
వాళ్లకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది!
‘‘అంత ఎత్తు నుంచి పడితే ఇంకేమన్నా ఉందా? కిందపడేలోపే ఆ టెన్షన్‌కు గుండె ఆగిపోతుంది. అంతెందుకు... మరీ సున్నిత మనస్కులైతే ఆ విన్యాసాలు చూస్తున్నప్పుడే కళ్లు తిరిగి పడిపోతారు. నేను మాట్లాడుతున్నది దేని గురించో తెలుసా? ‘సర్కస్’ గురించి. ప్రాణాలకు తెగించి మరీ సర్కస్ కళాకారులు మనకు వినోదం అందిస్తారు.
వాళ్ల ధైర్య సాహసాలకు ‘సెల్యూట్’ చేయాలనిపిస్తుంటుంది. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి మాత్రమే సర్కస్ చూసే తీరిక చిక్కుతోంది. చిన్నప్పుడు మాత్రం తెగ చూసేదాన్ని. నిప్పుల్లోంచి దూకడం, చిన్న పెట్టెలో దేహాన్ని ఇమిడ్చేయడం... ఇలా సర్కస్ కళాకారులు చేసే విన్యాసాలు చూసి, ఎప్పటికైనా మనమూ నేర్చుకోవాలనుకునేదాన్ని. ఆ కోరిక తీరనే లేదు. భవిష్యత్తులో తీరుతుందో లేదో తెలియదు’’
- కత్రినా కైఫ్