఇప్పటికీ కొనసాగించడం నిజంగా గొప్ప!! -ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్