
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత అవదేశ్ ప్రధాని పాదాలను తాకేందుకు కిందికి వంగారు. మోదీ వెంటనే ఆయనను వారించారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment